బడ్జెట్ అనేది పెద్ద ప్రహసనమని మొన్న మనం చెప్పుకున్నాం గుర్తుందా..? నిజానికి బడ్జెట్ విషయంలో ప్రభుత్వాలు ఎంత కాజువల్‌గా వ్యవహరిస్తాయో.., సిన్సియరిటీ, సీరియస్‌నెస్ ఏమీ ఉండవని చెప్పే ప్రబల ఉదాహరణ రాజస్థాన్ సీఎం నిర్వాకం… తరచి చూస్తే మొత్తం సిస్టం ఫెయిలైన తీరు గమనించొచ్చు… రాజస్థాన్ సీఎం గెహ్లాట్ వయస్సు 71 సంవత్సరాలు…
ఆమధ్య సచిన్ పైలట్‌ను తొక్కే క్రమంలో ఏకంగా కాంగ్రెస్ హైకమాండ్‌ను కూడా ఎదిరించి, తిరుగుబాటు చేసేదాకా వెళ్లాడు… తెల్లారిలేస్తే రాజకీయాలు తప్ప మరొకటి చేతకాని ముఖ్యమంత్రి… తన బడ్జెట్ ప్రసంగంలో మొన్న దాదాపు ఎనిమిది నిమిషాలు లాస్ట్ ఇయర్ బడ్జెట్ ప్రసంగమే చదువుతూ పోయాడు… సభలో ఉన్నవాళ్లకు కూడా ఏమీ తెలియడం లేదు… అంటే అల్లాటప్పా మూస బడ్జెట్ అన్నమాట… చివరకు స్పీకర్ గమనించి, సీఎంను ఆపాడు…
ఒక ముఖ్యమంత్రి ఎనిమిది నిమిషాలపాటు పాత ఏడాది బడ్జెటే చదువుతూ ఉంటే, ఎవరూ పట్టుకోలేకపోయారంటేనే ఈ బడ్జెట్ సమర్పణ ఎంత లోపభూయిష్టమో అర్థమవుతోంది కదా… బడ్జెట్ కూర్పు, లెక్కలు, ఖర్చు కూడా అంతే… ఏదో రాజ్యాంగరీత్యా ఇది తప్పనిసరి తంతు కాబట్టి సీఎంలు పాటిస్తున్నారు… పైసా ఖజానా నుంచి ఖర్చు చేయాలన్నా బడ్జెట్‌కు ఆమోదం, గత ఏడాది ఖర్చులకు చట్టసభల ఆమోదం తప్పనిసరి…
Ads
పాత బడ్జెట్ ఆధారంగా, ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఆర్థిక శాఖ కొత్త బడ్జెట్ రూపొందిస్తుంది… వివిధ శాఖల అవసరాలు సేకరిస్తుంది… చివరకు బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రి కార్యాలయాలు చెక్ చేశాక, సీఎం ఓకే అని తలూపాక, అప్పుడు బడ్జెట్ ప్రింటింగ్‌కు ఇస్తారు… అక్కడ సీఎం స్వయంగా ఫైనాన్స్ చూస్తున్నాడు కాబట్టి తనే బడ్జెట్ ప్రసంగానికి పూనుకున్నాడు…
తన బ్రీఫ్‌కేసులోకి పాత బడ్జెట్ కాగితాలు ఎలా వచ్చాయి..? కనీసం తనకు ఇచ్చిన బడ్జెట్ ప్రసంగం ప్రతిని కూడా ముఖ్యమంత్రి ఒకసారి చదువుకున్న పాపాన పోలేదన్నమాట… అందులో ఏముందో కూడా తనకు తెలియదు… సిగ్గుమాలిన నిర్వాకం ఇది… చూశారు కదా, మన ప్రభుత్వ శాఖలు, చివరకు ముఖ్యమంత్రి కూడా ఎలా పనిచేస్తున్నారో… ఇదీ రాజస్థాన్ దౌర్భాగ్యం… కాదు, ఏ రాష్ట్రమూ పెద్ద భిన్నంగా ఏమీ లేదు… బడ్జెట్ లెక్కలకూ, వాస్తవ ఖర్చులకూ పొంతనే ఉండదు… తెలంగాణ సీఎం కేసీయార్ అయితే ఈ శాఖల వారీ విభజన ఏందిర భయ్ అనుకుని ‘ప్రత్యేక అభివృద్ధి నిధి’ పేరిట ఏకంగా 10 వేల కోట్లు బడ్జెట్‌లో రాసేసుకున్నాడు… తన విచక్షణ ఇక, దేనికి ఖర్చు చేయాలో తనదే ఇష్టం…!!
Share this Article