.
హఠాత్తుగా కొన్ని థంబ్ నెయిల్స్, సోషల్ కార్డ్స్, పోస్టులు కనిపిస్తున్నాయి… ‘సీఎం విజయ్ హీరోయిన్ ఆత్మహత్య కథ తెలుసా..? ‘‘విజయ్ లవర్ సూసైడ్ స్టోరీ… ‘‘విజయ్ హీరోయిన్ విషాదాంతం… విజయ్ సూసైడ్ హీరోయిన్‌కూ సిమ్రాన్‌కూ లింకేమిటి..? ఇలా…
అవును, అన్నీ నిజాలే… ఆ హీరోయిన్ పేరు మోనాల్ నవల్… అవును, ఆమె సిమ్రాన్ చెల్లెలే… అవును, విజయ్‌తో మోనాల్ బద్రి అనే సినిమా కూడా చేసింది… అవును, ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది… కానీ విజయ్‌కూ ఆమె ఆత్మహత్యకూ లింకేముంది..? ఏమీ లేదు…
Ads
ఇప్పుడు సీఎం అయ్యాడు కాబట్టి… వర్తమానంలో విజయ్ పేరు బహుళ ప్రాచుర్యంలో ఉంది కాబట్టి… తన మీద ఏం రాసినా, అందులోనూ హీరోయిన్ సూసైడ్ అనేసరికి… రీడర్స్ ఆసక్తి చూపిస్తారు… వ్యూస్ పెరుగుతాయి… అదీ తాపత్రయం… అందుకే కొన్ని యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా పేజీలు “విజయ్ హీరోయిన్ సుసైడ్ మిస్టరీ”, “సీఎం విజయ్‌తో నటించిన హీరోయిన్ దారుణం” అంటూ క్లిక్‌బైట్ చేస్తున్నారు.
అసలు విషయం ఏమిటంటే — అది విజయ్‌తో సంబంధమైన కథ కాదు, ఒక యువ నటికి జరిగిన వ్యక్తిగత విషాదం… ఆమె కెరీర్ మొదలైన వెంటనే 21 ఏళ్లకే జీవితం ముగిసిపోయింది… ఆ కాలంలో ఆమెను “సిమ్రాన్ చెల్లెలు”గా, “బద్రి హీరోయిన్”గా మీడియా గుర్తుపెట్టుకుంది… ఇప్పుడు విజయ్ రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి కావడంతో, పాత వార్తలను కొత్త కోణంలో తవ్వి వైరల్ చేస్తున్నారు… ఇదే సోషల్ మీడియా అల్గోరిథమ్ — పాత ట్రాజెడీకి కొత్త హుక్ పెట్టడం…
అసలు అప్పట్లో కోలీవుడ్‌లో Monal చాలా promising actress అని భావించేవారు… Simran చెల్లెలు కావడం వల్ల కూడా ఫోకస్ ఎక్కువైంది… కానీ ఇప్పుడు ఆమె నటన, కెరీర్ కంటే “విజయ్ హీరోయిన్ ఆత్మహత్య” అనే ట్యాగ్ ఎక్కువగా తిరుగుతోంది…
ఇంతకీ ఆమె కథ ఏమిటంటే..? ఒకప్పుడు తమిళ- తెలుగు ఇండస్ట్రీల్లో స్టార్ హీరోయిన్‌గా వెలిగిన Simran చెల్లెలే Monal Naval… చాలా తక్కువ కాలమే సినిమాల్లో ఉన్నా, ఆమె కథ మాత్రం ఇప్పటికీ సినీ అభిమానులను కలచివేస్తూనే ఉంటుంది…
మోనాల్ అసలు పేరు రాధామోనాల్ నవాల్…. ఢిల్లీలో జన్మించింది… మోడలింగ్, ఫ్యాషన్ షోల ద్వారా సినిమాల్లోకి వచ్చింది… అప్పటికే సిమ్రాన్ సౌత్‌లో టాప్ హీరోయిన్… దీంతో మోనాల్ ఎంట్రీపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి…
ఆమె మొదటగా నటించిన సినిమాల్లో ఒకటి Badri… ఇందులో హీరోగా ప్రస్తుత తమిళనాడు రాజకీయ నాయకుడు, నటుడు Vijay నటించాడు… అయితే రిలీజ్ మాత్రం ముందుగా వచ్చిన సినిమా Paarvai Ondre Pothume… ఆ సినిమా ద్వారా మోనాల్‌కు మంచి గుర్తింపు వచ్చింది… తర్వాత Samudhiram, Charlie Chaplin వంటి చిత్రాల్లో కూడా కనిపించింది… తెలుగులో కూడా ఏదో సినిమా చేసింది…

ఆ సమయంలో మోనాల్‌కు మంచి భవిష్యత్తు ఉందని కోలీవుడ్‌లో భావించారు… కానీ వ్యక్తిగత జీవితంలో వచ్చిన సమస్యలు ఆమెను తీవ్రంగా కలిచివేశాయని అప్పట్లో వార్తలు వచ్చాయి… ముఖ్యంగా ఓ డాన్స్ కొరియోగ్రాఫర్‌తో రిలేషన్ బ్రేకప్ కారణమై ఉండొచ్చని సిమ్రాన్ తరువాత ఆరోపించింది…
2002 ఏప్రిల్ 14న, కేవలం 21 ఏళ్ల వయసులో చెన్నైలోని తన అపార్ట్‌మెంట్‌లో మోనాల్ ఉరివేసుకుని మృతి చెందింది… ఈ ఘటన తమిళ సినీ పరిశ్రమను ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది… అప్పట్లో మీడియాలో, సినీ వర్గాల్లో ఇది పెద్ద చర్చేనీయాంశం అయింది…
ఇంకో విషాదకరమైన విషయం ఏమిటంటే… మోనాల్‌తో కలిసి నటించిన హీరో Kunal Singh కూడా కొన్ని సంవత్సరాల తర్వాత అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు… దీంతో వారి జంట గురించి ఇప్పటికీ కోలీవుడ్‌లో విషాద కథలా మాట్లాడుకుంటుంటారు…
ఇప్పటికీ సిమ్రాన్ ప్రతి ఏడాది తన చెల్లెల్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటుంది. అభిమానులు కూడా “ఆమె బ్రతికి ఉంటే పెద్ద స్టార్ అయ్యేది” అని కామెంట్లు చేస్తుంటారు… ఇదీ మోనాల్ కథ…!!
Share this Article