Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వైర ముత్తు మరియు ఓ షాంపూ బాటిల్ కానుక కథ… మగానుభావుడు..!!

September 23, 2024 by M S R

గీతరచయిత వైరముత్తు – ఓ షాంపూ బాటిల్ కానుక (గాయని సుచిత్ర ఇటీవల ఓ తమిళ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు..)

గీతరచయిత వైరముత్తు గురించి సింగర్ చిన్మయి ఆరోపణలు చేస్తే అందరూ ఆమెనే తప్పుబట్టారు. ఆమే ఏదో తప్పు చేసిందన్నట్లు ఆమెను దూరం పెట్టారు. ఇప్పటికీ ఇంకా ఆమెనే మాటలంటున్నారు. కానీ వైరముత్తు అందరు లేడీ సింగర్స్‌తో అలాగే ప్రవర్తిస్తారు. అది ఇండస్ట్రీలో ఉండే అందరికీ తెలుసు. కానీ ఎవరూ బయటకు చెప్పరు. వైరముత్తు లేడీ సింగర్స్‌కి ఫోన్ చేసి ‘అమ్మా.. మీ గొంతులో గొప్ప భావం ఉంది. మీ గొంతుతో నేను ప్రేమలో పడ్డాను. నా మనసులో ఏదో కొత్త భావన ఏర్పడింది’ అని మాట్లాడతారు. ఆయన నుంచి అలాంటి ఫోన్ కాల్ రాని లేడీ సింగర్ లేనే లేరని నా నమ్మకం.

నాకూ వైరముత్తు నుంచి అలాంటి కాల్ వచ్చింది. నేను పాడిన ఒక పాట విని ఆయన ఫోన్ ‘అద్భుతంగా పాడావ్.. నీ గొంతు విని నాలో ప్రేమ పొంగింది’ అన్నారు. అతి సాధారణమైన ఆ పాట విని ఎందుకు ప్రేమ పుడుతుందో నాకు అర్థం కాలేదు. ఏదో తేడా కొట్టింది. ‘నీకు ఒక కానుక ఇవ్వాలని ఉంది. మా ఇంటికి రా’ అని ఆయన చెప్పారు. నేను మా అమ్మమ్మను తీసుకుని వెళ్లాను. నాతోపాటు మా అమ్మమ్మ రావడం చూసి ఆయన షాక్ అయ్యారు.

Ads

‘అదేంటీ.. నువ్వు మాత్రమే వస్తావని అనుకున్నానే’ అని ఆయన అడిగారు. ‘నేను ఒంటరిగా ఎక్కడికీ రాను. ఎవరో ఒకరు నాకు తోడుగా ఉంటారు’ అని ఆయనకు చెప్పాను. మా అమ్మమ్మ ఆయనతో చాలాసేపు అవీఇవీ మాట్లాడింది. మేం బయలుదేరేముందు ‘మా అమ్మాయికి ఏదో కానుక ఇస్తానన్నారంట కదా?’ అని అమ్మమ్మ అడిగింది. నిజానికి ఆయన నాతో తప్పుగా ప్రవర్తించడానికే పిలిచారు. కానుక ఇవ్వడానికి ఆయన రెడీగా లేరు. కానీ మా అమ్మమ్మ అలా అడిగేసరికి ఏం చేయాలో తెలీక లోపలికి వెళ్లి, షాంపూ బాటిల్ తెచ్చి ఇచ్చారు.

ఆ ఇంటి నుంచి బయటికి వచ్చాక ఆ షాంపూ బాటిల్‌ని పారేయాలా అని అనుకున్నాను. ఇక్కడ వద్దు అని మా అమ్మమ్మ దాన్ని ఇంటిదాకా తీసుకొచ్చింది. మా ఇంట్లో షోకేసులో చాలాకాలంపాటు ఆ షాంపూ బాటిల్ ఉంది. ఎవరైనా వచ్చి ‘ఇదేంటిక్కడ?’ అని అడిగితే వైరముత్తుతో నాకు జరిగిన అనుభవం గురించి చెప్పేదాన్ని. వారు పడీ పడీ నవ్వుకునేవారు. ఆ తర్వాత కూడా వైరముత్తు నుంచి కాల్స్ వచ్చాయి. కానీ నేను అటెండ్ చేయలేదు. కొన్నాళ్లకు నాతో వర్కవుట్ కాదని ఆయన వదిలేశారు……. (సాయి వంశీ… విశీ)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేటీయార్ స్టార్ హోటళ్లు ! రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ అక్షరసత్యాలే !!
  • తమన్నా VVAAN – మౌత్‌టాక్ కోసం బొట్లు, ప్రసాదాల ప్రమోషన్ !!
  • చాపచుట్టేసిన శ్రీలంక- మూడు రనౌట్లు – ఆరు డకౌట్లు..!!
  • సిరిసిల్లలో నిలబడి, నిలదీసి… ఈ ‘అనుముల రుద్రారెడ్డి’ అసాధ్యుడే!
  • పిచ్‌తో ఆడకండి… ఆటలోని అసలు మజాయే మాయం!
  • టాకీస్ నుంచి బయటపడ్డాక కనిపించినదే అసలు ‘ప్యారడైజ్’ !!
  • ఇది భూతల స్వర్గమేమీ కాదు! పేదరికం- కాయకష్టం- కన్నీళ్లు అన్నీ !!
  • సుఖాంతమే… కానీ అసలు కథ మాత్రం ఇప్పుడే మొదలైంది…!!
  • What a Memorable Match… ఇండియా రికార్డు చేజింగ్ విక్టరీ !!
  • ‘కంచ’ దాటిన పైత్యం ! చివరకు సీఎం మనవడి పేరుపైనా వక్రబాష్యాలు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions