ఈనాడులో వచ్చిన ఓ కార్టూన్ నిజంగా మొత్తం ఈనాడు వ్యవస్థ సిగ్గుపడాలి… కార్టూనిస్టులందరూ శ్రీధర్లు కాలేకపోవచ్చు, కొత్త కార్టూనిస్టులు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటూ ఉండవచ్చు, భవిష్యత్తులో ఎదగవచ్చు… కానీ ఒక కార్టూన్ ప్రచురించే ముందు ఎవడూ చూసేవాడు లేడా..? ఎవడికీ సబ్జెక్టు మీద కమాండ్ లేదా..? ఎవడూ అసలు ఏ వార్తల్నీ చదవడం లేదా..? ది గ్రేట్ ఈనాడును బుల్లెట్ రైల్ వేగంతో భ్రష్టుపట్టిస్తున్నారా..? ఉదాహరణ ఈ కార్టూన్… చెప్పాలంటే..? వద్దులెండి, అక్షరనిష్ఠురం..! గీసినవాడు పాపం, కొత్త… తన అవగాహన అంతే కావచ్చు, తనను తప్పుపట్టే పనిలేదు… కానీ వేసినవాడి తెలివి ఏమైంది..? అసలు ఈనాడులో ఒకప్పటి సంపాదకీయ శ్రేణి ఏదీ లేదా..? ఫాఫం, రామోజీరావు… ఒకప్పటి తెలుగు పాత్రికేయ దిగ్దర్శకుడు నేడు సర్వమూ ఉడిగిపోయి, కళ్లముందే నానాటికీ పలుచబడిపోతున్న తన ఇష్టపుత్రికను చూస్తూ… లోలోపల దుఖాన్ని దిగమింగుతూ…
నిజానికి ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభానికి కారణాలు వేరు… అఫ్ కోర్స్, కిమ్ అనే ప్రపంచ స్థాయి పిచ్చి ఎదవ నాయకత్వంలో దేశం నానాటికీ చీకటి యుగాల్లోకి వెళ్లిపోతుండవచ్చు… అదొక పెద్ద మెంటల్ కేసు… అది ఆ దేశ ప్రజల దౌర్భాగ్యం… ప్రపంచ కమ్యూనిస్టులందరూ మూకుమ్మడిగా సిగ్గుతో తలదించుకునే పాలన అది… కారణాల లోతుల్లోకి వెళ్లే చర్చ ఇక్కడ వద్దు గానీ… ఆహారసంక్షోభం నిజం… ప్రజలు కాస్త తక్కువ తినండి అంటూ కిమ్ పిలుపు నిజం… ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 1990 నాటి పరిస్థితి వస్తుందనే భయసందేహాలు నిజం… 1990లో దాదాపు 30 లక్షల మంది తిండి దొరక్క చచ్చిపోయారనేది నిజం… ఇది ప్రకృతి, ప్రపంచం విధించిన శాపమేమీ కాదు… ఆయా పాలకుల విధాననిర్ణయాల శాపం… ప్రజలు అనుభవిస్తారు… ప్రస్తుతం శ్రీలంకలోనూ అదే కదా దురవస్థ… అయితే..?
Ads
ప్రజల్ని తక్కువ తినండి అనే పిలుపు వరకూ వోకే… దానిపై కార్టూన్లు వోకే… కానీ ఇక్కడ కిమ్ కూడా దాచుకుంటున్నదీ, దోచుకుంటున్నదీ ఏమీ లేదు… వాడికి ఏం చేయాలో తెలియడం లేదు… వాడి బుర్ర అంతే… అంతేతప్ప తను మొత్తం తినేస్తూ ప్రజలకు కోత పెడుతున్నది ఏమీ లేదు… వార్తల్ని సరిగ్గా చదివి అర్థం చేసుకుంటే తప్ప సరైన పొలిటికల్ కార్టూన్ పడదు… అసలు పొలిటికల్ కార్టూన్ అంటేనే రాజకీయాల్ని, స్థితిగతుల్ని సరిగ్గా అర్థం చేసుకుని ఒక్క గీతలో సర్వం చెప్పేయడం… మన తెలుగులో అలాంటి కార్టూన్లు ఆశించడం తప్పే… కానీ మరీ ఇంత బ్లండర్గానా..? ఇదొక ఫుడ్ క్రైసిస్… ఓ ట్రాజెడీ… ఆ కటకటను చెప్పగలగాలి… ప్చ్, రోజురోజుకూ వేగంగా దిగజారుతున్న ఈనాడు పాత్రికేయ ప్రమాణాల్లాగే ఇదీ అనుకుని ఓ నిట్టూర్పు విడవాలా..? అంతేనంటారా సార్..?! (మిత్రమా మాకిరెడ్డీ, నీ తప్పేమీ లేదు, నీకు సరైన డైరెక్షన్ ఇవ్వలేకపోవడం నీ వ్యవస్థ ఖర్మ…)
Share this Article