.
ఉదయభాను… తెలుగు శాటిలైట్ టీవీలకు సంబంధించి బహుశా మొదటి యాంకరిణి… చాలా పాపులర్ హోస్ట్… తరువాత సినిమా నటి కూడా… హఠాత్తుగా ఆమె కెరీర్‌కు పెద్ద బ్రేక్… పెళ్లి, వివాదాలు… ఏవో చికాకులు…
అసలు ఈ సుమ, ఈ ఝాన్సీ, ఈ శ్రీముఖి ఎట్సెట్రా యాంకర్లు తెరప్రవేశం చేయకముందే ఉదయభాను ప్రవేశించింది… స్పాంటేనిటీ, ఎనర్జీ, సరైన ఉచ్ఛారణ, కలివిడితనం, నవ్వు, సభ్యత ఆమెకు అస్సెట్స్… కానీ..?
Ads
అప్పుడప్పుడూ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినట్టే ఏదో టీవీ షోలో మెరవడం, మళ్లీ మాయమవడం… తెలుగు టీవీలు, సినిమా ఫంక్షన్ల హోస్టింగుకు సంబంధించి ఉదయభానుది నిజంగానే ఓ విచిత్రమైన అధ్యాయం… ఒకప్పుడు ఇన్‌డోర్ ఈవెంట్లే కాదు, బహిరంగంగా జనం నడుమ ఈవెంట్లనూ హ్యాండిల్ చేయగలిగేది…
- గత ఏడాది మొదట్లో జీతెలుగు వాడయితే ఓ ప్రోమో రిలీజ్ చేస్తూ గోల్డెన్ లేడీ ఆఫ్ జీతెలుగు ఈజ్ బ్యాక్ అని గొప్పగా చెప్పుకున్నాడు… కొన్నాళ్ల క్రితం అదేదో లోకేష్ పాదయాత్రకు లింకు కార్యక్రమంలా ఏవో షోలు కూడా చేసింది… అబ్బే, రాజకీయాలకు సంబంధం లేదు… నేను బీసీ గళమెత్తడానికి వచ్చాను అని చెప్పుకుంది… కెరీర్ మేనేజ్‌మెంట్‌లో నిజంగానే ఓ పూర్ లేడీ…
‘నేను అయిదేళ్లుగా టీవీల్లో కనిపించడం లేదు… కుట్ర పన్నారు… ప్రశ్నించే గళాన్ని ఎప్పుడూ తొక్కడానికే ప్రయత్నిస్తారు… అలుపు లేకుండా ప్రయత్నిస్తూ మళ్లీ మీముందు కనిపిస్తున్నాను, నిలబడగలిగాను’ అని చెబుతూ పోయిందామె ఆ షోలలో… ఆమెను తొక్కాల్సిన అవసరం ఎవరికి..? ఎందుకు..? తనకైనా క్లారిటీ ఉందా అసలు..?
అప్పట్లో ఆమె రేలారేరేలా వేదికగా.. గద్దె కోసమే గాడిద కొడుకుల గత్తర లేపెరా అంటూ అప్పటి రాజకీయాలపై నిప్పులు కురిపించింది… ఆ వాక్యాలు వివాదాన్ని రేకెత్తించాయి… ఆ పాట ఎవరిని తాకింది..? ఆ పాట తరువాతే తన మీద కక్షకట్టారు, టీవీలకు దూరం చేశారు అని ఆరోపించింది..? వాళ్లెవరో మాత్రం చెప్పదు…
- క్రమేపీ వయస్సు పెరుగుతుండటం, కొత్త యాంకర్లు చాలామంది దూసుకురావడంతో ఈమె ఎప్పటికప్పుడు చాలా వెనుకబడిపోయింది… ఇప్పుడు కాస్త మళ్లీ తెరపైకి వచ్చి నాలుగు డబ్బులు సంపాదించుకోవాలని అనుకోవచ్చుగాక… తప్పులేదు, కానీ గతంతో పోలిస్తే హోస్టింగ్, యాంకరింగ్ డైనమిక్స్ పూర్తిగా మారిపోయాయి…
కాలానికి తగ్గట్టు సుమ మారుతూ, ఈరోజుకూ సినిమా ఫంక్షన్ల హోస్టింగులో నంబర్ వన్ ప్లేసులో ఉంది… టీవీ షోలకు సంబంధించి శ్రీముఖి టాప్ ప్లేస్… మిగతావాళ్లు ఎవరైనా ఉన్నా సోసో, అంతే… వాళ్లను ఉదయభాను రీప్లేస్ చేయగలదా..? పోనీ, కనీసం పోటీ ఇవ్వగలదా..?
ఈ ప్రశ్న ఎందుకొచ్చింది…? మళ్లీ ఆమె గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… సుహాస్ హీరోగా నటించిన.. ‘ఓ భామ అయ్యో రామ’ (O Bhama Ayyo Rama) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆమె పాల్గొన్నది… దీనికి గెస్టుగా వచ్చిన దర్శకుడు విజయ్ కనకమేడల ‘‘చాలారోజుల తరువాత యాంకర్ ఉదయభాను గారు… మళ్లీ యాంకరింగ్ చేస్తున్నారు…’ అని అన్నాడు…
వెంటనే ఉదయభాను కల్పించుకుని… ‘ఇదొక్కటే చేశానండీ… మళ్లీ చేస్తానో లేదో గ్యారంటీ లేదు… రేపే ఈవెంట్ అని అనుకుంటాం కానీ… చేసేరోజుకి మనికి ఈవెంట్ ఉండదు… అంత పెద్ద సిండికేట్ ఎదిగింది ఇండస్ట్రీలో… అని ఓ పెద్ద మాట అనేసింది…
ఈ సిండికేట్ అనే మాట ఎవరిని ఉద్దేశించి..? సుమా..? శ్రీముఖా..? ఏమిటో ఉదయభాను అస్సలు అర్థం కాదు ఎవరికీ… ఈమె (ఉదయభాను) మైక్ పట్టుకుంటే ఒక నారి వంద తుపాకుల టైప్ అని మచ్చ రవి అన్నప్పుడు… ‘నాకు చాలా బుల్లెట్లు తగిలాయి, అది ఎవరికీ తెలియదు’ అని మరో డైలాగ్ విసిరింది ఆమె… ఇంతకీ ఆమె చెప్పిన సిండికేట్, ఆమె మీద కక్ష కట్టిన పర్సనాలిటీలు ఎవరబ్బా..!!
Share this Article