ఎవరైనా మన మనస్సుకు నచ్చినవాళ్లు అకస్మాత్తుగా దూరమైతే ఓ బాధ… కలలోనో, మెలకువలోనో తను అకస్మాత్తుగా బతికి వచ్చి పలకరించినట్టు అనిపించడమూ సహజమే… మనసులో శూన్యాన్ని గుర్తుచేస్తూ, మరింత బాధ కలిగించే భావన… ఇప్పుడు పునీత్ రాజకుమార్ మీద లక్షలాది మంది కన్నడిగుల్లో ఇలాంటిదే ఓ ఫీలింగ్… అసహజమేమీ కాదు… అయితే రెండు వీడియోలు ఇప్పుడు ఆ రాష్ట్రంలో వైరల్ అవుతున్నాయి… అందులో ఒకటి తను విధి రాత గురించి చెబుతున్న వీడియో… అది మనం ఇప్పటికే చూసేశాం… మరోసారి చూడండి… చిన్న బిట్… ‘కాస్త ముందూ, కాస్త వెనుకా అందరూ పోతాం, ఏం తిన్నాం, ఏం సంపాదించాం అనేది నథింగ్, విధి రాసినట్టు జరుగుతుంది’ అని పునీత్ చెబుతున్న వీడియో అది… చూడండి…
మరో వీడియో ఏమిటంటే..? ఒక సినిమా ప్రమోషన్ వీడియో అది… కాస్త క్రియేటివ్‌గా ఆర్గనైజ్ చేశారు… అందులో ఒక సినిమా గురించి నటీనటులు, కొందరు అభిమానులు తమ అనుభవాల్ని షేర్ చేసుకుంటూ ఉంటారు, వెనుక నుంచి అనుకోకుండా పునీత్ వచ్చి ఆశ్చర్యానికి గురిచేస్తాడు, వాళ్లను అభినందిస్తాడు… అదీ వీడియో… అదిప్పుడు వైరల్… ఎందుకంటే..? ఇలాగే పునీత్ హఠాత్తుగా తెర వెనుక నుంచి బతికి వస్తే బాగుండు అనే ఫీలింగ్… బాగుంది… ‘‘అలా వస్తే బాగుండు’’ అని… ఆ వీడియో లింక్ ఈ ఫేస్‌బుక్ పోస్టులో…
దిగువ ఫోటోలు కంఠీరవ స్టేడియంలో పునీత్‌కు అంతిమ నివాళి అర్పించడానికి లక్షలాదిగా తరలివస్తున్న జనం… అన్ని ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించనున్నట్టు కర్నాటక ప్రభుత్వం ప్రకటించింది… ఇంతమంది అభిమానం పొందిన పునీత్ ధన్యజీవి, పుణ్యజీవి… అవునూ, ఓసారి ఆ వీడియోలో చూసినట్టు… హఠాత్తుగా మళ్లీ వస్తే బాగుండు… కదా…!! (మనం ఎలా బతికామనేది మన చావు చెబుతుంది)
Ads
Share this Article