ద్రావిడ రాజకీయాల్లో… తమిళనాడులో ఝలక్… సినిమా నటుడు విజయ్ ప్రారంభించిన ఓ పార్టీ ఆవిర్భావ సభ ఘనంగా… అత్యంత ఘనంగా జరిగింది… జనం పోటెత్తారు… నో డౌట్, అది విజయ్ పట్ల జనంలో ఉన్న ఆదరణకు బలమైన ఉదాహరణ… లక్షల మంది ప్రజలతో సభ హోరెత్తిపోయింది…
ఐతే… అవును, ఇక్కడ చాలా ఐతేలు ఉన్నాయి… గతంలో ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి తరువాత ఏ సినిమా వ్యక్తీ అక్కడ రాజకీయాల్లో రాణించలేదు… ఉదయనిధి కూడా స్టాలిన్ కొడుకే తప్ప నటుడిగా పెద్ద పాపులర్ ఏమీ కాదు… కమలహాసన్ అంటే జనంలో క్రేజ్… కానీ తన పార్టీ ఎంత అట్టర్ ఫ్లాపో తెలుసు కదా… విజయకాంత్ ఎట్సెట్రా నటులు కూడా బ్రహ్మండమైన ఫలితాలు ఏమీ సాధించలేకపోయారు…
చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఆ సభ తెలుసు కదా… ఇసకేస్తే రాలనంత జనం… ఎటువెళ్లినా జనం బ్రహ్మరథం పట్టారు… తీరా అసెంబ్లీ ఎన్నికల్లో జస్ట్, 18 సీట్లు… తరువాత సన్నగిలి, చివరకు కాంగ్రెస్‌లో నిమజ్జనం చేసి, సినిమాలకు మాత్రమే పరిమితం కావల్సి వచ్చింది… తమ్ముడు పవన్ కల్యాణ్ ఇన్నేళ్లలో సాధించిన ఎన్నికల ఫలితాలు ఏమిటి..?
Ads
చివరకు టీడీపీ, బీజేపీతో కలిసి నిలబడితే… ఈరోజుకూ సంస్థాగత నిర్మాణం లేకుండానే… జస్ట్, జగన్ మీద బలమైన ప్రజావ్యతిరేకత ఊతంగా ‘సెంట్ పర్సెంట్’ రిజల్ట్ సాధించింది… కానీ 2019 ఎన్నికల్లో జస్ట్, ఒక సీటు… తనే రెండు సీట్లలో ఓడిపోయాడు… కానీ పవన్ కల్యాణ్ మీటింగులకు జనం పోటెత్తేవాళ్లు… కర్నాటక, కేరళల్లోనూ సినిమావాళ్ల రాజకీయాలు పెద్దగా క్లిక్ కాలేదు… ఇతర రాష్ట్రాల్లో నటీనటులు రాజకీయాల్లో ఉన్నా రాష్ట్ర రాజకీయాల్ని బాగా ప్రభావితం చేసే స్థితిలో ఎవరూ లేరు… సో, ఇప్పుడే విజయ్ పార్టీ అవకాశాల్ని అంచనా వేయలేం… తన అడుగుల్ని పరిశీలించడమే…
నిజానికి జయలలిత మరణించాక అన్నాడీఎంకే కూడా ఆమెతోపాటు మరణించినట్టే… దానికి లీడర్లు లేరు… శశికళ వెన్నువిరిచాడు మోడీ… ప్రస్తుత నాయకుల్ని తమిళజనం తిరస్కరించారు… ఆ ఖాళీలోకి విజయ్ పార్టీ జొచ్చుకుపోయే అవకాశాలైతే బాగా ఉన్నాయి… తను నేరుగా డీఎంకే కుటుంబపాలనను, దోపిడీని ప్రశ్నిస్తున్నాడు… సరే, డీఎంకేకు ప్రత్యర్థిగా బలపడాలనేది తన భావన, తప్పులేదు… అవసరం కూడా…
అంతేకాదు, తను ప్రసంగంలో చెప్పిన ఒక మాట ఆసక్తికరంగా అనిపించింది… పెరియార్ భావజాలాన్ని పాటిస్తాం, గౌరవిస్తాం అంటూనే నాస్తికవాదాన్ని తిరస్కరించాడు తను… హేతువాదం, నాస్తికత్వం పేరిట హిందూమతం మీద దాడినే ద్రావిడ రాజకీయాల సిద్ధాంతంగా చలామణీ అయ్యే తమిళ రాజకీయాల్లో ఇది ఇంట్రస్టింగు… కమలహాసన్ పార్టీ కూడా నాస్తిక పోకడల్నే అనుసరించింది…
ఆస్తికత్వం, నాస్తికత్వం ప్రజల వ్యక్తిగత చాయిస్ మాత్రమే… వాటిని రాజకీయ పార్టీల సిద్ధాంతాల్లో భాగం చేయడం అనవసరమని విజయ్ ప్రసంగం చెబుతోంది… కాంగ్రెస్ ఎలాగూ తమిళనాట ఓ తోక పార్టీ… లెఫ్ట్ పార్టీలూ అంతే… మేమూ ఆస్తికులమే అనే విజయ్ ధోరణి బీజేపీ మతరాజకీయాలకు చెక్ అనుకోవచ్చా..? గెలిచినా ఓడినా మా ద్రావిడ పార్టీలే తప్ప జాతీయ పార్టీలకు చాన్స్ లేదిక్కడ అనే వ్యూహమేనా…?!
Share this Article