Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రైవేటు రాకెట్ విక్రమ్-1 విజయాన్ని ఇలా అర్థం చేసుకుందాం!!

July 18, 2026 by M S R

.

అప్పుడెప్పుడో ఇస్రో పుట్టిన రోజుల్లో… అరకొర వసతులతో ప్రారంభమై… ఖగోళంపై విజయం సాధించడానికి ఎన్నో ప్రయోగాలు, ఎంతో ప్రయాస… ఎందరో శాస్త్రవేత్తల కృషి, ప్రతిభ… కానీ అది ప్రభుత్వరంగం… అన్ని ప్రభుత్వ సంస్థల్లో ఉన్నట్టే అక్కడా శాస్త్రీయ వాతావరణాన్ని డిస్టర్బ్ చేసేవాళ్లు ఉన్నారు, ఉంటారు… ఉన్నతాధికారులు, కేంద్ర పెద్దలు సహా!

ఈ నేపథ్యంలో ప్రైవేటు రంగం బరిలోకి వచ్చింది… పలు అంతరిక్ష ప్రయోగ, పరిశోధన సంస్థలు పెట్టుబడులతో, కొత్త రక్తంతో పోటీలోకి వచ్చాయి… నిజానికి ఇది ఇస్రోకు పోటీ కాదు, సమాంతరంగా మరింతగా మన ఖగోళ ఆధిపత్యానికి మరింత పదును పెట్టడం… ఈరోజు అంతరిక్షంలో దూసుకుపోయిన విక్రమ్-1 రాకెట్ ‘మిషన్ ఆగమన్’ను ఆ దృష్టితో మాత్రమే చూడాలి…

Ads

చాలా దేశాల్లో ప్రైవేటు సంస్థలు అద్భుతాలు చేస్తున్నాయి కూడా… అంతెందుకు నాసాకు సమాంతరంగా స్పేస్ ఎక్స్ ఓనర్ ఎలన్ మస్క్ తన డబ్బును, తన కాలాన్ని విపరీతంగా వెచ్చిస్తున్నాడు, విజయాలున్నయ్, అపజయాలున్నయ్… కానీ అనివార్యం… ప్రైవేటురంగం కాలుమోపకుండా ఎవరూ ఆపలేరు…

ఈ విక్రమ్-1 సంగతికొద్దాం… మన శ్రీహరికోట నుంచే ప్రయోగించారు… ఒక భారతీయ స్టార్టప్ మన కళ్ల ముందే ఓ కొత్త చరిత్ర సృష్టించింది… ఈ సంస్థ పేరు స్కైరూట్ ఏరోస్పేస్ (Skyroot Aerospace)… ​నిజం చెప్పాలంటే, ఇది వింటుంటే ఎంతో గర్వంగా, ఎగ్జైటింగ్‌గా ఉంది… మనసులో ఎక్కడో ఒక చిన్న ఆందోళన, సందేహం కూడా ఉండేది… ఎందుకంటే రాకెట్ సైన్స్ అనేది చాలా క్రూరమైనది… ఒక్క చిన్న పొరపాటు జరిగినా సంవత్సరాల శ్రమ నిమిషాల్లో బూడిదవుతుంది… గతంలో స్పేస్ ఎక్స్ (SpaceX) కూడా ఇలాంటి మొదటి ప్రయత్నాల్లో ఎన్నో ఘోరమైన పరాజయాలను చూసింది…

అసలు ఇస్రో (ISRO) లాంటి ప్రభుత్వ దిగ్గజం ఉన్న దేశంలో, ఒక ప్రైవేట్ స్టార్టప్ ఇంత పెద్ద రిస్క్ తీసుకోవడం, ఫండింగ్ కోసం ఇబ్బంది పడటం అవసరమా అని కొందరికి అనిపించవచ్చు… ​కానీ, రిస్క్ లేకపోతే హిస్టరీ ఎలా క్రియేట్ అవుతుంది..? 2018 లో ఇస్రోను వీడి వచ్చిన ఇద్దరు మాజీ శాస్త్రవేత్తలు కేవలం ఒక నమ్మకంతో దాదాపు 3,000 రోజులు పగలు రాత్రి కష్టపడ్డారు… 23 మీటర్ల పొడవున్న ఈ కార్బన్ కాంపోజిట్ రాకెట్ వెనుక వారి 8 ఏళ్ల తపస్సు ఉంది… ఇది కేవలం డెమో ఫ్లైట్ కాదు, నిజమైన కస్టమర్ పేలోడ్స్‌ని 450 కిలోమీటర్ల కక్ష్యలోకి తీసుకెళ్తోంది… అంటే బాధ్యత, ప్రెజర్ ఇంకా ఎక్కువ..!

​ఈ ప్రయోగం సక్సెస్ అయితే… భారతదేశ ప్రైవేట్ అంతరిక్ష రంగ రూపురేఖలే మారిపోతాయి. గ్లోబల్ స్పేస్ మార్కెట్‌లో మన దేశపు ప్రైవేట్ కంపెనీల హవా మొదలవుతుంది. స్పేస్ ఎక్స్ సాధించింది మన వాళ్లు కూడా సాధించగలరని నిరూపితమవుతుంది. ​ఏదేమైనా, ఈ ప్రయత్నమే ఒక అద్భుతం…. ఇంకాస్త వివరాల్లోకి వెళ్దాం…

ప్రముఖ భారతీయ ప్రైవేట్ అంతరిక్ష సంస్థలు…

  • అగ్నికుల్ కాస్మోస్ (Agnikul Cosmos): ఇది చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్. వీరు స్వదేశీ పరిజ్ఞానంతో రాకెట్లను, ముఖ్యంగా చిన్న తరహా ఉపగ్రహాలను ప్రయోగించేందుకు అవసరమైన ‘అగ్నిబాణ్’ వంటి లాంచ్ వెహికల్స్‌ను అభివృద్ధి చేస్తున్నారు.

  • ధ్రువ స్పేస్ (Dhruva Space): హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ, ఉపగ్రహాల తయారీ,  అంతరిక్ష పరిశోధనలో పూర్తి స్థాయి పరిష్కారాలను (Full-stack space engineering solutions) అందిస్తోంది.

  • పిక్సెల్ (Pixxel): వీరు అత్యాధునిక ‘హైపర్-స్పెక్ట్రల్’ ఇమేజింగ్ ఉపగ్రహాలను తయారు చేస్తున్నారు. ఇవి భూమిపై ఉన్న వనరులను నిశితంగా పరిశీలించడానికి ఉపయోగపడతాయి.

  • బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ (Bellatrix Aerospace): వీరు రాకెట్లకు అవసరమైన అధునాతన ప్రొపల్షన్ సిస్టమ్స్ (Propulsion Systems) , శాటిలైట్ థ్రస్టర్లను అభివృద్ధి చేయడంలో ప్రత్యేకత కలిగి ఉన్నారు.

  • దిగంతర (Digantara): అంతరిక్ష వ్యర్థాల (Space Debris) గుర్తింపు, అంతరిక్షంలో ట్రాఫిక్ నిర్వహణ కోసం అవసరమైన డేటా మరియు సాంకేతికతను ఈ సంస్థ అభివృద్ధి చేస్తోంది.

  • అస్ట్రోమ్ టెక్నాలజీస్ (Astrome Technologies): వీరు అంతరిక్ష ఆధారిత ఇంటర్నెట్ కమ్యూనికేషన్ టెక్నాలజీపై పనిచేస్తున్నారు.

  • టీమ్ ఇండస్ (TeamIndus): చంద్రునిపైకి ల్యాండర్‌ను పంపే లక్ష్యంతో ప్రారంభమైన ఈ సంస్థ, అంతరిక్ష పరిశోధనల్లో పేరు పొందింది.

  • గెలాక్స్‌ఐ స్పేస్ (GalaxEye Space): శాటిలైట్ ఆధారిత భూ పరిశీలన (Earth Observation) కోసం మల్టీ-సెన్సార్ టెక్నాలజీపై ఈ సంస్థ పనిచేస్తోంది.

ఇవి కాకుండా అనంత్ టెక్నాలజీస్ (Ananth Technologies), లార్సెన్ & టూబ్రో (L&T) వంటి పెద్ద సంస్థలు కూడా ఇస్రో (ISRO) ప్రాజెక్టులకు అవసరమైన విడిభాగాల తయారీ, అసెంబ్లీలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

ప్రస్తుతం భారత్‌లో ఇలాంటి స్టార్టప్‌లు, ప్రైవేట్ సంస్థలు డజనుకు పైగా ఉన్నాయి. వీటన్నింటికీ భారత ప్రభుత్వానికి చెందిన IN-SPACe (Indian National Space Promotion and Authorization Centre) అనే సంస్థ, ఇస్రో (ISRO)కు మరియు ప్రైవేట్ కంపెనీలకు మధ్య ఒక వారధిలా ఉంటూ సహకారాన్ని అందిస్తోంది…. సో, ప్రభుత్వం- ప్రైవేటు కలిసి పనిచేస్తున్నాయి… శుభసంకేతం!!

భారత అంతరిక్ష పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ స్మృత్యర్థం ఈ రాకెట్‌కు 'విక్రమ్' అని పేరు పెట్టడం విశేషం...

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ప్రైవేటు రాకెట్ విక్రమ్-1 విజయాన్ని ఇలా అర్థం చేసుకుందాం!!
  • సోనమ్ దీక్ష భగ్నం సరైన చర్య! ఇప్పటికే ఆలస్యమైంది కూడా!!
  • ఐశ్వర్య ఫ్లాప్ – లయ డబుల్ ఫ్లాప్ – నాగదుర్గ డిజాస్టర్ – ఏమిటీ దురవస్థ..!!
  • TRS … ఈ పేరుపై BRS ప్రేమ ఏమీ లేదు… భయం, కలవరం..!!
  • అదే పాత కథ- అదే పాత తారాగణం- అదే పాత కథనం… చీప్ కామెడీ అదనం !!
  • … దాంతోనే మొదలైంది యండమూరి సుదీర్ఘ రచన ప్రస్థానం !
  • అనగనగా ఓ దట్టమైన అడవి… దారితప్పిన ఆరుగురు ఫ్రెండ్స్
  • ఓ పాకిస్థానీ గూఢచారి (స్పై) దొరికాడు… కానీ ఒప్పుకోవడం లేదు
  • ‘లయ’ తప్పింది ! ‘వదలా’ అంటూ బోరించే కథాకథనాలు !!
  • అబ్సర్డ్ ! ఓ కరెంటు పోరితో యాదిగాడి సంసారం – రక్తికట్టలేదు బాసూ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions