.
ప్రజల సమస్యల కోసం పోరాటం ఎవరు చేసినా, మొదట శాంతియుతంగానే స్టార్టవుతుంది… మన వ్యవస్థ, మన పోలీసుల పుణ్యమాని హింసకు దారితీస్తుంది…
ఎక్కడో కార్మికుల తరఫున పోరాడే ఓ వ్యక్తి చివరకు సాయధుడయితే…? అసాంఘిక శక్తి అనో, నక్సలైట్ అనో మన వ్యవస్థ ఎన్‌కౌంటర్ చేయడానికే సంకల్పిస్తుంది…
Ads
ఇలాంటి సీరియస్ సబ్జెక్టును కేవలం కొందరు మాత్రమే ఎఫెక్టివ్‌గా తీయగలరు… అందులో వెట్రిమారన్ కూడా ఒకరు..! అందుకే జూనియర్ ఎన్టీయార్ వంటి స్టార్ హీరోలు కూడా తనతో ఓ సినిమా చేస్తే బాగుండు అని బహిరంగ వేదికల మీదే ఎక్స్‌ప్రెస్ చేస్తారు…
ఐతే కథ చెప్పడం మీదే అది ప్రేక్షకుల్ని ఏమేరకు కనెక్టవుతుందో అర్థమవుతుంది… విడుదల ఫస్ట్ పార్ట్ చూడని వారికి ఈ సెకండ్ పార్ట్ అస్సలు అర్థం కాదు… దానికి ఇది కంటిన్యుయేషన్… కాకపోతే అందులో సూరి పాత్రకే ప్రాధాన్యం… విజయ్ సేతుపతి జస్ట్ ఓ పాత్ర…
సెకండ్ పార్టులో విజయ్ సేతుపతి కథే ప్రధానం… తను నో డౌట్… మంచి నటుడు… పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తాడు… సెకండ్ పార్ట్ విడుదలలో కూడా తనే ప్రధాన బలం… తనకు దీటైన నటి మంజూ వారియర్… ఉదాత్తమైన పాత్రే… ఆ లవ్ ట్రాక్ కూడా సంస్కారబద్ధంగా ఉంటుంది…
ఎటొచ్చీ కథ అక్కడక్కడే తిరుగుతుంది కానీ కదిలినట్టు అనిపించింది… అంత వెట్రిమారన్ కూడా దారి తప్పాడు అనిపిస్తుంది… పైగా పలుచోట్ల కాల్పుల సీన్ల లెంత్ మరీ ఎక్కువ… పెద్దగా కథలో మలుపులు కూడా ఏమీ ఉండవు… సరే, ఏ కమర్షియల్ వాసనలూ లేకపోవడం ఓ రిలీఫ్…
ఐతే విజయ్ సేతుపతి, వెట్రిమారన్, మంజూ వారియర్… ఇలాంటి వాళ్లకు ఇది గాకపోతే మరో సినిమా… అదీ పోతే ఇంకో సినిమా… కానీ ఇళయరాజా అలా కాదు… కెరీర్ ముగింపుకు వచ్చింది… దిక్కుమాలిన వివాదాల్లో తలదూరుస్తూ వ్యక్తిగతంగా ఒకవైపు పలుచన అవుతున్నాడు… మరోవైపు తన సంగీత సృజన కొడిగట్టింది…
అసలే వీక్ ట్యూన్స్, దానికితోడు ఏవేవో పదాలతో నింపేసిన తెలుగు డబ్… ప్చ్, మాస్టారూ… ఆ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఓపట్టాన అంతుపట్టదు… పైగా సినిమా లెంత్ ఎక్కువ… ఇవన్నీ ప్రేక్షకుడిని విసిగిస్తుంటాయి… కొన్నిసార్లు అసలు ఇది అయిదు జాతీయ అవార్డులు కొట్టిన వెట్రిమారన్ సినిమాయేనా అనే సందేహాలూ కలుగుతాయి… థాంక్ గాడ్, మూడో పార్ట్ ఆలోచన ఉన్నట్టు లేదు..!
#vetrimaran , #vijaysetupati , #manjuwarrior , #vididala2review
Share this Article