కావాలనే ఆటో రాంప్రసాద్ అలా స్క్రిప్ట్ రాశాడో లేక రష్మి స్పాంటేనియస్‌గా వేరే ఉద్దేశం లేకుండా అలా అనేసిందో గానీ… అది వల్గర్‌గా ధ్వనించింది… మరి అలాంటప్పుడు దాన్ని తీసేయాలి కదా… దాన్నే ప్రోమోలో పెట్టేసి… ఇంద్రజ పకపకా నవ్వినట్టు, నూకరాజు షాక్ తిన్నట్టు చూపించడం దేనికి..? కావాలని అశ్లీలాన్ని ఎంటర్‌టెయిన్ చేయడం కాదా..? పైగా బోనాల పండుగ స్పెషల్ ఎపిసోడ్‌లో…
విషయం ఏమిటంటే..? ఈటీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షో వస్తుంది తెలుసు కదా… మొదట్లో కాస్త బాగానే ఉండేది… తరువాత తరువాత దాన్ని కూడా జబర్దస్త్ తరహా బూతు షోగా మార్చేస్తున్నారు వేగంగా… ఈసారి బోనాల పండుగ స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు… అందులో ఓ ఫన్నీ గేమ్… బాల్స్‌తో ఆట… ఒక దశలో నరేష్ బుట్టలోని బంతుల్ని నూకరాజు పట్టుకుంటే, వెంటనే రష్మి ‘వాడి బాల్స్ నువ్వు పట్టుకోవడం ఏమిటి’ అనడుగుతుంది…
నూకరాజు షాక్… ఇలాంటివి వచ్చినప్పుడు సాధారణంగా ఇంద్రజ నేలకేసి చూపులు వాల్చేసి ఇబ్బంది పడుతుంది… కానీ ఇక్కడ పకపకా నవ్వింది… ఆమెకేం అర్థమైందో… మరి రాంగ్ మీనింగ్స్ ధ్వనించినప్పుడు ఆ షో టీం వాటిని తీసేయాలి కదా, సంతోషంగా ప్రోమోలో పెట్టేసి పండుగ చేసుకుంది టీం… సరే, ఆ షోలో ఇవేమీ కొత్త కాదు, కానీ పొట్టి నరేష్ పట్ల ఇలాంటి వెగటు, వెకిలి మాటలు బాగా పెరిగిపోతున్నాయి…
Ads
బాడీ షేమింగ్ ఈటీవీ రియాలిటీ షోలలో కొత్తేమీ కాదు… విష్ణుప్రియ ముక్కు, ఇమాన్యుయేల్ సీటు, రోహిణి స్థూలకాయం మాత్రమే కాదు… చివరకు పంచ్ ప్రసాద్ కిడ్నీల ఫెయిల్యూర్‌ను కూడా జోకులకు వాడేసుకున్నారు… మరీ పొట్టి నరేష్‌కు మ్యాటర్ లేదనీ, అదే లేదనీ అన్నట్టుగా బోలెడు షేమింగ్ వ్యాఖ్యలు… (దీన్ని ఏం షేమింగ్ అనాలో…) వెగటు వాసన వేస్తున్నా సరే, పదే పదే అవే జోకులు…
(వర్ష మగాడిలా కనిపిస్తుంది అనేట్టుగా బోలెడు కుళ్ళు జోకులు… మరీ ఒక రీసెంట్ స్కిట్ లో ఇమాన్యూయల్ “మగాళ్లందరూ అయిపోయారా… ఇప్పుడు వాటితోనా ఆ పని..?” (ఆత్మలతో) అంటూ వర్షపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు…)
భరించకతప్పదు కాబట్టి, భరిస్తున్నాను కాబట్టే అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు అనుకుంటున్నట్టున్నాడు నరేష్… భరిస్తున్నాడు… మొన్న ఏదో స్కిట్‌లో ఒకామె ఆటో రాంప్రసాద్‌ను నాకు సన్న పిన్ను చార్జర్ కావాలండీ అనడుగుతుంది, రాంప్రసాద్ సాలోచనగా పొట్టి నరేష్ వైపు చూస్తాడు అదోలా… అర్థమైంది కదా… సేమ్, ఓసారి దొండకాయలతో, మరోసారి తోక పటాకులతో పోల్చుతూ ఇలాగే…
బోలెడు ఉదాహరణలు… పొట్టితనం అనేది కూడా ఓరకమైన వైకల్యం… సరే, దాన్ని కూడా ఓ అవకాశంగా మల్చుకుని, మంచి టైమింగు కామెడీతో రాణిస్తున్నాడు నరేష్, అది వేరే సంగతి… కానీ ఒకరి వైకల్యాన్ని, బాడీ అవకరాలను జోకులుగా మలిచి నవ్వడం ఓరకమైన శాడిజం, కాదు, వెకిలితనం, చిల్లరతనం… అశ్లీలం ధ్వనిస్తేనే జోకులు అనే థర్డ్ రేట్ భ్రమల నుంచి ఈటీవీ క్రియేటివ్ టీమ్ ఎప్పుడు బయటపడుతుందో…!! ప్రత్యేకించి షోకు ‘కంపెనీ’ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన ఇక ఆవైపుకే తీసుకెళ్లాలా దాన్ని..?!
Share this Article