Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

…. అన్నట్టు విజయ సాయిరెడ్డి కొత్త పార్టీ అనగానే గుర్తుకొచ్చింది… .

November 13, 2026 by M S R

.

Murali Buddha… డ్రైవర్ రాజకీయాలు… దిలీప్ అని కేసీఆర్‌కు పిఎస్ ఉండేవారు. కేసీఆర్‌కు రాజకీయాలు నేర్పింది నేనే, జాతీయ నాయకులను పరిచయం చేసింది నేనే … నేను లేక పోతే కేసీఆర్ లేడు… తెలంగాణ లేదు అంటూ యూ ట్యూబ్‌లో చెబుతుంటాడు…

దిలీప్ ఎవరు ? ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు అంటే ఆయనకే తెలియని విషయం నేనెలా చెప్పగలను… బీజేపీలో చేరారు, కాంగ్రెస్‌లో చేరారు. సొంతంగా పార్టీ పెట్టారు. అదేదో లోక్ దళ్ స్టేట్ డీలర్ షిప్ తీసుకున్నారు…

Ads

టీడీపీలో PNV ప్రసాద్ అని ఉండేవారు. బాబుకు అత్యంత సన్నిహితంగా ఉంటూ పార్టీలో శిక్షణ శిబిరాలు నిర్వహించేవారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ LIC ఏజెంట్ …. LIC అంటే అల్లాటప్పా కాదు… ఎన్టీఆర్ ఫ్యామిలీ, టీడీపీ ఫ్యామిలీ జీవిత బీమా అంటే మాములుగా ఉండదు… భారీ సంపాదన. అంత సంపాదించాక రాజ్యసభ సభ్యత్వం ద్వారా ప్రజాసేవ చేయాలి అని కోరిక పుట్టి అడిగితే బాబు ఇవ్వలేదు . ఇంత కీలక వ్యక్తికి కోపం వచ్చి రాజ్యాధికార పార్టీ, తర్వాత ysr కాంగ్రెస్ అంటూ తిరిగారు. ఇప్పుడు ఎక్కడో తెలియదు.

YS అధికారంలో ఉన్నప్పుడు పాలెం శ్రీకాంత్ రెడ్డిని ఆంధ్రజ్యోతి ఆకాశానికెత్తింది . ఓరోజు ఎన్టీఆర్ భవన్‌లో ‘‘పులివెందులలో వైస్సార్ ఏమీ చేయలేదు. ఛాలెంజ్ … ఏమైనా చేసినట్టు నిరూపిస్తే నా రాజకీయ జీవితాన్ని వదులుకుంటా’’ అని వీరావేశంగా ప్రకటించారు. నిజానికి వేరేవారి ప్రెస్ కాన్ఫరెన్స్ అది, అదనంగా ఇతన్ని కూడా జత చేర్చారు.

అప్పటికి అతను పార్టీలో చేరి మూడు నెలలు అవుతుంది . ‘‘రాజకీయ జీవితాన్ని వదులుకుంటావా ? ఏముందని నీకు రాజకీయ జీవితం’’ అని అడిగితే- కంగుతిని మూడు నెలల నుంచి పార్టీలో పని చేస్తున్నాను కదా అన్నాడు. ఎంపీ, mla, మంత్రి పదవి వదులుకుంటాను అన్నంత ఆవేశంగా చెప్పారు మరి, ఏమీ లేనిది ఏమి వదులుకుంటారు అని అడిగాను…

1987 లో సంగారెడ్డిలో నేను పని చేసేప్పుడు ప్రభుత్వ డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు యాదగిరి అని ఉండేవాడు. ‘‘పాలనలో డ్రైవర్‌దే ప్రాముఖ్యత – డ్రైవర్ లేనిదే ప్రధాని కూడా ఏమీ చేయలేరు’’ అని ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు చెప్పేవారంటూ యాదగిరి ప్రతి మీటింగ్‌లో చెప్పేవాడు. మూడు నెలల రాజకీయ అనుభవంతో ఏకంగా రాజకీయ పార్టీ పెట్టారు .

Facebook లో పార్టీ పెట్టి లైక్ చేస్తే పార్టీ పదవి ఇస్తాను అని ప్రకటించిన మేధావులు కూడా ఉన్నారు. ఎన్టీఆర్ డ్రైవర్‌ను దమ్మున్న ఛానల్స్ కూడా భారత రత్నను ఇంటర్వ్యూ చేసినంత తన్మయత్వంతో చేశాయి. ఎన్టీఆర్‌ను తానే నడిపించాను అన్నట్టుగా చెప్పేవాడు ఆ డ్రైవర్.

అధికారానికి దగ్గరగా ఉన్న వారికి ఆ అధికారం కొంత అంటుతుంది. అధికారం పక్కన ఉండడం వల్లే ఆ పరిమళం తమకు కొంత అంటింది అనే విషయం తెలియక ., తమ వల్లనే అధికారం పరిమళిస్తుంది అని డ్రైవర్లు , పీఏలు, అటెండర్లు కూడా అనుకుంటారు . తమ భ్రమలు నిజం అనుకొని పార్టీలు కూడా పెడతారు . ఓ ఎన్నికల కాలం గడిచాక అసలు విషయం తెలుస్తుంది … విజయ సాయి రెడ్డి పార్టీ అంటే గుర్తుకు వచ్చింది… .

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • …. అన్నట్టు విజయ సాయిరెడ్డి కొత్త పార్టీ అనగానే గుర్తుకొచ్చింది… .
  • పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్… విశ్వనగరంలో అత్యాధునిక రవాణా!
  • ఆ ఒక్కడి ఆ బలహీనత- చైనా హానీట్రాప్- కుప్పకూలిన ‘బ్లూచిప్’…
  • G O A T … అనగా మేక, అనగా బకరా… అనగా తెలుగు ప్రేక్షకుడు..!!
  • పాపం రెహమాన్ ! కచేరీలకు ఆదరణ కరువు ! చుట్టూ బోలెడు నెగెటివిటీ !!
  • Overhauling Telangana’s Schooling: A Bold Step Toward Educational Equity
  • పాఠశాల విద్య సంస్కరణలు- బీఆర్ఎస్‌కు చేతకానిది, రేవంత్ సంకల్పించినది!
  • 3200 కోట్ల మంది హిందూ దేవతలట… మమత పార్టీ ఎంపీ పిచ్చి కూతలు!!
  • పార్టీ పేరు దగ్గర మొదలైన కసరత్తులోపం… ఆవిర్భావ ప్రసంగం దాకా..!!
  • టీవీకే ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ రహస్య భేటీలు- దేనికంటే..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions