నిజమే… ఆమెకు పనిచెప్పడం లేదు, ఎక్కడి నుంచి పోటీ చేయాలో క్లారిటీ ఇవ్వడం లేదు… ఆమెను ముఖ్య సమావేశాలకు పిలవడం లేదు… ఆమెను అసలు పార్టీ నాయకురాలిగానే చూడటం లేదు… ఆమెకు తగిన గౌరవం లేదు… ఎస్, విజయశాంతికి తను బీజేపీలోనే ఉన్నానా అనే డౌట్ రోజుకు వేయిసార్లు వస్తూ ఉండవచ్చు బహుశా… అన్నీ నిజాలే…
నాణేనికి ఒక కోణం ఆలోచిద్దాం… అది బీజేపీ… ఎవరూ పిలిచి పీటలేసి, కిరీటాలు పెట్టరు… చొరవ తీసుకోవాలి… పైగా ఆమె ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి రాలేదు… ఆమె ఎన్ని పార్టీలు మారిందో ఆమెకే తెలియదు… ఎక్కడో ప్రారంభమై, ఇప్పుడు బీజేపీలో హాల్ట్… నిజమే, బీజేపీకి నిజంగానే ఆమె అక్కర్లేదు… మరి ఇప్పుడు ఆమె మళ్లీ ఎటు వెళ్లాలి… కేసీయార్ ససేమిరా రానివ్వడు, ఆఫీసు మెట్లు కూడా ఎక్కనివ్వడు… లెఫ్ట్‌కు పనికిరాదు…
ఏమో, సముద్రంలా అన్నింటినీ కలుపుకునే కాంగ్రెసే దిక్కు అవుతుందా… అక్కడ ఎలా ఉంటుందో కూడా ఆమెకు అనుభవమే కదా మరి… ఇక మిగిలినవి వైఎస్సార్టీపీ… సారీ, అక్కడ షర్మిల తప్ప ఇంకెవరూ లేరు… బీఎస్సీలో ప్రవీణ్, ఆప్‌లో ఇందిరాశోభన్, డీఎంకేలో గాలి వినోద్, టీజేఎస్ కోదండరాం ఏమైనా చాన్స్ ఇస్తే సరి… ఆ పార్టీలైనా సరే, ఈమెకు పీటలేసి, పెత్తనాలు ఇచ్చే సీన్ లేదు…
Ads
విజయశాంతి ఒకప్పుడు స్టార్ హీరోయిన్… మస్తు పాపులారిటీ… కానీ ఇప్పుడేముంది..? వయస్సు మళ్లింది… మాటలో పంచ్ ఉండదు, ఒకమాటకు మరోమాటకు పొంతన ఉండదు, సబ్జెక్టు నాలెడ్జి కనిపించదు… రాష్ట్రంలో ఏదైనా మహిళలకు సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు వెళ్తే ఎవరైనా వద్దన్నారా..? ఏదో ఒక యాక్టివిటీ కల్పించుకుని, బయటికి వస్తే, జనంలోకి వెళ్తే పార్టీ షోకాజ్ ఇస్తుందా..? పోనీ, అదైనా పరీక్షించవచ్చు కదా… తనేమో బయటికి రాదు… జస్ట్, ఇప్పుడైతే కేవలం ట్వీట్లు… అంతే…
ఎస్, విజయశాంతి అసంతృప్తిని పక్కనపెడితే… తెలంగాణ బీజేపీలో ఓ సెక్షన్ బలంగా పాతుకుపోయి, మిగతావాళ్లను రానివ్వదు, ఎదగనివ్వదు… గట్టిగా మాట్లాడితే అమిత్ షాను కూడా పట్టించుకోరు వాళ్లు… ఫాఫం, ఆయన కూడా ఏమీ చేయలేకపోయాడు ఇన్నాళ్లూ… వాళ్లతో పడక కొందరు నాయకులు పార్టీలోకి వచ్చి, ఇమడలేక వెళ్లిపోయారు… అంత హార్డ్ కోర్ రాజాసింగ్‌కే తప్పడం లేదు ఈ తిప్పలు… రఘునందన్, ఈటలకు కూడా అర్థమవుతోంది… బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడు కాబట్టి గుర్తిస్తున్నారేమో తప్పనిసరై…
ఈ అరాచకాన్ని బ్రేక్ చేయగలడా బండి సంజయ్… లేదు, చేయలేకపోతున్నాడు… తను ఎవరి మాటను వింటున్నాడో కూడా ఎవరికీ అర్థం కాదు కొన్నిసార్లు… తన ఆంతరంగిక బృందంలో భిన్నమైన అంశాలపై అవగాహన, అధ్యయనం తెలిసినవాళ్లు కూడా పెద్దగా ఉన్నట్టు లేరు… లక్ష్మణ్‌ను పార్టీ జాతీయ హోదాలతో ఢిల్లీలో బాగా ఎంగేజ్ చేస్తోంది, కిషన్‌రెడ్డి ఎలాగూ కేంద్ర మంత్రి, దత్తాత్రేయను బయటే ఉంచుతున్నారు గవర్నర్ గిరీలో… ఇంద్రసేనారెడ్డికి కూడా ఏదో జాతీయ కీలకపదవి ఇస్తారంటున్నారు…
ఐనాసరే, బండి సంజయ్‌కే ఒకవైపు కష్టమైపోతోంది… ఇక విజయశాంతికి ఏం పనిచెప్పగలడు, ఏం క్లారిటీ ఇవ్వగలడు..? చేరికల కమిటీ కన్వీనర్‌గా బాధ్యతలు తీసుకున్న ఈటలకు నిజంగా ఓ పరీక్ష… వద్దామని ఆసక్తి ఉన్నవాళ్లకు బోలెడు డౌట్లు… అంతటి ఈటలకే తొలుత సరైన ప్రయారిటీ లభించకపోతే, ఆర్ఎస్ఎస్ రూట్‌లో ఢిల్లీ హైకమాండ్‌కు చెప్పించాల్సి వచ్చిందట… మరిక విజయశాంతికి పీటలెవరు వేయాలి..?!
Share this Article