Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

లెక్కలు సరిచేయబడుతున్నయ్.., బ్రిటన్ ఆయుధాల మీద రష్యా దాడి…!

March 8, 2025 by M S R

.

( పొట్లూరి పార్థసారథి ) ………… రష్యా బ్రిటన్ ఆయుధాల మీద దాడి చేసింది! MSC LEVENTE F అనే రవాణా నౌక మీద రష్యా దాడి చేసింది!

MSC LEVENTE F అనే రవాణా నౌక స్వీట్జర్ ల్యాండ్ దేశానిది కాగా పనామా దేశంలో రిజిస్టర్ చేయడం వలన పనామా దేశ జెండా ఉంది.

Ads

MSC LEVENTE F రవాణా నౌక టర్కీలో బ్రిటన్ ఆయుధాలని లోడ్ చేసుకోని ఉక్రెయిన్ లోని ఓడేస్సా తీరానికి చేరుకుంటున్న సమయంలో పుతిన్ ఇస్కిందర్ M మిసైళ్ళని ప్రయోగించి నౌకని ధ్వంసం చేశాడు!

అమెరికా ఆయుధాలని సప్లై చేయడం ఆపేసింది! గత బిడెన్ హయాంలో ఉక్రెయిన్ కి సైనిక సహాయం కింద ఇవ్వాలని సిద్ధం చేసిన ప్రతిపాదనలని రద్దు చేసింది!

అమెరికా ఇంటెలిజెన్స్ సమాచారం ఉక్రెయిన్ కి ఇవ్వదు ఇకమీదట! అలాగే బ్రిటన్ ఇంటెలిజెన్స్ తో అమెరికా ఇన్నాళ్ళు పంచుకుంటూ వస్తున్న సమాచారం కూడా ఇకమీదట ఉండదు!

ఇది ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ని కట్టడి చేస్తుంది అనడంలో సందేహం లేదు! ఇప్పటి వరకూ అమెరికా, బ్రిటన్ దేశాలు రష్యన్ దళాల కదలికలని శాటిలైట్ ద్వారా గుర్తించి ఉక్రెయిన్ కి ఇస్తూ రావడం వలన మూడు సంవత్సరాలు అవుతున్నా యుద్ధం ఒక కొలిక్కి రాలేదు!

వోలోదిమిర్ జెలెన్స్కీ పాత లెక్కలని సరి చేశాడా?

ఇజ్రాయేల్ తరువాత బయటిదేశంలో ఒక యూదు ( Jew ) దేశాధినేతగా ఉన్నాడు అంటే అది ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ మాత్రమే!

ఏమిటా లెక్క?

1942 జెర్మన్ సైన్యం సోవియట్ యూనియన్ మీద దాడి చేసినప్పుడు ఉక్రెయిన్ లోని కొంత భాగాన్ని ఆక్రమించిన సమయంలో స్థానికంగా ఉన్న యూదులని చంపడానికి నిర్ణయించింది జెర్మన్ సైన్యం. యూదులని లక్ష్యంగా చేసుకొని చంపడానికి స్పెషల్ ఫోర్స్ ని ప్రత్యేకంగా నియమించింది జెర్మనీ!

జెర్మన్ స్పెషల్ ఫోర్స్ కి సహాయంగా ఉక్రెనియన్లు జెర్మన్ స్పెషల్ ఫోర్స్ కి సహాయం చేశారు. దాదాపు లక్ష మంది ఉక్రెనియన్లు పరిపాలన విభాగంతో పాటు యూదులని గుర్తించి జెర్మన్ స్పెషల్ ఫోర్స్ సమాచారం ఇచ్చే పనిలో పాల్గొన్నారు!

ఉక్రెనియన్ల మీద ఎలాంటి ఒత్తిడి లేకపోయినా స్వచ్చందంగా జెర్మన్ సైన్యంతో కలిసి 16 లక్షల మంది యూదులని చంపించారు! యూదులలో మహిళలు, చిన్న పిల్లలు అనే కనికరం చూపకుండా చంపేశారు! చివరికి అడవులలో దాక్కున్న యూదులని కూడా చంపేశారు!

రెండవ ప్రపంచ యుద్ధం ముగిశాక సోవియట్ యూనియన్ ఉక్రెయిన్ లో యూదుల హత్యకి కారకులు అయిన వారి మీద ఎలాంటి కేసులూ పెట్టలేదు!

1991 లో సోవియట్ యూనియన్ విచ్చిన్నం అయి ఉక్రెయిన్ ఒక దేశంగా ఏర్పడినా 1942 నాటి యూదుల మారణకాండ మీద ఎలాంటి విచారణ జరగలేదు!

రష్యా స్పెషల్ ఆపరేషన్ వల్ల 70 లక్షల మంది ఉక్రెనియన్ పౌరులు దేశం విడిచి శరణార్థులుగా పొలాండ్, హంగరి, మాల్దోవ, జెర్మనీ దేశాలకి వెళ్లిపోయారు!

ఇక 5,00,000 మంది ఉక్రెనియన్ సైనికులు మరణించడమో లేదా తీవ్రంగా గాయపడడమో జరిగింది ఇప్పటి వరకూ!
ఉక్రెయిన్ తిరిగి కోలుకోవడానికి కనీసం అయిదేళ్ల నుండి పదేళ్లు పడుతుంది! కనీసం 500 బిలియన్ డాలర్లు అవసరం ఉంటుంది కానీ ఎవరిస్తారు?

లెక్క సరిపోయింది!

జెలెన్స్కీ ఉక్రెయిన్ ని నాటోలో చేర్చుకోమని అడగకుండా ఉండి ఉంటే పుతిన్ దాడి చేసేవాడు కాదు!

So! 1942 నాటి యూదుల హాలోకాస్ట్ కి 2022 నుండి 2025 లలో లెక్క సరిపోయింది!

ఉక్రెయిన్ అతి పెద్ద మనీ లాండర్ గా నిలిచిపోతుంది చరిత్రలో!

రష్యా దాడిని ఎదుర్కోవడానికి అంటూ అమెరికా, ఐరోపా దేశాలు ఉక్రెయిన్ కి ఇచ్చిన సహాయం తిరిగి ఆయా దేశాల రాజకీయ నేతల జేబుల్లోకి వెళ్ళిపోయింది! జెలెన్స్కీ కి తెలిసే ఇదంతా జరిగింది!

ఉక్రెయిన్ కి సహాయం పేరున వెళ్లిన ప్రతీ వంద డాలర్ల లో ఉక్రెయిన్ కి 40% గా ఉంటే మిగిలిన 60% మాత్రం అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లిపోయాయి!

ఇక్కడ ఎవరూ తక్కువ తినలేదు!

500 బిలియన్ల డాలర్లు ఇచ్చాము కాబట్టి ఉక్రెయిన్ లో ఉన్న ఖనిజ సంపదని అమెరికాకి రాసి ఇవ్వమని ట్రంప్ డిమాండ్ చేస్తున్నాడు!

కానీ వాస్తవం ఏమిటీ?

యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ మరియు సెనెట్లు ఉక్రెయిన్ కి సహాయం చేసే ఉద్దేశ్యంతో కొంత సొమ్ముని ఆయుధాల రూపంలో మరికొంత ఉక్రెయిన్ లో డబ్బు కొరత ఉండకూడదని గ్రాంట్ గా ఇవ్వడానికి ఆమోదం తెలిపాయి కానీ అప్పు కింద కాదు!

ఇచ్చింది ఎంత?

మొత్తం  174 బిలియన్ డాలర్లు! ఇందులో ఉక్రెయిన్ కి ఆయుధాలు కొనడానికి 18.3 బిలియన్ డాలర్లు (మిలిటరీ ఎయిడ్ ) మాత్రమే! అంటే 18.3 బిలియన్ డాలర్లు నేరుగా ఆయుధ కంపెనీలకి వెళ్ళిపోతుంది. ఏం ఆయుధాలు ఇవ్వాలో అమెరికన్ మిలిటరీ కాంప్లెక్స్ నిర్ణయిస్తుంది కానీ జెలెన్స్కీ కాదు!

32.6 బిలియన్లు నేరుగా ఉక్రెయిన్ కి బడ్జెట్ సపోర్ట్ గా ఇచ్చింది! 2022 ఫిబ్రవరి 23 న పుతిన్ ఉక్రెయిన్ మీద దాడి మొదలు పెట్టినప్పటి నుండి 2025 ఫిబ్రవరి వరకూ అమెరికా ఉక్రెయిన్ కి ఇచ్చింది కేవలం 50.9 బిలియన్ డాలర్లు!

మరీ మొత్తం 174 బిలియన్ డాలర్లు కదా అమెరికన్ కాంగ్రెస్ మరియు సెనెట్లు అమోదించిన బడ్జెట్? మరి మిగతా 123 బిలియన్ డాలర్లు ఏమైపోయినట్లు?
123 బిలియన్ డాలర్లు యూరోపియన్ దేశాలకి గ్రాంట్ గా వెళ్లాయి…  ఎందుకంటే ఉక్రెయిన్ కి మద్దతుగా పొలాండ్, జెర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్, రొమేనియా, ఇతర దేశాలు తమ ట్రూపులని సరిహద్దుల దగ్గరికి తరలించడానికి మరియు యుద్ధ టాంక్ లని, ఇతర గైడెడ్ మిస్సైళ్ళ ని ఉక్రెయిన్ కి ఇచ్చినందుకు!

ఉక్రెయిన్ కి అమెరికా ఇచ్చిన ఆయుధాలు:

HIMARS (High Mobility Artillery Rocket System) మల్టీపుల్ రాకెట్ లాంచర్స్. ఇది మన దేశంలోనే తయారయ్యే పినాక రాకెట్స్ లాంచర్ లాంటిది!

మొదట్లో హిమార్స్ బాగానే టార్గెట్స్ ని కొట్టినా రష్యన్ సైన్టిస్టులు హిమార్స్ GPS ని జామ్ చేయడానికి GPS జామర్స్ ని ఇంస్టాల్ చేయడంతో హిమార్స్ పూర్తిగా పనికిరాకుండా పోయాయి!

అసలు లేకపోవడం కంటే ఉన్నదే బెటర్ అన్నట్లుగా ఉక్రెయిన్ వాడుతూ వస్తున్నది!

రష్యా విజయవంతంగా HIMARS రాకెట్లని నిరుపయోగం చేయడంతో అమెరికన్ ఆర్మీ హిమార్స్ ని వాడకూడదు అని నిర్ణయించింది! SO! 40 ఏళ్ళ పాతవి అయిన HIMARS రాకెట్లని అమెరికా వదిలించుకుంది!

అదే వాటిని నిరుపయోగం చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి ఉక్రెయిన్ కి ఇచ్చి చేతులు దులిపేసుకుంది అమెరికా! డబ్బు మాత్రం HIMARS ని తయారు చేసే లాక్ హీడ్ మార్టిన్ ఖాతాలోకి వెళ్లిపోయాయి! లాక్ హీడ్ మార్టిన్ GMARS ( Global Mobile Artillery Rocket System ) అనే కొత్త తరం రాకెట్ లాంచర్ సిస్టమ్ ని అమెరికన్ ఆర్మీకి అమ్మడానికి సిద్ధంగా ఉంది!

నెదర్లాండ్స్ 42, డేన్మార్క్ 19 F-16 లని ఉక్రెయిన్ కి ఇవ్వడానికి అమెరికా అనుమతించింది 2023 చివరలో! 2024 లో మొదటి బ్యాచ్ F-16 లని ఉక్రెయిన్ అందుకుంది! వాటిలో రెండింటిని రష్యన్ Su-57 కూల్చివేసింది! మరో F-16 ని S-400 కూల్చేసింది.దాంతో F-16 లని రష్యన్ భూభాగంలో వాడడం ఆపేసింది ఉక్రెయిన్!

యుద్ధ నిపుణులు ఏమంటున్నారు అంటే నెదర్లాండ్స్, డేన్మార్క్ దేశాల దగ్గర ఉన్న F-16 లు 25 ఏళ్ళ పాతవి మరియు అప్ గ్రేడ్ చేయనివి కావడం వల్ల రష్యన్ Su-57, S-400 లకి ఈజీ టార్గెట్స్ అయ్యాయి అని. పాతవి ఉక్రెయిన్ కి ఇచ్చేసి కొత్తవి కొనడానికి వేసిన ప్లాన్ లో భాగంగానే డచ్, డేన్మార్క్ లు ఉక్రెయిన్ కి విరాళంగా ఇవ్వడానికి అమెరికా అనుమతి ఇచ్చింది, కొత్తవి మళ్ళీ లాక్ హీడ్ మార్టిన్ నుండే కొనాలి! ఎలా చూసినా బాగుపడేది Lockheed Martin కదా?….. ఇంకా ఉంది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions