Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సెలబ్రిటీ పెళ్లిళ్లు అంటే… మన హైదరాబాదీ ఫోటోగ్రాఫరే మస్ట్…

June 18, 2024 by M S R

అంబానీ, అదానీ.. ఎవరింట్లో పెళ్లైనా.. ఫోటోగ్రాఫర్ మాత్రం మన హైదరాబాదీనే!

ఆ ఫోటోగ్రాఫర్ ఖర్చు ఒక్కరోజుకు లక్షా 25 వేల నుంచి 1 లక్షా 50 వేల మధ్యనుంటుంది. ఐతే, ఆ ఫోటోగ్రాఫర్ మన తెలుగోడు. హైదరాబాద్ వాసి. మరెందుకతనికి అంత డిమాండ్…? ఎవరా ఫోటోగ్రాఫర్…?

ఆయా రంగాల్లో వారి ప్రతిభను కనబరుస్తూ… ఇవాళ సోషల్ మీడియాలోనూ సెలబ్రిటీలుగా మారిపోయిన ఎందరివో అందమైన ఫోటోల వెనుక ఉన్న వ్యక్తి పేరు జోసెఫ్ రాధిక్.

Ads

ఇప్పుడెందుకితగాడి ప్రస్తావన అంటే… రిటర్న్ గిఫ్టులవంటివాటిని కూడా సిల్వర్ ఫిలిగ్రీకి కేరాఫ్ అయిన కరీంనగర్ నుంచి ఆర్డర్స్ ఇచ్చి తెప్పిస్తున్న ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి ఫోటోలన్నీ తీస్తోంది కూడా మన తెలుగువాడైన జోసెఫే కనుక!

అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ఫస్ట్ ప్రీ వెడ్డింగ్.. రెండో ప్రీవెడ్డింగ్.. ఇలా పెళ్లి కంటే ముందే ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనాయి. ఈ క్రమంలో ఆ క్రూయిజ్ లో బిగ్ బాష్ ఫోటోస్ వెనుకున్నది మన జోసెఫ్ రాధిక్.

photo

కత్రినా కైఫ్- విక్కీ కౌశల్, విరాట్ కోహ్లీ-అనుష్కశర్మ, సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ, కేఎల్ రాహూల్-అతియాశెట్టి, నాగచైతన్య-సమంతా రుతుప్రభు, ప్రియాంకా చోప్రా-నిక్ జోనాస్, వరుణ్ ధావన్- నటాషా దళాల్, అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ఇలా ఇప్పుడు దేశంలో ఏ రంగానికి చెందిన ప్రముఖ సెలబ్రిటీల ఫోటోస్ అయినా… వాళ్ల ఆర్డర్సన్నీ వెళ్లేవి జోసెఫ్ రాధిక్ కే.

యూరప్ లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ జంట ప్రీవెడ్డింగ్ షూట్ లో జోసెఫ్ రాధిక్ తీసిన చిత్రాలు సెలబ్రిటీలనే కాదు… ఆ పిక్చర్స్ వైరల్ గా మారి ఇప్పుడు సామాన్యులను చూపు తిప్పుకోనివ్వడం లేదు. విలాసవంతమైన క్రూయిజ్ షిప్ లో ఆ జంట మధ్య నెలకొనే ప్రతీ భావోద్వేగాన్ని తన కెమెరాలోని మూడో కన్నుతో క్యాప్చర్ చేసిన తీరుతో… ఇంతకాలం సెలబ్రిటీస్ ప్రత్యేక ఫోటోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్న జోసెఫ్ పేరు ఇప్పుడు మరింత మారుమ్రోగిపోతోంది.

joseph

జోసెఫ్ రాధిక్ జర్నీలో విచిత్రమైన మలుపులు!

జోసెఫ్ రాధిక్ మన హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 2001 నుంచి 2005 మధ్య ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఆతర్వాత మధ్యప్రదేశ్ ఇండోర్ లోని ఐఐఎం నుంచి పీజీడిప్లమా ఇన్ మేనేజ్ మెంట్ లో భాగంగా మేనేజ్ మెంట్, మార్కెటింగ్, స్ట్రాటజీ, సప్లై చైన్ కోర్స్ పూర్తి చేశాడు. ఆ తర్వాత 3 ఏళ్ల పాటు కార్పోరేట్ సంస్థల్లో పనిచేశాడు. తన ఉద్యోగంలో భాగంగా టూత్ పేస్టులు అమ్మడానికి కూడా గ్రామీణ భారతంలో తిరిగాడు. కానీ, అంత చదువు చదివినా.. జోసెఫ్ కు ఎందుకో తృప్తినివ్వలేదు. ఎక్కడో అంతర్లీనంగా తనలో ఉన్న కళ బయటకు అప్పుడప్పుడూ తొంగిచూసింది. దాంతో జోసెఫ్ 2010లో ఏకంగా తన ఉద్యోగానికి బైబై చెప్పేశాడు. అప్పటికే ఫోటోగ్రఫీపై మక్కువ ఎక్కువ ఉన్న జోసెఫ్.. ఇక పూర్తి స్థాయి వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ గా రంగంలోకి దిగాడు.

ఇప్పటికే దేశంలోని సెలబ్రిటీల ఫోటోలకు కేరాఫ్ అయినపోయిన జోసెఫ్ రాధిక్.. అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఫోటోలను షూట్ చేసిన తీరు మనోడి గిరాకీని మరింత పెంచేలా మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఆకాశమే దిగివచ్చి పందిరి వేసినంత ఘనంగా.. జూలై 12న ముంబై వేదికగా జరుగబోయే వివాహ వేడుకల్లోనూ.. మన 41 ఏళ్ల ఈ హైదరాబాదీ ఫోటోగ్రాఫరే… నార్త్ సైడ్ తోపులను తోసిరాజని ఫోటోగ్రాఫర్ గా ఓ కొత్త దృశ్యకావ్యాన్ని తీయబోతున్నాడు.

joseph

ఇండియన్ వెడ్డింగ్ ప్లానర్ దేవికా నరైన్ ను 2013లో బాలిలో కలిసినప్పుడు మొదలైన పరిచయం.. ఆ తర్వాత క్రమక్రమంగా ప్రేమగా మారి కళ్యాణం వరకూ అడుగులు వేయించింది. 2015లో ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీ అవార్డ్ ను అందుకున్న జోసెఫ్ రాధిక్.. 2021లో సోనీ ఆర్టిసన్ ఇమేజరీ, ఇండియా అవార్డునూ అందుకున్నాడు. జీక్యూ 50 మంది మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ యంగ్ ఇండియన్స్ జాబితాలోనూ జోసెఫ్ రాధిక్ పేరు సంపాదించాడు. కుటుంబ సభ్యులంతా ప్రేమగా జో అని పిల్చుుకునే మన హైదరాబాదీ జోసెఫ్ రాధిక్… ఇప్పుడు ఇండియా మెచ్చిన బెస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్.

ఇదే మరి విధి అంటే! చదివిన చదువు.. చేసే వృత్తి.. రెండూ పూర్తిగా విభిన్నమైనవి. చదువు తనకు జ్ఞానం ఇచ్చింది. ఆసక్తి తన దారి మార్చి, ఉన్నత శిఖరాలకు చేర్చింది. అదే కార్పోరేట్ ఉద్యోగంలో జోసెఫ్ రాధిక్ కు ఈ స్థాయి పేరు వచ్చేదో, రాదో తెలియదుగానీ.. మొనాటనీని బ్రేక్ చేసి తన జీవితంపై తానే చేసిన ప్రయోగం సఫలీకృతమై.. ఇప్పుడు దేశం మెచ్చిన ప్రొఫెషనల్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ గా జోసెఫ్ ను నిలబెట్టింది….. By రమణ కొంటికర్ల

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…
  • షెఫాలి – స్వేచ్ఛ … ఇద్దరి జీవితాలు… ఒకటే జీవితపాఠం… 
  • అసలెవరీ “సుండలోడు”….” సుండలాయన”….” సుండల్‌క్కారన్”….?
  • ‘రా’ కొత్త చీఫ్‌గా ఆపరేషన్ సిందూర్ మాస్టర్ మైండ్..!!
  • చిరంజీవే హీరో అయినాసరే… మాధవి పాత్రదే అల్టిమేట్ డామినేషన్…
  • ప్రధానిపై క్షుద్ర పూజల ప్రయోగం… విరుగుడుగా ప్రత్యేక పూజలు…
  • బీఆర్ఎస్ పంథాలో ఏమిటీ మార్పు… KCR ఉద్యమ ధోరణికి వ్యతిరేకం…
  • అక్షయ్, శరత్‌కుమార్, మోహన్‌లాల్ ఫెయిల్… విష్ణు, ప్రభాస్ పాస్…
  • సంపూర్ణంగా ఈ కామాఖ్య ఆదిశక్తిపీఠం తరహాయే వేరు… Part-2 …

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions