Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వివాహ భోజనంబు..! షడ్రుచుల విందు… కాస్త కామెడీ డోస్ మెండు..!!

December 11, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ……. ఒకసారి లోపలికి రా ! ఈ సినిమాలో నాకు నచ్చిన సీన్లలో మొదటిది . లోపలికి రమ్మని పిలవటం ఏముంది ! చాలామంది భార్యలు రమ్మంటారు . లోపల అందరూ ఉతకరు కదా ! పాపం పోలీసు అని కూడా చూడకుండా ఉతుకో ఉతుకు . ఇంక భార్యాబాధితుల సంఘంలో చేరకుండా ఎలా ఉంటాడు !

ఆదివిష్ణు మూలకధకు జంధ్యాల మలిచిన ఈ వివాహ భోజనంబు గొప్ప హాస్య రస భరిత చిత్రం . 100% జంధ్యాల మార్క్ సినిమా . పైగా షూటింగ్ అంతా సుందర విశాఖ . మొదట్లో కాస్త స్లోగా అనిపించినా తర్వాత తర్వాత స్పీడ్ అందుకుని ఎక్కడా బోరించకుండా లాగించేసారు .

Ads

వెయ్యేళ్ళ మాయాబజార్ సినిమాలోని యస్వీఆర్ , మాధవపెద్దిల వివాహ భోజనంబు పాట స్ఫూర్తితో ఓ వినూత్న కధకు సినిమా రూపమే ఈ వివాహ భోజనంబు . సుత్తి వీరభద్రరావు , బ్రహ్మానందం కాంబినేషన్ , ముఖ్యంగా క్లైమాక్సులో బ్రహ్మానందం గడ్డాలు పెరగటం , అస్థిపంజరం కావడం , వగైరా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు . వీరభద్రరావు ఆసనాల గోల జనం మరచిపోలేరు .

ఇంక హీరోహీరోయిన్ల స్త్రీ , పురుష ద్వేష సమాజాల యుధ్ధం , ఆ యుధ్ధంలో ఒకవైపు రమాప్రభ , అశ్విని , మరోవైపు రాజేంద్రప్రసాద్ పోటాపోటీ మీటింగులు , ఊరేగింపులు , బలప్రదర్శనలు అల్లరల్లరిగా ఉంటాయి . జంబలకిడిపంబ సినిమాకు ట్రయల్ రన్ ఈ సినిమా .

vivaha

ఓ చిన్న ప్లాటు చుట్టూ స్త్రీ , పురుష ద్వేషం పెట్టి చివరకు ఆంజనేయ స్వామి చేత కూడా స్త్రీ లేకుండా పురుషుడు లేడనే సత్యాన్ని చెప్పించారు జంధ్యాల . నిజమే కదా ! స్త్రీ లేకుండా పురుషుడు ఎక్కడ ! పెళ్ళికి ముందు తల్లి , పెళ్ళయ్యాక భార్య .

ప్రధాన జంటల్లో ఒక జంట రాజేంద్రప్రసాద్ , అశ్విని . ఇద్దరూ చలాకీగా బాగా నటించారు . మరో వీర జంట సుత్తి వేలు , రమాప్రభ . ఇద్దరికిద్దరే .ఇద్దరిలో కాస్త ముందు రమాప్రభే . A versatile actress . తమిళులకు మనోరమ ఎలాగో మనకు రమాప్రభ అలా .

ఇతర ప్రధాన పాత్రల్లో చంద్రమోహన్ , రాజ్యలక్ష్మి , హరీష్ , సుత్తి వీరభద్రరావు , బ్రహ్మానందం , ఆంజనేయ స్వామిగా భీమరాజు , శ్రీకాకుళం యాసలో పొట్టి ప్రసాద్ , రజిత , శుభలేఖ సుధాకర్ , విద్యాసాగర్ , అతిధి పాత్రలో బాలసుబ్రమణ్యం , గుండు హనుమంతరావు , ఎంతోమంది విశాఖ ఔత్సాహికులు నటించారు .

సినిమాలో నేరస్తులతో , చివరకు బిచ్చగాళ్ళతో కూడా , స్కిల్ గేం అనో పేరు పెట్టి పేకాట అడి కానిస్టేబుల్ సుత్తి వేలు డబ్బులు గెలుచుకోవటం నిజ జీవితంలో ఒక విన్యాసాన్ని గుర్తు చేస్తుంది . కార్తీక వన సమారాధనల్లో ఆఫీసర్లతో కింది స్థాయి ఉద్యోగులు , డబ్బున్నోళ్ళు , కాంట్రాక్టర్లు పేకాట ఆడుతుంటారు . షో అయినా సమర్పణ కొరకు తిప్పరు .

విశాఖపట్నంలో హోటల్ అప్సర , హోటల్ మేఘాలయ వంటి లేండ్ మార్కులు , విశాఖ రోడ్లు సినిమాలో చక్కగా కనిపిస్తాయి . బాలసుబ్రమణ్యం సంగీత దర్శకత్వంలో వేటూరి , వెన్నెలకంటి , ముళ్ళపూడి శాస్త్రి పాటల్ని వ్రాయగా బాలసుబ్రమణ్యం , జానకమ్మ , శైలజ శ్రావ్యంగా పాడారు .

పాటలనన్నీ జంధ్యాల బ్రహ్మాండంగా చిత్రీకరించారు . సీతారామ స్వామీ నే చేసిన నేరమూలేమీ పాట సూపర్ హిట్ . ఆ డ్యూయెట్ కూడా చాలా అందంగా చిత్రీకరించబడింది . ప్రేమా రెక్క విచ్చింది భామా మొగ్గ తొడిగింది డ్యూయెట్ కూడా బాగా వచ్చింది . అమ్మా తల్లే ప్రియా అంటూ రాజేంద్రప్రసాద్ పాడుతూ రకరకాల వేషాల్లో అశ్విని వెంటపడే పాట కూడా బాగుంటుంది .

కాలేజీలో వెంటపడుతూ పాడే జుం తననా కూడా హుషారుగా సాగుతుంది . టగ్ ఆఫ్ వార్ , విద్యార్ధినీ విద్యార్ధుల టీంల మధ్య కబడ్డీ పోటీలు కుర్రాళ్ళకు బాగా నచ్చాయి ఆరోజల్లో . Girls & boys టీంల కబడ్డీ పోటీలు మా కాలేజీలో ఉండేవి కావు బాబూ . ఇంక ఎక్కడయినా ఉన్నాయేమో తెలియదు . మీలో ఎవరయినా చూసారా !? ఆడారా !?

సినిమా ప్రారంభంలోనే విశాఖ వీధుల్లో రాజేంద్రప్రసాద్ , శుభలేఖ సుధాకర్ ఆధ్వర్యంలో భార్యాబాధితుల సంఘం ఊరేగింపు పాట ఉంటుంది . సినిమాను చూచాయగా పరిచయం చేస్తుంది . వివాహమే నశించాలి విరాగాలే ఫలించాలి ; వివాహం నాటకమన్నా కాపురం బూటకమన్నా అంటూ ఊరేగుతారు . హిలేరియస్ గా ఉంటుంది .

వెరశి 100% హాస్యభరిత కాలక్షేప సినిమా . A neat , feel good , romantic hilarious movie. ఇంతకుముందు చూసి ఉండకపోతే తప్పక వాచ్ లిస్టులో పెట్టుకోతగ్గ సినిమాయే .

నేను పరిచయం చేస్తున్న 1191 వ సినిమా .
#తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_స్కూల్ #సినిమా_కబుర్లు #తెలుగు_సినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తెర మీద మాయమై… పోలాండ్‌లో హోటల్ వ్యాపారిగా రూపాంతరం…
  • వివాహ భోజనంబు..! షడ్రుచుల విందు… కాస్త కామెడీ డోస్ మెండు..!!
  • ‘కక్క’ వేముల ఎల్లయ్య ఒక్కడే… ఒక మహోద్యమం..! ఓ అవలోకనం..!!
  • పానీపూరి అమ్మిన లాభాలతో ఏకంగా హెలికాప్టర్ కొనేశాడా..? నిజమేనా..?!
  • ఆ ఊళ్లో ఎవరింట్లోనూ వంటశాల ఉండదు, ఎవరూ వండుకోరు…
  • డబ్బు పంచం, మందు తాపం.,. వోట్లు కొనం…… తరువాత మీ ఇష్టం…
  • పావలా శ్యామల..! ఇలాంటోళ్లను ‘మా’ ఆదుకోదా…? ఏమీ చేయలేదా..?!
  • యూవీ బ్రిటిష్ భార్య మనకూ పరిచయమే…! వాళ్ల లవ్ స్టోరీ తెలుసా మీకు..?!
  • Conspiracy behind Crisis…? ఇండిగో నిర్వాకం వెనుక ఏదో భారీ కుట్ర..!
  • ఇక న్యాయ వ్యవస్థపైనే… హిందూ వ్యతిరేక ఇండి కూటమి అటాక్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions