ఒకామె పురుషద్వేషి… సంభోగమంటే ఏవగింపు… కానీ పిల్లలు కావాలి తనకు… అందుకని ఒక వీర్యనిధికి వెళ్లింది, కృత్రిమ గర్భధారణ పద్ధతుల్లో, ఎంచక్కా తన అండంతోనే సంతానం… సింగిల్ మదర్‌గా పెంచుకుంది… ఒక ఉదాహరణ… ఇందులో మగాడి నీడ ఆమెపై పడలేదు కానీ… మగాడి అంశతోనే సంతానం… అది తప్పదు, ప్రకృతి నిర్దేశించింది లేదా జీవపరిణామగతి మనల్ని అలా మార్చింది… మనిషి ఉభయలింగజీవి కాదు కదా… సో… ఆడ, మగ అంశల కలయిక తప్పదు… సరే, మరో ఉదాహరణ చూద్దాం… ఒకాయన స్త్రీ ద్వేషి… ఆడ వాసన అంటేనే గిట్టదు… కానీ పిల్లలు కావాలి… ఓ ఫర్టిలిటీ సెంటర్ వెళ్లాడు… ఒక అండం కొనుక్కున్నాడు… సదరు హాస్పిటల్ తన వీర్యంతో ఆ అండాన్ని కలిపి, టెస్ట్ ట్యూబులో ఫలదీకరించింది… తరువాత ఓ సరోగసీ మదర్‌ను మాట్లాడి, ఆమె గర్భంలో ప్రవేశపెట్టి, ఆ సంతానాన్ని సింగిల్ ఫాదర్‌గా పెంచుకున్నాడు… తప్పదు, బీజం మాత్రమే తనది… క్షేత్రం ఆడదే… ఇక అసలు కథలోకి వెళ్దాం… రియల్లీ ఇంట్రస్టింగు… తనను ఏమని పిలవాలో మీరే తేల్చుకొండి…
గుజరాత్… గోద్రాలో పంచమహల్… తన పేరు జెస్నూర్ డయారా… నిజానికి మగ పుట్టుకే… మగ లక్షణాలు, మగ అవయవాలు అన్నీ ఉన్నయ్ పుట్టినప్పుడు… కానీ పెరిగేకొద్దీ తనలో ఆడలక్షణాలు పెరుగుతున్న తీరు గమనించాడు… అవి మగలక్షణాల్ని డామినేట్ చేస్తున్నాయి… తను స్త్రీ కావాలని నిర్ణయం తీసుకున్నాడు… ఈరోజుల్లో జెండర్ ఛేంజ్ (లింగమార్పిడి) సర్జరీలు కూడా కామన్ అయిపోయాయి కదా… ఇటీవలే ఓ రష్యన్ మెడికల్ యూనివర్శిటీ నుంచి మెడిసిన్‌లో బ్యాచిలర్ డిగ్రీ కూడా సంపాదించాడు… సో, తనకు లింగమార్పిడి, అవయవాల్లో మార్పులు గట్రా మొత్తం ఓ ఐడియా ఉంది… అయితే ఓ నిర్ణయం తీసుకున్నాడు తను… తనకు పుట్టబోయే బిడ్డకు తనే తల్లి, తనే తండ్రి కావాలి అని…! అంటే ఆడతో గానీ, మగతో గానీ సంపర్కం అవసరం లేకుండా… ప్యూర్ మై ఓన్ బేబీ… హండ్రెడ్ పర్సెంట్ జెనెటికల్లీ… వెరీ రేర్ కేస్… మే బీ ఫస్ట్ ఇన్ వరల్డ్… దానికి ఏమేం చేయాలో ఆలోచించాడు… స్టార్ట్ చేసేశాడు…
Ads
ముందుగా తన వీర్యాన్ని ఆనంద్‌లోని ఓ ఫర్టిలిటీ సెంటర్లో క్రయోజనిక్ పద్ధతిలో భద్రపరిచాడు… వీర్యం క్వాలిటీ కూడా చెక్ చేయించుకున్నాడు… పర్ఫెక్ట్… త్వరలో లింగమార్పిడి సర్జరీకి సిద్ధం అవుతున్నాడు… అంటే స్త్రీగా మారబోతున్నాడు… తన గర్భాశయం గట్రా ముందే పరీక్షించుకున్నాడు… సో, ఒకసారి స్త్రీగా మారిపోయిన తరువాత తన వీర్యాన్నే తను ఎక్కించుకుంటుంది… దానికి ఆ ఫర్టిలిటీ క్లినిక్ సాయం తీసుకోనుంది… తరువాత మామూలు ఆడవాళ్లలాగే కడుపు, డెలివరీ ఎట్సెట్రా… అయితే అనుకున్నంత ఈజీ టాస్కేమీ కాదు ఇది… పలు దశల్లో సక్సెస్ రేటు ఎక్కువగా ఉండాలి… అయితేనేం..? డయారా ఫిక్సయిపోయింది… తను అనుకున్నట్టే సజావుగా అన్నీ జరిగితే… జన్యుపరంగా తల్లీ, తండ్రీ ఒకరే అయిన ఓ బిడ్డను మనం చూడబోతున్నాం… వారెవ్వా…!!
Share this Article