Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వల్గర్… చివరకు ఆహా అనే రేంజు నుంచి ఇంకెక్కడికో పయనం…

December 13, 2024 by M S R

.

నీతులు చెప్పి డ్యాష్ నాకకు… చిన్న నోటికి పెద్ద డ్యాష్… కలాం ఏమన్నారు..? కలలు కనమన్నారు, కథలు పడమన్లేదు…

ఏదో వెగటు వాసన అనిపిస్తోందా..? కరెక్టే… ఆహా అనబడే ఓ తెలుగు ఓటీటీ బాపతు ఓ యూట్యూబ్ షార్ట్స్‌లో  కనిపించిన, వినిపించిన ప్రశ్నలు… కాకమ్మ కథలు అనే షో…

Ads

దానికి మదివాడ తేజస్విని అనే ఐస్‌క్రీమ్ ఫేమ్ పుణ్యస్త్రీ హోస్ట్… తాజా ఎపిసోడ్‌కు ఆర్జే చైతూ, ది హెడ్ వాయిస్ యాంకర్ శ్రీముఖి గెస్టులు… అలాంటివి ప్రశ్నలు… వాటికి గెస్టులు పరవశించిపోయి, విరగబడి నవ్వుతున్నారు… (ఇక్కడ పుణ్యస్త్రీ అనే పదం బిగ్‌బాస్ విష్ణుప్రియ భాషగా అర్థం చేసుకోగలరు…)

పెద్దలకు మాత్రమే, ఆసక్తి ఉన్నవాళ్లు దీన్ని గమనించండి ఓసారి… జుగుప్స, వెగటు వాసన గట్రా కలిగితే నన్ను క్షమించండి… 

ప్రోమో షార్టే అలా ఉందంటే… ఇక మిగిలిన భాగం..? మిగతా ఎపిసోడ్లు..? ఓటీటీ అంటే ఎలాంటి సెన్సారింగు దిక్కులేని కంటెంట్ కాబట్టి… ఇలాంటి కంటెంటు కూడా నింపొచ్చా అనేది పెద్ద ప్రశ్నే… ఎహె, ఊరుకోసారూ, హిందీ ఓటీటీ కంటెంట్ మరీ బోల్డున్నర బాపతు కదా అంటారా..? అదీ నిజమే…

బూతులు, ద్వంద్వార్థాలు, వెకిలితనాన్ని నట్టింటిదాకా తీసుకొచ్చింది ఈటీవీ జబర్దస్త్… చాలా చీప్ టేస్టు… ఈరోజుకూ అదే ధోరణి… ఒకప్పుడు టాప్, ఇప్పుడు దేకేవాడు లేడు, పూర్ రేటింగ్స్… మొదట్లో శ్రీదేవి డ్రామా కంపెనీని కాస్త పద్ధతిగా నడిపించారు… ఇప్పుడది జబర్దస్త్‌ను దాటిపోయింది… చివరకు అప్పుడప్పుడూ అంతటి సుమ అడ్డా కూడా దారితప్పుతోంది… (రీసెంటుగా చెప్పుకున్నాం కూడా…)

రీసెంటుగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోయే కావచ్చు… ఆటో రాంప్రసాద్ స్కిట్లు, మాటలు మరీ చిల్లరగా అనిపించాయి… (ఇదీ రీసెంటుగా చెప్పుకున్నాం, అటుఇటూ ఆడుతూ…) ప్రత్యేకించి పొట్టి నరేష్ మీద వ్యాఖ్యానాలు మరీ పూర్ టేస్టులో రాయబడుతున్నాయి…

ఆహా కాకమ్మ కథల గురించి ఇంకా చెప్పనక్కర్లేదు గానీ… ఆమధ్య దావత్ అని ఓ టాక్ షో… రీతూ చౌదరి ఇంటర్వ్యూలు… పేరుకు సరదా, మొత్తం సరసమే… డబుల్ మీనింగులు… నవదీప్‌తో చేసిన ఎపిసోడ్ అయితే మరీ… ఇప్పుడు అరియానా హోస్ట్ చేస్తున్నట్టుంది ఆ షో…

నవదీప్ అంటే గుర్తొచ్చింది… డగ్ అవుట్ అని ఆహాలోనే ఓ షో చేశాడు… అందులోనూ ఇలాంటివే… కాకపోతే అవి అర్థం కావడానికి మినిమం డిగ్రీ అయినా చేసి ఉండాలి కాబట్టి, వోకే అనుకోవచ్చు… ఇదే తేజస్వి కూడా ఓ ఎపిసోడ్‌కు గెస్టు ఫాఫం అందులో…

న బూతో న భవిష్యతి అనే స్థాయికి ఆహా కూడా వచ్చింది పాపం… నిజానికి కామెడీ స్టాక్ ఎక్స్‌చేంజ్ బాగుండేది… అది జబర్దస్త్ బాపతు బూతు కామెడీ కాదు… ఇండియన్ ఐడల్ తెలుగు హిట్… అన్‌స్టాపబుల్ షో గురించి చెప్పక్కర్లేదు, బాలయ్య టాక్ షో అదుర్స్…

ప్రదీప్, సుడిగాలి సుధీర్ నిర్వహించిన సర్కార్ కూడా హిట్… ఇలా కొన్ని ‘ఆరోగ్యకరమైన’ షోలు చేసి, చేస్తూ… ఈ కాకమ్మకథలు అనే అడల్ట్, సారీ, అడల్ట్‌రేటెడ్ షోలు ఎందుకు మ(ఆ)హా(ఆ)శయ్యా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అత్యంత అసాధారణ కరెంటు బిల్లు… నమ్మడమే కష్టం సుమీ….
  • సొంత ‘బతుకమ్మ’ పేర్చుకుని… తన ఆట తాను ఆడుకోవడమేనా..?
  • ఫక్తు అక్కినేని మార్క్ వన్ ప్లస్ టూ రొటీన్ సినిమా ప్రేమ కథ..!!
  • ఆ సిరివెన్నెల పాటలు… రాసిన అర్థాలు వేరు- వాడుకున్న తీరు వేరు…
  • శరణార్థుల ఆశాసూచిక – భారత రాజ్యాంగంలోని కుబేరుని కళాచిత్రం…
  • కశ్మీర్‌లో యూఎన్ ధర్మసత్రం షట్‌డౌన్… శెభాష్ జైశంకర్… ఇదీ టెంపర్‌మెంట్..!!
  • నరాల్ని సుతారంగా గిచ్చే పాటగత్తె… సరిజోడుగా ఆయన అల్లరల్లరి….
  • అసలే సుగర్… మామిడి పండు చూస్తే టెంప్టింగ్… మరెలా..?!
  • జాతికే పిత..! కానీ ‘మంచి పిత’ కాదు…! మిరుమిట్ల వెనుక చీకటి చారికలు..!!
  • ఈ తప్పుడు కలెక్షన్ల ప్రకటనలతో ఇప్పుడు ఒరిగేదేమిటి సూర్యా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions