.
బూతు ప్రసిద్ధ జబర్దస్త్ షో గురించి పదే పదే చెప్పుకోనక్కర్లేదు… అదలాగే వారానికి రెండురోజులు బూతును ఇళ్లల్లోకి ధారావాహికంగా ప్రసారం చేస్తూనే ఉంటుంది…
మొదట్లో శ్రీదేవి డ్రామా కంపెనీ కాస్త భిన్నంగా, పద్ధతిగానే అనిపించింది… కానీ దాన్ని మరో జబర్దస్త్ షో చేసేశారు విజయవంతంగా… ద్వంద్వార్థాలు, వెకిలితనం, వెగటు హాస్యంతో ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ షో ఒకటి అసహ్యం అనిపించింది…
Ads
ఏదో తాడుతో ఆడే ఆట… అక్కడున్న టీవీ సెలబ్రిటీలను ఆడిస్తున్నారు… ఆటో రాంప్రసాద్ వంతు వచ్చింది… తను లుంగీ మీద ఉన్నాడు… మోకాళ్ల మీదకు ఎగ్గట్టి, స్కిప్పింగ్ స్టార్ట్ చేశాడు… వెంటనే అటుఇటూ ఊగుతూ, అలజడి రేపుతూ అనే పాట ఆర్ఆర్ వేశారు…
ఇక అర్థం చేసుకొండి మీరే… అర్థమైనవాళ్లకు అర్థమైనంత… ఆ పాట వినగానే ఆ పాటేంట్రా అనడిగాడు… ఈ ఊగుతూ అనే పాట సరిగ్గా అప్పుడే ఎందుకేశారో అర్థమై… ఇంద్రజకు ఇట్టే అర్థమైంది… నవ్వుతూ మొహం దాచుకుంది… రష్మి అయితే భలే ఎంజాయ్ చేసింది సీన్‌ను…
షోలో ఉన్న ఆర్టిస్టులు కూడా పడీపడీ నవ్వుతున్నారు… చివరకు రష్మియే కవర్ చేస్తూ ఆటో రాంప్రసాద్ మెడలో లాకెట్ పట్టుకుని అదే ఊగుతున్నది అని చెప్పుకొచ్చింది పడీ పడీ నవ్వుతూ… రాంప్రసాద్ నవ్వలేక, ఏడ్వలేక…
ఈలోపు పంచ్ ప్రసాద్ వచ్చి ఆటో రాంప్రసాద్‌కు వంద రూపాయలు ఇచ్చి, కింద సెట్ బాయ్ నీకు ఇవ్వమన్నాడు అని ఆపేస్తాడు… (చెడ్డీ కొనుక్కోవడం కోసం..) వెంటనే రష్మి తనను ఉద్దేశించి ‘మీకు సిగ్గుబిళ్ల లేదా’ అనడుగుతుంది… ఇటువైపు తిరిగి ఇంద్రజకు ‘ఫుల్లీ శాటిస్‌ఫైడా’ అనడుగుతుంది… ఈ తాడులో ఆట…
నవ్వీ నవ్వీ… దాన్ని ఎంజాయ్ చేస్తూనే… ఊపినవాళ్లు ఊగినవాళ్లు ఇద్దరూ బాగానే ఆడారు అని కామెంటింది అమ్మగారు… (17 నవంబరు నాటి షో)
https://www.facebook.com/reel/575492578220423
హఠాత్తుగా చోటుచేసుకున్నదేమీ కాదు ఇదంతా… స్క్రిప్టెడ్… లేకపోతే దీన్ని యథాతథంగా ఎందుకు ప్రసారం చేస్తారు…? ఏమో… స్పాంటేనియస్‌గా ఫన్ జనరేటైంది కదానుకుని అలాగే ఉంచేశారేమో… టీవీల్లో ఈటీవీ రియాలిటీ షోలకు పెద్ద ఆదరణ లేదు, రేటింగ్స్ లేవు… ఇదుగో ఇందుకే…
యూట్యూబ్‌లో ఇలాంటి రియాలిటీ షోల వీడియోలు పెట్టేసి ఈటీవీ ఆ ఆదాయం మీద ఆధారపడటం చిత్రమే … అటు టీవీ, ఇటు ఈటీవీ విన్, మరోవైపు యూట్యూబ్… భలే స్ట్రాటజీ… కానీ కంటెంటు మరీ ఈ స్థాయిలో ఉండటం అవసరమా..?
అబ్బే, ఇందులో పెద్ద అశ్లీలం ఏముంది..? అసభ్యం ఏముంది..? సరదాగా నవ్వుకునేలా ఉందిగా అంటారేమో కొందరు… అవును, ఈ రేంజ్ కామెడీకి ఎదిగిపోయాం మనం..!!
Share this Article