.
జ్యోతి… పేరుకు ఓ యూట్యూబ్ వ్లాగర్… కానీ అసలు వృత్తి గూఢచర్యం… పాకిస్థాన్‌కు ఉపయోగపడేలా సున్నితమైన మిలిటరీ కదలికల్ని, పరికరాల్ని షూట్ చేస్తూ, వాళ్లకు షేర్ చేస్తోందని కదా ఆమెపై ఆరోపణ…
అరెస్టు చేశారు, పుంఖానుపుంఖాలుగా వార్తలు వస్తున్నాయి… ఆమెకు పాకిస్థాన్ హైకమిషన్ ఆఫీసుతో ఉన్న సంబంధాలు, డేనిష్ అనే వ్యక్తితో బంధాలు, ఆమె పాకిస్థాన్ పర్యటన, ఉగ్రవాద దాడికి నెల ముందే ఆమె పహల్‌గాం వెళ్లడం వంటి బోలెడు కథనాలు వస్తున్నాయి…
Ads
నో డౌట్, ఆమె ఈ దేశానికి శత్రువు… ఆమెతోపాటు ఆమెకు సహకరించే వ్యక్తుల్ని కూడా అరెస్టు చేశారు… ఇదంతా వర్తమానం… ఆమె యూట్యూబ్ అకౌంట్ “Travel with JO” ఫాలోయర్స్ ఎందరు వంటి అనేక వివరాల్ని మీడియా పబ్లిష్ చేస్తోంది… గతం చూసినా సరే, ఆమెది వివాదాస్పద ప్రవర్తన, చిల్లర మెంటాలిటీ అని అర్థమవుతోంది…
గతంలో ఆమె చైనా పర్యటన సమయంలో కనబరిచిన అనుచిత ప్రవర్తనపై సోషల్ మీడియా వేదికలపై తీవ్ర విమర్శలు వచ్చాయి… చైనా పర్యటనలో తీసిన వీడియోలలో.., ఆమె బులెట్ ట్రైన్‌లో ఒక ప్రయాణికుడిని తన సీటు మార్చమని బలవంతంగా కోరడం.., ఒక వృద్ధ మహిళ స్కూటర్‌పై అనుమతి లేకుండా ఎక్కడం.., బస్సుల్లో టికెట్ లేకుండా ప్రయాణించడం వంటి చర్యలు ఉన్నాయి… అలాగే, ఆమె స్థానికులపై చిల్లర వ్యాఖ్యలు చేయడం, వారి భాషను అర్థం చేసుకోకుండా హిందీ లేదా ఇంగ్లీష్‌లో మాట్లాడడం వంటి ప్రవర్తన కూడా విమర్శలకు గురయ్యాయి…
ఈ వీడియోలు వైరల్ కావడంతో, నెటిజన్లు ఆమె ప్రవర్తనను “అసభ్యం, అనుచితం” అని ఎండగట్టారు… చైనా నెటిజనం కూడా తిట్టిపోశారు… ఈ విమర్శలపై జ్యోతి మల్హోత్రా తన యూట్యూబ్ చానెల్‌లో క్షమాపణ చెప్పింది… తన చానెల్‌ను అనేక మంది రిపోర్ట్ కొట్టడంతో విధిలేక సారీ చెప్పింది… భాష తెలియకె పొరపాట్లు జరిగాయనీ, భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తానని పేర్కొంది…
తరువాత గూఢచర్యం… చాన్నాళ్లు సాగింది యవ్వారం… కానీ ఎట్టకేలకు దొరికింది… మరొకటి ఆసక్తికరంగా ఉన్న వార్త ఏమిటంటే…
ఏడాది క్రితమే కపిల్ జైన్ అనే నెటిజన్ ఆమె సందేహాస్పద ప్రవర్తనను గమనించాడు… ఓ ట్వీట్ కొట్టాడు ఇలా…
సరిగ్గా ఏడాది క్రితమే… పాకిస్థాన్ ఎంబసీలో ఫంక్షన్‌కు హాజరు కావడం, పాకిస్థాన్‌లో పది రోజులు పర్యటించడం, నేరుగా అక్కడి నుంచి కశ్మీర్ ప్రయాణం… అన్నీ ఓ క్రమపద్ధతిలో జరుగుతున్నట్టు ఉంది, జాగ్రత్త, ఏదో తేడా కొడుతోంది అని ఎన్ఐఏను ట్యాగ్ చేస్తూ ట్వీటాడు… ఇప్పుడు ఆ ట్వీట్ మళ్లీ వైరలైంది…
అంతేకాదు, ఆమే తన పాత వీడియోలు కీన్‌గా అబ్జర్వ్ చేస్తే ఆమె అనుమానాస్పద ప్రవర్తన కనిపించేది… కానీ ఎన్ఐఏ ఈ హింట్స్‌ను బేఖాతరు చేసింది… అప్పటి నుంచే కాస్త నిఘా వేసి ఉంటే ఎప్పుడో బుక్కయ్యేది… అవునూ, ఆమె ఎన్నికల ముందు హైదరాబాద్‌కు కూడా వచ్చిందట… ఆమె ఎవరిని కలిసింది, ఏమేం ప్లాన్ చేశారో దర్యాప్తు సాగిస్తే..?!
Share this Article