.
తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న విజయ్ జోసెఫ్ అలియాస్ హీరో విజయ్ అలియాస్ టీవీకే విజయ్ వ్యక్తిగతం మీద ఎవరెవరో ఏవేవో రాసేస్తున్నారు… వాళ్ల ఫ్యామిలీ చిత్తూరు నుంచి వలస పోయిందని కొందరు తనమీద తెలుగు ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు… తను దళితుడనీ రాస్తున్నారు… నిజాలేమిటో చూద్దాం… రకరకాల సమాచారాన్ని వడబోసిన తరువాత…
విజయ్ దళితుడు కాదు… వాళ్లది వెల్లలార్ కమ్యూనిటీ… ఇది స్వతహాగా భూస్వామ్య సామాజికవర్గం… తమిళనాడు, కేరళ, శ్రీలంకల్లో ఎక్కువగా విస్తరించి ఉన్న కులం… ఒకప్పుడు అగ్రవర్ణం… బలమైన సామాజికవర్గంగా, భూమిని కలిగి ఉన్న వ్యవసాయ ప్రధానకులంగా అప్పట్లో సంగం, చోళుల కాలంలో పాలనపరమైన, మిలిటరీ రోల్స్‌లో వీళ్లే ఎక్కువగా కనిపించేవారు…
Ads
- వీటిలో ప్రధాన ఉపకులాలు కొంగు వెల్లలార్, తుళువ వెల్లలార్, సోఝియా వెల్లలార్… మరీ పూర్వీకుల్లోకి వెళ్తే యదు క్షత్రియ వారసత్వానికి సంబంధించిన సామాజికవర్గం ఇది… పాలకవర్గం… వెలిర్ నాయకులు అంటారు… చిన్న చిన్న ప్రాంతాలకు స్థానికంగా పాలకులు అన్నమాట…
- మౌర్య సామ్రాజ్యం, ముగ్గురు గొప్ప తమిళ రాజులు (చేర, చోళ, పాండ్య – Muvendhar) కాలంలో వెలిర్లు స్వతంత్రంగా లేదా సామంతులుగా చిన్న చిన్న రాజ్యాలను (కొండ ప్రాంతాలను) పాలించేవారు… వీరు పురాణ పురుషుడు అగస్త్య మహర్షి వంశానికి చెందిన వారని ఒక నమ్మకం… ప్రధానంగా శైవులు…
తరువాత కాలంలో ఇందులోని పలు ఉపకులాల్ని బీసీ జాబితాలోకి చేర్చారు.,. మరి జోసెఫ్..? తనది ఉడియార్ ఉపకులం… ఇదీ బీసీ జాబితాలోనే ఉంటుంది… తండ్రి తరఫు తాత ఎస్.ఎన్. చంద్రశేఖరన్ శ్రీలంకలో పుట్టాడు… (జోసెఫ్ మూలాలు శ్రీలంకలో ఉన్నాయి) తరువాత రామనాథపురం వలసవచ్చాడు… బేసిక్‌గా సినిమా ఇండస్ట్రీకి చెందినవాడు… వీళ్లను క్రిస్టియన్ వెల్లలార్స్ అనేవాళ్లు…
విజయ్ తండ్రి ఎస్.ఏ.చంద్రశేఖర్… తను చెన్నై వచ్చి సినిమా ఇండస్ట్రీలో స్థిరపడ్డాడు… దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్… తను పుట్టింది రామేశ్వరం… ప్రాక్టీసింగ్ క్రిస్టియన్… విజయ్ తల్లి శోభ.., హిందూ, బ్రాహ్మిణ్… వీళ్ల కుటుంబం హైదరాబాద్ నుంచి చెన్నైకి వలస వెళ్లింది… ఆమె సోదరుడు ఎస్.ఎన్.సురేందర్ అప్పట్లో సింగర్, వాయిస్ ఆర్టిస్ట్… తన తల్లి తరఫున విజయ్‌కు హైదరాబాదీ బంధుత్వం ఉందన్నమాట… (విజయ్ తండ్రి ఈ శోభ వాళ్లింట్లో అద్దెకు ఉండేవాడు… అక్కడ పరిచయం పెరిగి, పెళ్లి దాకా వెళ్లింది… మతాంతరం…)
ఐతే… విజయ్ తండ్రి కొడుక్కి విజయ్ జోసెఫ్ అని పేరు పెట్టుకున్నా గానీ స్కూల్ రికార్డుల్లో మాత్రం కులం పేరు రాయించలేదు, కేవలం తమిళియన్ అని రాయించాడు… విజయ్ హీరోగా స్థిరపడ్డాక లండన్‌కు చెందిన తన అభిమాని సంగీతను 1999లో పెళ్లి చేసుకున్నాడు… 27 ఏళ్ల తరువాత ఆ వివాహం విడాకుల దాకా చేరింది… నటి త్రిషతో విజయ్ సంబంధాలే కారణమని అంటుంటారు… (భరణం, ఇతర ఇష్యూల దగ్గర ఆగినట్టుంది, అధికారికంగా విడాకులు ఇంకా జారీకాలేదు…)
సో, ఏతావాతా తేలేది ఏమిటంటే… విజయ్ రూట్స్ శ్రీలంక.., ఒకప్పటి అగ్రవర్ణం, తరువాత బీసీ జాబితాలోకి చేరిన భూస్వామ్యవర్గం… వీళ్లది క్రిస్టియన్ పరంపర… తల్లి మాత్రం హిందూ… సో, దళిత క్రిస్టియన్ అనే ప్రచారం నిజం కాదు…
Share this Article