Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

27 ఏళ్లలో విజయ్ భార్య పేరిట రూపాయి ఆస్తి లేదు..! త్రిషా, జాగ్రత్త..!!

April 21, 2026 by M S R

.

Mohammed Rafee …. 250 కోట్లు భరణం కోరిన సంగీత… 35 కోట్లు ఇస్తానంటున్న హీరో విజయ్… తమిళ వెట్రి కళగం పార్టీ అధినేత స్టార్ హీరో విజయ్ విడాకుల కేసు పెను సంచలనంగా మారింది. నిన్న కోర్టులో విజయ్ భార్య సంగీత 250 కోట్ల భరణం కోరారు. 35 కోట్లు ఇవ్వగలనని, కుమారుడు కుమార్తె బాగోగులు తానే చూసుకుంటానని విజయ్ కోర్టుకు తెలిపారు.

విజయ్ భార్య సంగీత తన 27 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. నటి త్రిష, విజయ్ సహ జీవనం చేస్తున్నారనేది ఆమె ఆరోపణ. వివాహేతర సంబంధం, శారీరక క్రూరత్వం కారణంగా ఆమె విడాకులు కోరినట్లు పేర్కొన్నారు.

Ads

తమిళనాడులో జరుగనున్న ఎన్నికల్లో టివికె పార్టీ విజయ్ నాయకత్వంలో బరిలో వుంది. తన డ్రైవర్ తోసహా అనేక మంది యువతకు సీట్లు కేటాయించి పోటీ చేయిస్తున్నారు. అయితే ఈ పార్టీ చీల్చే కొద్దిపాటి ఓట్లతో స్టాలిన్ కే మళ్ళీ గెలువు అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది!

తమ కేసు ముగిసేంత వరకు తాను విజయ్ ఇంట్లో ఉండేందుకు అవకాశం ఇవ్వాలని సంగీత మరో పిటిషన్ వేశారు. గత రెండేళ్లుగా ఇద్దరూ విడివిడిగా వుంటున్నారు. పిల్లలు కూడా సంగీత దగ్గరే వుంటున్నారు. కాగా, ఎన్నికల్లో తనను ఓడించే టార్గెట్ గా ఆమె చర్యలు వుంటున్నాయని, తాను ముఖ్యమంత్రి కాకుండా కక్షతో సంగీత కుట్రలు పన్నుతున్నారని విజయ్ ఆరోపిస్తున్నారు.

ఎన్నికల అఫిడవిట్ లో 605 కోట్లు ఆస్థులు ఉన్నట్లు విజయ్ పేర్కొన్నారు. భార్య సంగీత, ఇద్దరు పిల్లల పేరిట ఒక్క ఆస్థి కూడా లేకపోవడం విశేషం! – డా. మహ్మద్ రఫీ


అంటే, ఎప్పుడూ తన భార్య మీద ప్రేమ లేదా..? పిల్లలు పుడుతున్నా సరే, తను ఎంత సంపాదిస్తున్నా సరే, రూపాయి ఆస్తి కూడా ఆమె పేరిట లేదు… అంటే ఏమిటి అర్థం..? ఎప్పటికైనా ఇది విడిపోయే కేసు అనుకున్నాడా..? త్రిషా… జాగ్రత్త..!!



ఈ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీచేస్తున్న విజయ్ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లలో ఓచోట 115 కోట్లు అని చూపించాడు, మరోచోట 220 కోట్లు చూపించాడు… దీనిపై హైకోర్టు నోటీసులు జారీ చేసింది… ఆల్రెడీ జననాయగన్ సినిమా ఆగిపోయింది, ఏ పొత్తులూ కుదరలేదు, మరోవైపు రెండుచోట్ల కూడా తన నామినేషన్లు సందిగ్ఢంలో పడిపోయాయి…



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అవునూ, ఇంతకీ ఈ కథలో అసలు వ్యభిచారి ఎవరు..?
  • మోడీ సూత్రాలు..! ఏదో ఆర్థిక తుఫాన్‌కు ముందు మోగే సైరన్లు..!!
  • రెండు కళ్ళ సిద్ధాంతానికి కాలం చెల్లింది… అటో ఇటో తేల్చుకోవల్సిందే…
  • తెలంగాణ బరిలోనూ ఎన్డీయే కూటమి..? రేవంత్‌రెడ్డి నెత్తిన పాలు..!!
  • ఏమో అనుకుంటాం గానీ… శోభన్‌బాబుకూ కులగజ్జి ఎక్కువే…
  • కర్కోటక అవినీతి జయలలిత… చివరకు ఏం సాధించినట్టు..?
  • అంతరిక్షంలో ఎఐ యుద్ధాలా..? ఇండియా కూడా రెడీ..!
  • ఆ చివరి ఓవర్…. ఐపీఎల్ థ్రిల్లెస్ట్… ముంబై ఇంటికి… బెంగుళూరు టాప్ వన్…
  • విద్వేషం లేదు- విషం లేదు..! సరైన దిశలో ఒక పీఎం- ఒక సీఎం…!!
  • ఇది బాబాయ్ హోటల్ స్టోరీ అస్సలు కాదు … జస్ట్, ఒక బాబాయ్ స్టోరీ …

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions