Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

… ఇంతకీ ఈ సినిమా కథలో హీరో ఎవరు..? విలన్ ఎవరు..?

December 11, 2024 by M S R

.

ఫాస్ట్ పాసెంజర్ రైల్ లాగా సాగుతుంది 1979 లో వచ్చిన ఈ విజయ సినిమా . దాసరి నారాయణరావు గారి శిష్యుడు దుర్గా నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన మొదటి సినిమా .

మాగంటి రవీంద్రనాధ్ చౌదరి , విజయ బాపినీడులు నిర్మాతలు . ఫుల్ లేడీస్ సినిమా . ఆనాటి మహిళలు మెచ్చే కధ , మెచ్చిన సినిమా . కాబట్టే 13 సెంటర్లలో 50 రోజులు , ఆరు సెంటర్లలో వంద రోజులు ఆడింది .

Ads

ఓ మంచి ధనిక కుటుంబం సాంప్రదాయబధ్ధంగా ఉండే సీతమ్మను కోడలిగా తెచ్చుకుంటుంది . ఆ ఇంట్లో ఓ అందమైన , చురుకైన పనిపిల్ల ఉంటుంది . ఇంట్లో పిల్లలాగానే చలాయించుకుంటూ ఉంటుంది . హీరో తాగొచ్చి పనిపిల్లను పాడుచేస్తాడు . ఆమె గర్భవతి అవుతుంది .

ఆ పిల్లను అమితంగా ప్రేమించే విలన్ బావ ఈ మంచి కుటుంబం మీద అల్లరి చేస్తాడు . సంవత్సరం కింద జరిగిన ప్రమాదంలో తాను సంసార జీవితానికి పనికిరాని వాడిని అయ్యాననే ఓ డాక్టర్ సర్టిఫికెట్ చూపించి ఆ గొడవలోనుంచి బయటపడతారు .

ఈలోపు ఇంటి కోడలు గర్భవతి అవుతుంది . ఆమెను అనుమానిస్తారు . సీతమ్మ వారు పుట్టింటికి చేరుతుంది . పనిపిల్లని విలన్ బావ హత్య చేసి హీరో మీద నెట్టేస్తాడు . మంచి కుటుంబం అంతా కలిసి విలన్ని పోలీసులకు అప్పచెప్పటంతో సినిమా సుఖాంతం అవుతుంది .

ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది హీరోయిన్ తల్లి కూతురికి చెప్పే సత్యవతి కధ . ఆమె ఎలా అష్టకష్టాలు పడింది , అష్టలక్ష్ముల కృపను ఎలా పొందింది , అంధుడైన భర్తకు కంటిచూపు ఎలా తెప్పించుకున్నది వివరించే కధ . ఈ కధ ఉన్నట్లు కూడా నాకు తెలియదు . ఏ పురాణంలోనిదో కూడా తెలియదు .

కధ మాత్రం చాలా సందేశాత్మకంగా ఉంది . సత్యవతిగా జయంతి నటించింది . అందరూ తప్పక చూడవలసిన కధ . ఈ కధలోని మంగళ రూపిణి మంగళ దాయిని పాట వీడియో యూట్యూబులో ఉంది .

సినిమాలో ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి . చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలు థియేటర్లో బాగానే ఉంటాయి . బయట పాపులర్ అయినట్లుగా లేదు . హీరోయిన్ సరిత ద్విపాత్రాభినయం ఓ పెద్ద ట్విస్ట్ . సరిత , నూతన్ ప్రసాదుల నటనను ప్రత్యేకంగా మెచ్చుకోవాల్సిందే .

వేటగాడు సినిమాలోలాగా జంధ్యాల రావు గోపాలరావు డైలాగులను ప్రత్యేకంగా వ్రాసారు . జంధ్యాల మార్కు డైలాగులు ఉన్నాయి. దుర్గా నాగేశ్వరరావు దర్శకత్వం బాగుంది .

నటీనటుల చేత బాగానే నటింపచేసుకున్నాడు . మోహన్ బాబు , మురళీమోహన్ , చిట్టిబాబు , రమాప్రభ , విజయలలిత , నిర్మలమ్మ , హలం , జయమాలిని , అనిత , ఛాయాదేవి , పండరీబాయి , తదితరులు నటించారు .

ఫేమిలీ సెంటిమెంట్ , ఫుల్ లేడీస్ ఫీల్ గుడ్ సినిమా . Partly colour cinema . నలుపు తెలుపుతో ప్రారంభమయి మన రాజకీయ నాయకులు రాత్రికి రాత్రి పార్టీలు మారినట్లు సడెన్ గా రంగుల్లోకి మారుతుంది .

సినిమా యూట్యూబులో ఉంది . కాస్త ఓపిగ్గా చూడాలి . ఫాస్ట్ పాసెంజర్ రైల్ . ధడధడా సాగదు . అయినా బాగుంటుంది . చూడబుల్ . ముఖ్యంగా సత్యవతి అష్టలక్ష్ముల కధ . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు         …….. ( సమీక్ష :: దోగిపర్తి సుబ్రహ్మణ్యం )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మేం తోపు హీరోలం… మేం తురుములం… తీరా లెక్క తీస్తే వందల కోట్ల లాస్…
  • శుభమన్ గిల్… అంకెల్లో కాదు, ఆ స్పిరిట్‌లో చూడాలి తన ఆటను..!!
  • అంతరిక్ష ఖననం అనుకున్నారు… చివరకు సముద్ర ఖననం జరిగింది…
  • అసలు గానమురళి పాడేది సంగీతమే కాదని కోర్టులో కేసు వేశారు..!!
  • ఎలోన్ మస్క్ కొత్త అమెరికా పార్టీ… ఇల్లలకగానే పండుగ కాదు బాసూ…
  • హలో సారూ… తెలంగాణపై ఎవరికీ పేటెంట్ రైట్స్ లేవు మాస్టారూ…
  • చివరకు తోడు ఓ పడక మంచమే… మిగతావన్నీ వదిలేసే గురుతులు మాత్రమే…
  • ఇది దీపిక పడుకోన్ కాలం… దీపిక చిఖిలియా రోజులు కావు తల్లీ…
  • ఉప్పుకప్పురంబు…! మహానటి బ్రాండ్ ‘కీర్తి’ పలుచన…!!
  • ఒంటె ఒక్క కన్నీటి చుక్క… 26 పాముల విషానికి విరుగుడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions