Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పొగచూరిన ఇష్టం..! విద్యాబాలన్‌ల సంఖ్య బాగానే పెరుగుతోందట..!!

April 30, 2024 by M S R

హవ్వ… విద్యాబాలన్‌కు పొగతాగుతుందట తెలుసా..? తాగకపోతే పిచ్చి లేచినట్టు ఉంటుందట… సమయానికి సిగరెట్ లేకపోతే బస్టాండ్లలో సిగరెట్లు తాగేవాళ్ల పక్కన నిలబడి ఆ పొగ వాసనను ఎంజాయ్ చేస్తుందట….. ఇలా రాసుకొచ్చారు కొందరు… ఫాఫం, విద్యాబాలన్…

ఆమె చెప్పింది ఏమిటంటే..? డర్టీ పిక్చర్ సినిమా షూటింగ్ సమయంలో మరీ ఫేక్ స్మోకింగ్ గాకుండా నిజంగానే సిగరెట్ కాల్చాను… కాల్చడం తెలుసు నాకు… కానీ ఆ షూటింగ్ తరువాత అలవాటైంది… రోజుకు రెండోమూడో… అడిక్షన్… తరువాత మానేశాను… ఇప్పటికీ సిగరెట్ స్మోకింగ్ ప్రమాదకరం కాదంటే మళ్లీ తాగుతాను, నాకు ఆ పొగ అంటే ఇష్టం, గతంలో సిగరెట్లు తాగేవాళ్ల పక్కన బస్టాండుల్లో కావాలనే నిల్చునేదాన్ని, ఆ పొగ కోసం…

గతంలో సిగరెట్లు తాగేవాళ్లను అదోరకంగా చూసేవాళ్లు, ఇప్పుడా స్థితేమీ లేదు…’ ఇలా చెబుతూ పోయింది… అదేదో దో ఔర్ దో ప్యార్ సినిమా ప్రమోషన్‌లో… తను, ఇలియానా నటించినట్టున్నారు, సినిమా ఫ్లాప్… పది రోజులైనా అయిదారు కోట్లు కూడా రాలేదు, అది వేరే కథ… కానీ తను పెద్దగా దాచుకోకుండా ఉన్నదున్నట్టు చెప్పింది… చాలామంది తాగుతారు, కానీ చెప్పరు, అదేదో తప్పు పని అయినట్టు..!

Ads

ఆడవాళ్లు పొగ తాగడం అనేది ఏనాటి నుంచో ఉన్నదే… అడ్డచుట్ట కూడా కాల్చేవాళ్లున్నారు… బహిరంగంగానే తాగుతారు… ఈ మోడరన్ కాలంలో కూడా ఆడవాళ్లు సిగరెట్లు తాగడం సిటీల్లో కూడా ఎక్కువైంది… సోషల్ గ్యాదరింగుల్లో, మందు కొట్టినప్పుడో పొగ ఏం ఖర్మ… గంజాయి, డ్రగ్స్ అన్నీ… హైఫై సొసైటీ సర్కిళ్లలో అది పెద్ద విశేషం కూడా కాదు… పొగ మంచిది కాదు, కేన్సర్ కారకం అని తెలిసీ వదలరు…

అవును, విద్యాబాలన్‌లాగే కొందరికి పొగ అంటే ఇష్టం… అది వాళ్ల టేస్ట్, అదంతే… గతంలో ఓ పాపులర్ జోక్… పెళ్లయ్యాక ఓసారి ముద్దుపెట్టుకున్న భర్తను భార్య అడిగిందట విసుగ్గా… సిగరెట్ తాగారా అని… అయిష్టత… తరువాత కొన్నాళ్లకు మరో సందర్భంలో ముద్దుపెట్టుకున్న భర్తను అడిగిందట… ఏం? ఈరోజు ఒక్క సిగరెట్ తాగలేదా అని..! తినగ తినగ వేము తియ్యగుండు అని కాదు, అలవాటైపోయింది ఆమెకూ… పాసివ్ స్మోకింగ్… అదీ డేంజరే… ‘కంపు కొట్టు సిగరెట్లు, మానకుంటే నా మీదొట్టు’ అనే పాట కాస్తా ‘సరదా సరదా సిగరెట్టు, దొరల్ తాగు బల్ సిగరెట్టు’ పల్లవి వైపు మారిపోతుందన్నమాట…

ఐదారేళ్ల క్రితం కావచ్చు… అసోచామ్ కొందరు మహిళల్ని సర్వే చేసింది… పొగ తాగేవాళ్లను, పొగ మానేసినవాళ్లను కావచ్చు…https://timesofindia.indiatimes.com/india/smoking-on-rise-among-young-working-women-in-urban-india-survey/articleshow/63218175.cms

నగరాల్లో సిగరెట్లు తాగే మహిళల శాతం పెరుగుతుందని తేల్చేసింది అది… అహ్మదాబాద్, బెంగుళూరు, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, ముంబై, పూణె, లక్నో, జైపూర్, కోల్‌కత్తా తదితర నగరాల్లో సర్వే జరిగిందట… ఇప్పుడు సిట్యుయేషన్ ఏమిటో తెలియదు… 2 శాతం మహిళలేమో రోజుకు ఒక పాకెట్ లేదా అంతకుమించి తాగుతున్నారట… కొందరు ఒత్తిడి తట్టుకోవడానికి, కొందరు బరువు తగ్గడానికట… వీరిలో అధికులు అధిక సంపాదన ఉన్న విద్యాధికులే… పొగతో ప్రమాదం తెలిసినవాళ్లే…

40 శాతం మందిలో అప్పుడప్పుడు మాత్రమే ఒకటీరెండు సిగరెట్లు తాగే అలవాటుందట… మందు తాగినప్పుడు లేదా సోషల్ గ్యాదరింగుల్లోనే… కొందరు స్ట్రెస్ బస్టర్ అని నమ్ముతారట… 12 శాతం మంది మాత్రం రోజుకు ఒకటీరెండుసార్లు దమ్ము కొడతారట… 46 శాతం మందిలో నాలుగోవంతు మంది పొగతాగడం మానేశామన్నారట… వీరిలో చాలామంది కాలేజీ లైఫులో అప్పుడప్పుడూ తాగేవాళ్లట… రొమ్ము కేన్సర్, సంతానోత్పత్తి మీద నెగెటివ్ ప్రభావం వంటి హైరిస్క్ డిజాస్టర్ల భయంతో మానేశామని చెప్పారట… మిగతా మూడు వంతు మహిళలు తమకు ఆరోగ్య స్పృహ ఉన్న కారణంగానే అసలు పొగకు దూరంగా ఉంటున్నామని, ఆ వాసనే అసహ్యం అన్నారట… గుడ్…!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions