Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కత్తులును ఘంటములు కదను తొక్కినవిచట… రియల్ మల్టీస్టారర్…

March 18, 2024 by M S R

Subramanyam Dogiparthi….   ఆడవే జలకమ్ములాడవే కలహంసలాగా జలకన్యలాగ అనే సి నారాయణరెడ్డి వ్రాసిన పాట ఈ సినిమాకే హైలైట్ . ఈ పాటలో సాహిత్యం అద్భుతం . అంతే గొప్పగా పాడారు ఘంటసాల . కత్తులును ఘంటములు కదను తొక్కినవిచట అంగళ్ళ రతనాలు అమ్మినారట ఇచట అనే చరణంలో ఘంటసాల గాత్రం , టి వి రాజు సంగీతం మహాద్భుతం . ఈ సినిమాలో నాకెంతో ఇష్టమైన పాట . గోదావరి , సాగర్ , హంపిలను చూపించి తెలుగు వారికి ఎంతో ఉత్తేజం , ఆనందాన్ని కలగచేస్తుంది . ఈ పాట కోసమే మూడు నాలుగు సార్లు చూసి ఉంటా ఈ సినిమాను . శోభన్ బాబు , షీలా జంట మీద ఈ పాట చిత్రీకరించబడింది .


మరో నృత్యగీతం జ్యోతిలక్ష్మి మీద నలుగురు నవ్వేరురా , హవ్వ అనే పాట . రాధాకృష్ణుల నృత్యం చాలా బాగుంటుంది . మరో పాట విజయలలిత మీదది . ఊపులో ఉన్నావు మామా మాంచి కైపులో ఉన్నావు మామ పాటలో ఏ అయ్య గారి పని గోవిందా అని నాగభూషణం అంటే , ఆయన అనుచరుడు కృష్ణమూర్తి మా అయ్య గారి పని గోవిందా అనటం గమ్మత్తుగా ఉంటుంది .

ఇతర పాటలు రంగురంగుల పూలు , పోతున్నావా తొందరపడి పోతున్నావా , ఎర్రా ఎర్రాని దాన ఎర్ర బుగ్గల దాన , కాచుకో చూసుకో థియేటర్లోనే కాక బయట కూడా హిట్టయ్యాయి .

Ads

పాటలన్నీ ఒక ఎత్తు అయితే సావిత్రి నటన ఒక ఎత్తు . అమాయకత్వం , భయం , బాధ్యత , మరిది మీద ప్రేమ , సగటు భార్యలకుండే అన్ని లక్షణాలు . ఇన్ని షేడ్లలో చాలా గొప్పగా నటించింది సావిత్రి . ఆవిడే ఈ సినిమాకు షీరో . సినిమా అంతా ఆవిడే . ఆవిడతో పాటు NTR పాత్ర నడుస్తుంది . కృష్ణ – విజయనిర్మల జోడీ , రాజబాబు – మీనాకుమారిల జోడీ , నాగభూషణం విలనీ బాగుంటాయి . మిక్కిలినేని , పుష్పకుమారి , ప్రభాకరరెడ్డి , సంధ్యారాణి ప్రభృతులు నటించారు .

ప్రముఖ దర్శకులు కె యస్ ప్రకాశరావు దర్శకత్వం వహించారు . భమిడిపాటి రాధాకృష్ణ సంభాషణలను పదునుగా వ్రాసారు . ఈ సినిమా తమిళంలో ఫెయిల్ అయిందట . ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యాక NTR కధలో మార్పులు చేయించారట . అందువలనే ఈ సినిమా హిట్ అయిందని చెప్పుకుంటారు .

చాలా సినిమాల్లో లాగానే ఇందులో కూడా NTR మారు వేషం ఉంటుంది . చిలిపిగా , అల్లరిగా , ఉళ్ళో గౌరవనీయుడిగా NTR చక్కగా నటించారు . కమర్షియల్ గానే కాకుండా , ప్రేక్షకుల మెప్పు కూడా పొందిన ఈ సినిమా రిపీట్ రన్సులో కూడా బాగా అడింది . తరచుగా టివి చానళ్ళలో వస్తుంటుంది . వచ్చిన ప్రతీసారి కాసేపు చూస్తుంటా . మా నరసరావుపేటలో వెంకటేశ్వర పిక్చర్ పేలసులో ఆడింది . యూట్యూబులో ఉంది . చక్కటి కాలక్షేపం‌. తప్పక చూడండి . టైం లేకపోతే పాటల వరకయినా చూడండి . పాటల వీడియో ఆల్బం కూడా ఉంది . ముఖ్యంగా ఆడవే జలకమ్ములాడవే , నలుగురు నవ్వేరురా పాటలు మాత్రం మిస్ కాకండి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #telugureels

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియా భాయ్… హేట్సాఫ్ సిరాజ్… నువ్వూ ట్రూ హైదరాబాదీ…
  • కర్త, కర్మ, క్రియ కేసీయారే..! ఖ్యాతి మసకబారి, తొలి అధికారిక మరక..!!
  • వంగా సందీప్‌రెడ్డి మార్క్ రోల్… నో, నెవ్వర్, సాయిపల్లవికి అస్సలు నప్పదు…
  • నౌషాద్ ఆఫ్ సౌత్ ఇండియా… ఘంటసాలకూ ఆరాధ్యుడు ఈ సుబ్బరామన్…
  • ఆదాయమే పరమార్థమై… ఆ ‘దేవాదాయ ధర్మాదాయ’ నామకరణాలు…
  • ముసి ముసి నవ్వుల మాటున విషం మరుగుతున్నది… వందేమాతరం..,
  • జేజమ్మ..! బిరబిరా సాగే నదీప్రవాహం… ప్రేమలో అందరినీ తడిపేస్తూ…!!
  • కడుపు చించుకోవద్దు… రేవంత్‌రెడ్డి మాటల్లో తప్పేముంది..?!
  • ఊరికే రావు జాతీయ అవార్డులు… ఎక్కడైనా సరే లెక్కలుంటాయండీ…
  • 5600 కోట్ల విలాసం అది… అడుగే పెట్టలేదు, అమ్మేస్తున్నాడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions