అది 2011 World Championships / 100 మీటర్స్ race
అథ్లెట్స్ అందరూ starting position లో ఉన్నారు. Gun ని fire చేయకముందే Usain Bolt కొంచెం ముందుకు కదిలాడు. అతను line ని cross చేయలేదు, కానీ body movement ఉంది. అంటే sitting start తీసేసుకున్నాడు.
Disqualify చేసేసారు….
Ads
రెండేళ్లకు ఒకసారి వచ్చే championship, రెండేళ్లు కష్టపడ్డాడు దీనికోసం, 8 ఒలింపిక్స్ gold లు గెలిచిన అథ్లెట్ కదా…
Race ని బోల్ట్ తో మళ్ళీ మొదలుపెడితే ఏమయ్యింది, ఏంటి నష్టం? అని మనకి అనిపిస్తుంది….
———-
Paris Olympics 2024 / 100 మీటర్స్ race / మొన్న జరిగినదే
జమైకా కి చెందిన Kishane Thompson, ఫినిషింగ్ లైన్ ని మొదటగా దాటినట్టు, America కి చెందిన Noah Lyles తరువాత దాటినట్టు మనకి కనిపిస్తుంది.
Kishane కాలు line ని first దాటింది. కానీ అతని torso / chest ఇంకా లైన్ కి లోపలే ఉంది.
Lyles torso, line ని first దాటింది. కానీ అతని కాలు ఇంకా line లోపలే ఉంది. & Lyles torso కంటే ముందే Kishane leg లైన్ ని దాటింది.
ఇందులో Lyles కె మొదటి స్థానం ఇచ్చారు.
ఇద్దరి మధ్య తేడా కేవలం .005 seconds మాత్రమే….
మనకి ఎం అనిపిస్తుంది అంటే line ని first కాలు తో దాటింది Kishane కాబట్టి అతనికి first ఇవ్వాలి, ఇదేం రూల్ అని….
ఇద్దరి మధ్య తేడా కేవలం .005 seconds కాబట్టి ఇద్దరికీ gold ఇవ్వొచ్చు కదా అని…
————
2012 London Olympics / Wrestling / 60 kg category
సౌత్ కొరియన్ wrestler Choi Yong-suk, కేవలం 100 grams ఎక్కువున్నాడు అని same ఇప్పుడు మనకి జరిగినట్టే disqualify చేసేసారు.
100 grams ఎందుకు సమస్య అయ్యింది అని మనకి అనిపిస్తుంది…
———-
1984 Los Angeles Olympics – Weightlifting
multiple competitors ని weight limit కంటే కొంచెం ఎక్కువున్నారు అని disqualify చేసేసారు.
—–
ఈ examples అన్నీ చెప్పింది, Olympics / World Championships లో, 0.005 సెకండ్స్ / 100 గ్రామ్స్ / false start లని ఎంత serious గా తీసుకుంటారో, వాటి rules ఎంత strict గా ఉంటాయో చెప్పడానికి….
కొన్ని రూల్స్ rigid గా ఉండొచ్చు, ఇంకొన్ని revise చేయాల్సినవి ఉండొచ్చు….కానీ పెట్టుకున్న rules ని మాత్రం చాలా strict గా implement చేస్తారు..
ఈ పోటీలల్లో ‘fair & equal competition’ కి అత్యంత importance ఇస్తారు. అది bolt / phelps అయినా మనకి పేరే తెలియని ఒక కొత్త athlete అయినా…..తేడా చూపించరు…..ఎన్ని సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నారో వాళ్ళకి సంభందం లేదు.
ఏదయినా wrestling federation లేదా national tournaments లో, weight limit ఎక్కువుంటే tolerate చేస్తారేమో కానీ, International championships లో అస్సలు చేయరు…
పది గ్రాములు ఎక్కువున్నా disqualify చేస్తారు.
ఎందుకంటే….
—–
1. ఏ rule అయినా అందరికీ వర్తిస్తుంది. అందరికీ ఈ rule ఆల్రెడీ తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకునే అందరూ prepare అవుతారు.
2. 50 kg weight క్లాస్ అంటే కొంచెం అటూ – ఇటూ ఉన్నా పర్లేదు కదా అని మనం అనుకుంటాం.
కానీ “50 kg అనేది Maximum weight”
50 నే Final.
competitors 1 kg / 1 & half kg, 500 grams, 750 grams ఎంత అయినా తక్కువ ఉండొచ్చు….అది సమస్యే కాదు. అది వాళ్ళ ఇష్టం. 50 వరకు అయితే ఇచ్చారు.
కానీ 50 కి ఒక్క గ్రాము ఎక్కువున్నా సమస్యనే…
ఒక్క గ్రామే కదా / పది గ్రాములే కదా అని అక్కడ పట్టించుకోరు.
——
మనం exams రాస్తాం…. 10 am కి exam start అవుతది అంటే 10 కి అక్కడ ఉండాలి అని….10 కి ఎంత ముందు వచ్చి అక్కడ నిలబడినా అది మన ఇష్టం.
అంతే కానీ, 10 అన్నాం కాబట్టి, 10.05 అయినా పర్లేదు, 10.10 కి అయినా రండి అని ఏ instructions లో రాయరు.
ఆ system కి ఒక order ఇంకా structure ఉంటుంది. దాన్ని వాళ్ళు maintain చేయాలి.
ఇంత టైం late అయితే allow చేస్తాం అని ఎక్కడ గీస్తారు గీత?
అది ఎక్కడ ఆగుతుంది అంటే, exam పాస్ అవ్వడానికి 35 marks చాలు కదా, so రెండు గంటలు లేట్ వచ్చినా రాయడానికి allow చేయొచ్చు అనే దగ్గర…
1 min late అయినా allow చేయని సందర్భాలు చూసే ఉంటారు.
అయినా కూడా కొన్ని సార్లు empathy చూపించి allow చేస్తారు. late అయిన reason ని చూసో, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించో….
ఇక్కడ student ఇంకో student తో direct competition లో ఉండడు, అంటే ఒక్కో విద్యార్థి performance ని independent గా assess చేస్తారు & pass అయితే బయట ఒక్కొక్కరు ఒక్కో opportunity కోసం వెతుక్కుంటూ వెళ్తారు.
3. కానీ Olympics అలా కాదు…
ప్రతీ athlete ఇంకో athlete తో direct competion లో ఉంటాడు.
ఒక athlete విజయమే ఇంకో అథ్లెట్ ఓటమి.
ఇది zero sum game….ఏ విషయంలో అయినా, ఒకరి loss ఏ – ఇంకొకరి gain.
—
ఒకరికి 100 గ్రాములు అనుమతిని ఇస్తే ఇంకొకరు protest చేస్తారు / ప్రశ్నిస్తారు…. వారికి ఆ హక్కు ఉంది.
వాళ్ళు కూడా 50 లోపు ఉండటానికి ఎంతో కష్టపడే ఉంటారు కదా!
100 గ్రామాలు ఆట మీద ప్రభావం చూపొచ్చు / చూపకపోవొచ్చు, కానీ 50 లోపు ఉండటానికి వాళ్ళు పెట్టిన శ్రమ / sacrifice లు తక్కువా?
100 ని tolerate చేస్తే వాళ్ళు దేనికి కష్టపడినట్టు??
fair condition ని ఆశించడం వాళ్ళ హక్కు.
అందుకే competition యొక్క integrity ని preserve చేయడంలో organizations చాలా ఖచ్చితంగా ఉంటాయి. strict enforcement లు లేకపోతె అవి function అవ్వలేవు.
4. ఒక్కో athlete ఒక్కో దేశాన్ని represent చేస్తూ ఉంటారు. fairness ని ప్రపంచమంతా గమనిస్తూ ఉంటుంది. తప్పు జరిగినా / ఎక్కడైనా partiality చూపించినా ప్రశ్నించడానికి అందరూ ఉంటారు….competitor – govt …public.. ఒక్కరిని కాదు…
వాళ్లందరికీ వీళ్ళు సమాధానం చెప్పాలి.. accountability చూపాలి … అందుకే 100 గ్రాములే కదా అని వదిలేయరు…
—-
5. strict rule పెట్టకపోతే, ఉద్దేశపూర్వకంగా దాన్ని advantage కోసం వాడటం జరుగుతుంది. Competitive Integrity దెబ్బ తింటుంది.
bolt విషయమే చూసుకుంటే, strict rule ఏమి లేదు అనుకుందాం, అప్పుడు అతను కావాలనే false start ఇచ్చి ఉన్నాడు అనుకుందాం…..
దీని వాళ్ళ మిగతా వాళ్ళ focus దెబ్బ తింటుంది, వాళ్ళ strategy implement చేయలేకపోవచ్చు, anxiety పెరగొచ్చు, మొదటి race కంటే రెండవసారి వాళ్ళ టైమింగ్ compromise అవ్వొచ్చు, acceleration లో ప్రాబ్లెమ్ రావొచ్చు…..
0.001 సెకండ్ తో కూడా మెడల్ పోయే అవకాశమున్న race అది. అందుకే disqualify చేస్తారు.
—————
మనవి emotional reactions… తప్పేం లేదు…
rules – reasons బయటకి కనిపించవు…..మిగతా competitors గురించి ఆలోచించం…
ఒక అథ్లెట్ దురదృష్టం, మనం పెట్టుకున్న expectations, జాలి, వాళ్ళతో మనకున్న belonging నుంచి మాట్లాడతాం.
Sports లో ఒకరి దురదృష్టం / ఒకరి injury, ఇంకో player కి గెలుపుని ఇచ్చిన సందర్భాలు వందలు ఉంటాయి.
ఎందుకంటే ఇది zero sum గేమ్.
ఇది నేచర్………. [ By Sharath Kumar ]
Share this Article