నిజంగానే గత సీజన్‌లాగే ఈ సీజన్ బిగ్‌బాస్ కూడా పరమ పేలవంగా సాగుతోంది… దాని సవాలక్ష కారణాలుండచ్చుగాక, కానీ ఈరోజు మాత్రం ఒకటి నచ్చింది… అది సింగర్ భోలే షావలికి లేడీ కంటెస్టెంట్లు శోభాశెట్టి, ప్రియాంకలు ఇచ్చి పడేసిన తీరు… చాలామంది శోభాశెట్టిని, ప్రియాంకను విమర్శిస్తూ ఏదేదో రాసిపడేస్తున్నారు గానీ… వాళ్లు రియాక్టయిన తీరు కరెక్టు, అవసరం కూడా…
నామినేషన్ల సందర్భంలో ఎవరో ఎవరినో నామినేట్ చేస్తారు, కొన్ని హీట్ సంభాషణలు దొర్లుతాయి, కామన్, బిగ్‌బాస్‌కు కావల్సింది కూడా అదే కదా… చాట్ల తవుడు పోసి కుక్కల కొట్లాట పెడితేనే కదా నామినేషన్ ఎపిసోడ్స్ రక్తికట్టేవి… కానీ ఇది డిఫరెంట్… భోలేకు అసలు బిగ్‌బాస్ ఆట ఆడటమే తెలియదు, అందరితో మంచిగా ఉంటే సరి అనుకుంటే కుదరదు…
పోనీ, ‘మంచిగా’ ఉండటం చేతనవుతోందా..? అదీ లేదు… ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకుని, ఫుల్లుగా ఎక్కాక ఆడవాళ్లను ఉద్దేశించి ఫ్లోలో ఏదో వల్గర్ మాటలు మాట్లాడతారు కదా కొందరు… అలా మాట్లాడాడు… ముందుగా శోభను ఉద్దేశించి ఏదో పిచ్చి కూత వదిలాడు… శోభ ఏదో సమాధానం చెబుతుంటే ఇంకాస్త ఎగతాళిని రంగరించి ఇంకేదో మాట్లాడాడు… దీంతో తనకు సంబంధం లేకపోయినా సరే, ప్రియాంక ఎంటరైంది… థూ అని ఛీత్కరించింది…
Ads
కంటెస్టెంటుగా కాదు, వ్యక్తిగా భోలే పట్ల ఆమె కనబరిచిన ఏవగింపు… తరువాత శోభాశెట్టి కూడా సీరియస్‌గా రియాక్టయింది… ఓ దశలో నువ్వు ఎర్రగడ్డకే అన్నాడు భోలే… తెలుగు చాలా ఫ్లూయెంటుగా మాట్లాడగలిగిన శోభకు ఆ పదం ఎందుకు వాడతారో తెలియదు, వేరేవాళ్లను అడిగి మరీ ఎడాపెడా ఇచ్చేసింది ఆమె… నిజంగా ప్రియాంక, శోభాశెట్టిలు ఒకరికొకరు తోటి మహిళలుగా పరస్పరం సపోర్టుగా నిలబడి భోలే మీద విరుచుకుపడ్డారు… ఇదేమీ స్క్రిప్టెడ్ కాదు, అప్పటికప్పుడు పెరిగింది పంచాయితీ…
చివరకు బిగ్‌బాస్ కల్పించుకుని భోలేను అలా బూతులు మాట్లాడవద్దంటూ మందలించాడు… ఐనా సరే, తను వెంటనే సెట్ రైట్ చేసుకుని సారీ చెబితే బాగుండేది… అదీ చేయలేదు… తరువాత ప్రియాంక ఇదే ప్రస్తావిస్తే అప్పుడు సారీ చెప్పాడు… ఇక్కడ కంటెస్టెంట్ల నామినేషన్లు ఏమిటనేది కాదు చూడాల్సింది… ఆడవాళ్లు కదాని ఎలాపడితే అలా మాట్లాడితే ఎలా..? అదుగో ఆ తీరు మీద ఆ ఇద్దరు లేడీ కంటెస్టెంట్లు రియాక్టయిన తీరును చెప్పుకోవాలిక్కడ…
ఐనా సరే, భోలే మళ్లీ అదే తీరు… కేవలం ఈ పంచాయితీ, ఈ వివాదంలోకి ప్రియాంక ఎంటరైందనే కోపంతో ఆమెను నామినేట్ చేశాడు… ఇదంతా జరుగుతూ ఉంటే వేరే లేడీ కంటెస్టెంట్లు గానీ, మేల్ కంటెస్టెంట్లు గానీ కిక్కుమనలేదు… ఎంటర్ కాలేదు… ఎవరూ సర్దిచెప్పే ప్రయత్నం కూడా చేయలేదు… చివరకు అన్నింట్లో వేలు పెట్టే శివాాజీ కూడా సైలెంటు… భోలే మాటతీరు ఎవరికీ నచ్చలేదు… నవ్వొచ్చింది ఏమిటంటే… వచ్చే వారం నేను వెళ్లిపోయినా సరే, నా విలువలకు నేను కట్టుబడి ఉంటాను, అదే ప్రూవ్ చేసుకుని పోతా అని భోలే ముక్తాయించడం… (ఏడుగురు తనను నామినేట్ చేశారు… ఎక్కువ సంఖ్యే…) అనేవి అంటూనే, మళ్లీ ఏమైనా అందామంటే మీరు ఆడవాళ్లయిపోయారు అన్నట్టు మాట్లాడాడు…
గత వారం శోభాశెట్టి దాదాపు ఎలిమినేషన్ అంచుల దాకా వచ్చింది… ఆమె మీద ఎందుకంత నెగెటివిటీ ప్రేక్షకుల్లో ఏర్పడిందో తెలియదు కానీ, ఆమెను సేవ్ చేయడానికి బిగ్‌బాస్ కొత్తగా వచ్చిన నయనిని ఎలిమినేట్ చేశాడు… అదీ దుర్మార్గమే… (కొన్ని వెబ్‌సైట్లు ఎందుకోగానీ శోభ మీద మరీ కసికసిగా రాసేస్తున్నాయి… ఎవరో ఆమెను చివరకు కన్నడ కంత్రీ అని కూడా రాశాడు…) కానీ శోభాశెట్టి, ప్రియాంక ఆటల్లో, టాస్కుల్లో చురుకుగా ఉంటారు, అదేసమయంలో ఎవరేమైనా అంటే ఊరుకోరు… సరే, ఎవరి స్ట్రాటజీ వారికి ఉన్నా సరే, అలాంటివాళ్లు ఆటలో ఉంటేనే కదా, అది బిగ్‌బాస్ మార్క్ ఆట… (ప్రియాంక, శోభాశెట్టిలు ఈవారం నామినేషన్లలో లేరు…)
Share this Article