Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అనసూయ మళ్లీ గోక్కుంది… ఈసారి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌తో…

August 25, 2022 by M S R

అనసూయకి గోకుడు ఎక్కువ… ఏదో ఒకటి గోక్కోవడం అలవాటే తనకు… ఈసారి సమయానికి ఏదీ దొరకలేదేమో… అయిదేళ్ల నాటి, అంటే అర్జున్ రెడ్డి సినిమా నాటి ఓ ఇష్యూను యాదికి తెచ్చుకుంది… ఇప్పుడు లైగర్ ఎదురుతన్నింది కదా మార్కెట్‌లో… ఇక కసితీరా ఓ ట్వీట్ పెట్టింది… ‘‘అమ్మను అన్న ఉసురు ఊరికే పోదు, కర్మ… కొన్నిసార్లు రావడం లేటవ్వచ్చేమో కాని రావడం మాత్రం పక్కా!!’’ అనేది ట్వీట్… నేరుగా ఇది లైగర్ రిజల్ట్ మీదే అని పెట్టలేదు… భయం… కానీ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు అర్థం కాదా ఏం..?

ఇక నెట్‌లో ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టేశారు… కొందరికి ఆమె దేని గురించి రాసుకొచ్చిందో మొదట అర్థం కాలేదు… అత్తా, ఎవరి గురించి పేలుతున్నావే అంటూ కొందరు స్టార్ట్ చేశారు… నో, నో, లైగర్ గురించి కాదు అనే వివరణో ఖండనో ఆమె నుంచి రాలేదు, సో, క్లారిటీ వచ్చేసింది మిగతావాళ్లకు… దాంతో అందరూ అందుకున్నారు… నువ్వు కూడా మాట్లాడేదానివి అయ్యావా అనేదే ఎక్కువ ట్రోల్ సారాంశం…

anasuya

Ads

అప్పట్లో అర్జున్‌రెడ్డి సినిమాలో హీరో ఓచోట కోపంగా అమ్మ పేరుతో ఓ బూతుపదాన్ని ఉపయోగిస్తాడు… సెన్సార్ వాళ్లు మ్యూట్ చేస్తే, బయట దాన్ని పాపులర్ చేశాడు విజయ్… దాని మీద పెద్ద ఎత్తున విమర్శలొచ్చినయ్… టీవీ9లో నాగవల్లి దేవి దగ్గర నుంచి సోషల్ మీడియా యాక్టివిస్టుల దాకా ఏకిపారేశారు… చాలామందికి విజయ్ పెడసరంగా సమాధానాలు ఇచ్చాడు… అదే యాటిట్యూడ్ ఈరోజుకూ… అదుగో అప్పట్లో ఈ అనసూయ కూడా దాన్ని ఖండించింది… (తనని కూడా ఆ నీచమైన పదంతో తిట్టించాడు అని ఆమె ఆరోపణ)…

నిజానికి అది అర్జున్ రెడ్డి అనే కేరక్టర్ తత్వం… సరే, సెన్సార్ వద్దన్నప్పుడు మ్యూట్ చేశారు, ఇక దాన్ని ప్రస్తావించడం అనవసరం… బయట కూడా విజయ్ పదే పదే మాట్లాడటంతో తనలోనే ఏదో తేడా ఉందనే విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది… అందరిలా ఉంటే తను విజయ్ ఎందుకు అవుతాడు మరి..? సరే, విజయ్‌ అప్పట్లో ఎలా సమర్థించుకున్నాడనేది పక్కన పెడితే… ఇన్నేళ్ల తరువాత మళ్లీ, అదీ అనసూయ ప్రస్తావించడం ఆశ్చర్యకరం…

టీవీ షోలు, చివరకు పిల్లల షోకు కూడా వెకిలిగా బట్టలేసుకుని వచ్చే అనసూయ… సినిమాల్లో వ్యాంప్ సాంగ్స్ చేసుకునే అనసూయ… జబర్దస్త్ వంటి బూతు షోకు ఇన్నేళ్లుగా యాంకర్‌గా చేసిన అనసూయ… తన వెగటు డ్రెసింగ్ మీద ఎవరేం కామెంట్ చేసినా విరుచుకుపడే అనసూయ…. ఆ పాత బూతును యాదికి తెచ్చుకుని, లైగర్ రిజల్ట్‌కు ముడిపెట్టి, అదీ కర్మఫలితం అని వ్యాఖ్యానించి తనే మళ్లీ గోక్కున్నది… అసలే లైగర్ సినిమా తన్నేసిందనే కోపంతో అసహనంగా ఉన్నారు కదా ఫ్యాన్స్… ఇక దాడి మొదలుపెట్టేశారు…

ఈ స్టోరీ రాసే సమయానికి ఆమె ట్వీట్ అలాగే ఉంది… వేరే వివరణ జోలికి కూడా పోలేదు… అవునూ, పైన ఓ ఫోటో చూశారుగా… ఇంతకన్నా డర్టీగా ఉంటుందా విజయ్ భాష..? మరీ చోద్యం కాకపోతే..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఘర్షణలో నష్టాలు సహజం… కానీ మనం 100 % అప్పర్ హ్యాండ్ సాధించాం…
  • నో డౌట్… రాఫెల్ అల్టిమేట్ వార్ ఫైటర్… మన పైలట్లూ సేఫ్…
  • అప్పటికప్పుడు కొత్త సీన్లు… ఆలోచనల కసరత్తులు… మేధో మథనాలు…
  • బాపూ, నీ పాదాలేవి..? ఒక్కసారిగా బావురుమని ఏడవాలనుంది..!!
  • మీడియా చెవుల్లో శ్రీలీల పూలు… నువ్వూ తయారయ్యావా తల్లీ…
  • …. అసలు ఇలాంటి సినిమాలు కదా రీరిలీజ్ చేయాల్సినవి…
  • ‘మా’ పూనుకుని… రాజేంద్ర ప్రసాద్‌కు మానసిక చికిత్స చేయించాలి..!!
  • ‘పోషకాల పుట్ట’గొడుగు..! మాంసాహార ముద్ర తప్పు.., తినకపోతేనే తప్పు..!!
  • ఐపీఎల్ ఫైనల్స్‌లోకి… పాకిస్థానీ జాతిపిత మునిమనుమడి టీమ్…!!!
  • మమత బెనర్జీ… ఆమె అంతే… దేశభక్తి ఆమె దృష్టిలో ఎప్పుడూ నేరమే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions