Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సింగర్ కార్తీక్ కుర్చీలో మలయాళ పాపులర్ సింగర్ విజయ్ ఏసుదాస్..!

July 18, 2024 by M S R

సింగర్ కార్తీక్… తెలుగు ప్రేక్షకులు, శ్రోతల్లో ఇంత భారీ ఫాలోయింగు ఉందా అనిపించింది తాజా ఇండియన్ ఐడల్ తెలుగు షో ప్రోమో వీడియో కింద కామెంట్స్ చూస్తుంటే…

కార్తీక్ కోసమే షో చూస్తున్నాం, తన కోసమే మళ్లీ ఆహా ఓటీటీ సబ్‌స్క్రయిబ్ చేసుకున్నాం, తను లేకపోతే ఈ షో పెద్ద వేస్ట్, ఒరేయ్ కార్తీక్ ఎక్కడరా అని బోలెడు కామెంట్స్… 60, 70 శాతం కామెంట్స్ అన్నీ అవే… వోకే, తను చాలా తెలుగు పాటలు పాడాడు, ఇళయరాజా లైవ్ కచేరీలకు కూడా హాజరవుతాడు… ఎక్సలెంట్ సింగర్…

ఎలాగూ తమిళంలో సూపర్ సింగర్… ఫుల్ డిమాండ్ ఉన్న సింగర్ కమ్ మ్యూజిక్ కంపోజర్… ఈ తెలుగు ఇండియన్ ఐడల్ షో జడ్జిగా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు… ఈసారి ఎపిసోడ్‌లో తను కనిపించలేదు… అప్పటికప్పుడు గెస్ట్ కమ్ గెస్ట్ జడ్జిగా తమన్ ప్రముఖ మలయాళ సింగర్ విజయ్ ఏసుదాసును రప్పించాడు… తనతోపాటు రామ్ మిరియాల కూడా…

Ads

కామెంట్లకు ఆహా ఓటీటీ టీం సవినయంగా సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది… హెక్టిక్ వర్క్ ప్రెజర్ కారణంగా కార్తీక్ ఈసారి రాలేకపోయాడు, వచ్చే వారం నుంచి యధావిధిగా తను వస్తాడు అని కామెంట్లలోనే రిప్లయ్ ఇచ్చుకుంది…

vijay yesudas

విశిష్ట అతిథుల్ని తీసుకురావడం, ఈ షోను జనరంజకం చేయడానికి ఆహా మేనేజ్‌మెంట్, టీం చేస్తున్న ఎఫర్ట్, పెడుతున్న ఖర్చు ఇంట్రస్టింగ్… మొన్న విజయ్ దేవరకొండను పట్టుకొచ్చారు… ఇప్పుడు విజయ్ ఏసుదాస్, రామ్ మిరియాల… లాస్ట్ సీజన్లలో కూడా పేరున్న ప్రముఖులను పట్టుకొచ్చారు… త్వరలో అల్లు అర్జున్ రాబోతున్నాడట…

కాకపోతే ఎవరో కంటెస్టెంట్ పాడిన పాటను జడ్జ్ చేస్తూ శంకర్ మహాదేవన్‌ను మరిపించే రేంజులో ఉందని విజయ్ ఏసుదాస్ చేసిన వ్యాఖ్య మరీ అతిశయోక్తి… ఇదుగో, ఈ మెచ్చుకోళ్లు ఎక్కువయ్యాయి ఈసారి మరీ… గీతామాధురి జడ్జిమెంట్లు పెద్దగా ఆసక్తికరం గాకపోయినా కార్తీక్, తమన్ కొన్నిసార్లు నిశితంగా విశ్లేషిస్తారు… అదీ ఈసారి లోపించింది… అందుకేనేమో కార్తీక్ కావల్సిందేనని వీక్షకుల పట్టు… అన్నట్టు హోస్ట్ శ్రీరామచంద్ర లొడాస్ లాగుల్ని తీసేసి, కాస్త చూడబుల్ డ్రెస్ తొడిగారు… థాంక్ గాడ్…

లక్ష్మి అని ఓ ఫోక్ సింగర్… తమన్ ఆమె టోన్‌, వాయిస్ కల్చర్, పాడేతీరుతో ఇంప్రెస్ అయిపోయి త్వరలో నా సాంగ్‌లో చాన్స్ ఇస్తానని చెప్పాడు కదా… పవన్ కల్యాణ్ ఓజి సినిమాలోని ఓ సాంగ్ నిజంగానే ఆమెతో పాడించాడట… గుడ్… కొత్త వాళ్లకు అవకాశాలు ఇస్తుంటే స్వరవైవిధ్యం ఉంటుంది సినిమా పాటల్లో… అదే కావాలి… ఒక్క పాట చాలు, సింగర్లను హైలైట్ చేయడానికి… మంగ్లి, ఇంద్రావతి ఇప్పుడెంత పాపులర్ సింగర్స్ అయ్యారో చూస్తున్నాం కదా…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Only SunDay- Not FunDay… పరమ పేలవంగా నాగార్జున వీకెండ్ షో !
  • మైండ్ బ్లాకయ్యేలా… జన్వాడ భూముల ‘మోడస్ ఆపరెండి’…
  • పరిపక్వత – రాజకీయాల్లో, వ్యక్తిగత తత్వాల్లో… మంచి ఉదాహరణ !
  • బాలయ్య కొడుకు ఎంట్రీకి ఈ కథ సరిగ్గా కుదురుతుందేమో..!!
  • మోదీకి తెలిసొచ్చిందట – దక్షిణ రాజకీయాలపై మతప్రభావం !!
  • యుద్ధం ముదురుతోంది – ప్రపంచ దేశాలన్నీ లాగబడుతున్నయ్ !!
  • ‘‘ ఆ వృద్ధ టిబెటన్ షెర్పా ఆఫీసర్ నా మెంటల్ మ్యాప్ మార్చేశాడు ’’
  • అంతటి కమలహాసన్ సైతం… ఆ అక్కినేని సీన్లలో వెలవెలా..!!
  • ఇరుముడి ! థియేటర్- ఓటీటీ వీక్షకుల వేర్వేరు స్పందనలు..!!
  • కనిమొళి థర్డ్ ఫ్రంట్ ప్రయాస – కేసీయార్ రెడీయా..? సాహసిస్తాడా..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions