Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓహో… వన్ గ్రామ్ ఫ్రీ ఉంగరంపై మేనమామ రూపం అట !

August 24, 2026 by M S R

.

మేనమామ ఉంగరం… దీని మీద మనం గతంలోనూ చెప్పుకున్నాం… తమిళనాడులో పుట్టిన ప్రతి నవజాత శిశువుకు సీఎం విజయ్ పేరిట (అందరికీ మేనమామ) ఒక గ్రాము బంగారు ఉంగరం ఇవ్వాలనేది స్కీమ్… 755 కోట్ల కంట్రాక్టు… ఇంకేం..? జువెలర్స్ అందరూ పోటీలు పడ్డారు… దాదాపు 11 కంపెనీలు…

మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కుంటున్న సవాళ్ల నేపథ్యంలో అందరూ బంగారం కొనుగోళ్లు తగ్గించండి ప్లీజ్ అని మోదీ అప్పీల్ చేస్తుంటే… ఏకంగా 755 కోట్ల  బంగారం కొనుగోళ్లకు విజయ్ సిద్దపడటం విమర్శలకు తావిచ్చింది… బట్, తను ఆత్మవిమర్శ చేసుకోలేదు, వెనక్కి తగ్గలేదు, కుటుంబాల్ని ఆకట్టుకోవడానికి చీప్ అండ్ బెస్ట్ పథకం, తన ప్రధాన హామీ కాబట్టి ముందుకే వెళ్లిపోయాడు విజయ్… భారతీయ కుటుంబానికి బంగారం ఎప్పుడూ ఓ ఎమోషన్ కదా మరి!

Ads

మస్తు చీప్ రేట్లకు బంగారు ఆభరణాలు, జీరో మేకింగ్ చార్జెస్ అని ఊదరగొడుతూ ఉంటాడు కదా లలితా జువెలర్స్ గుండు కిరణ్ కుమార్… ఇంకేం, తనకే కంట్రాక్టు అనుకున్నారేమో… కాదు, జోస్ అలుక్కాస్ 70 శాతం, కల్యాణ్ జువెలర్స్ 30 శాతం దక్కించుకున్నాయి… చాలామంది పొరపడుతున్నారు… జోయ్ అలుక్కాస్‌కు కంట్రాక్టు దక్కిందీ అని…

గతంలో ఈ జోయ్ అలుక్కాస్‌కు విజయ్ బ్రాండ్ అంబాసిడర్… తనే తెలివిగా విజయ్‌తో ఈ స్కీమ్ ప్రకటింపచేశాడు… కానీ ఓ ప్రభుత్వ పథకాన్ని గుండుగుత్తాగా నిబంధనల్ని తోసేసి ఇవ్వడం అసాధ్యం అని ఇద్దరికీ తెలిసొచ్చింది… సరిగ్గా సమయానికి జోస్ అలుక్కాస్ రంగంలోకి దిగి, జస్ట్, పైసా మేకింగ్ చార్జెస్ చాలు అని చెప్పింది… కంట్రాక్టు కొట్టేసింది…

వెరసి జోయ్ అలుక్కాస్ తెల్లమొహం వేసింది… జోయ్ అలుక్కాస్ వేరు, జోస్ అలుక్కాస్ వేరు… వేర్వేరు కంపెనీలు… సో, టెండర్లలో ఏదో జరిగింది, తను అనుకున్న కంపెనీకే కంట్రాక్టు ఇచ్చాడనేది నిజం కాదు… అయితే..?

vijay

పేరుకు మేకింగ్ చార్జీలు లేవు అంటే ఇట్టే నమ్మేయకండి, ఏ వ్యాపారీ లాభం లేనిదే పనిచేయడు, పైగా ప్రభుత్వ కంట్రాక్టు, చాలా ఖర్చులుంటాయి… ఆఫర్లు, స్కీమ్స్ సందర్భంలో కంపెనీలు మరీ 18 క్యారెట్లకు కుదించేసి మార్కెట్‌లోకి వదులుతూ ఉంటారు… సో, నాణ్యత ముఖ్యం… దీనికి విజయ్ ప్రభుత్వం ఏం జాగ్రత్తలు తీసుకుందో తెలియదు…

ఈ పథకం అమలుకు తమిళనాడు మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్‌కు అప్పగించారు… దానికీ దీనికీ లింక్ ఏమిటి అనడక్కండి, అదంతే… మేకింగ్ చార్జీలు లేకపోతేనేం, ప్యాకింగ్, పన్ను, తూకం, తరుగు, బీమా వంటి చాలా కథలుంటాయి… వీటికి మించి మరొకటి ఉంది…

ఉంగరంపై టీవీకే ప్రభుత్వ గుర్తుతో పాటు విజయ్ రూపం ముద్రిస్తారట… ఒక గ్రాము బంగారు ఉంగరంపై ఒక మనిషి రూపం కష్టమే… కాకపోతే వార్తలు అలా వినిపిస్తున్నాయి… సో, విజయ్ వేగంగా ఓ సగటు రాజకీయ నాయకుడి పాత్రలోకి రూపాంతరం చెందుతున్నాడు !!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఓహో… వన్ గ్రామ్ ఫ్రీ ఉంగరంపై మేనమామ రూపం అట !
  • ఆమె ఆమే ! రంభను తీసుకొచ్చినా రీప్లేస్ చేయలేరు ! అదే జరిగింది !!
  • యశస్వి జైస్వాల్ కథ కంచికేనా ? మీడియాలో బోలెడన్ని తీర్పులు !!
  • తెగ బలిసిన కార్లు పైకి ఎక్కేస్తాయి – మనమే పైలంగా ఉండాలె !!
  • K I L L …! యండమూరి విశ్లేషణ- సమీక్ష … భిన్నం – ఆసక్తికరం !
  • ఎలపరం ! కాలేజీ ప్రాంగణాలు ఇక సినిమా ఫంక్షన్లకు అద్దె వేదికలు !!
  • ప్రతి మెహిందీ కథా ఇంతే ! వెలుతురు ఎరుగని చీకటి తడి అంగడి !
  • నిజం- ఓటీటీ భ్రమలు బద్ధలయ్యాకే… తెలుగు సినిమా బతుకుతోంది !
  • సంక్షోభమూ ఓ అవకాశమే ! రేవంత్ రెడ్డి వాడుకోగలిగితే భలే చాన్స్ !!
  • Save Vijayawada – ముందు బెజవాడను బతికించండి, తరువాతే మెట్రో !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions