Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రష్యా Vs అమెరికా… ఆధిపత్య యుద్ధం… కొత్త ఆయుధాల పరీక్ష కూడా..!!

January 27, 2022 by M S R

(రచయిత :: పార్ధసారధి పోట్లూరి…….. ) దాదాపుగా ఒక లక్షా 20 వేల మంది సైనికులని రష్యా తన సరిహద్దుల దగ్గరికి తరలించింది. చాలాకాలంగా ఉక్రెయిన్ ని స్వాధీనం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ! 2014 లో రష్యా క్రిమియాని ఆక్రమించిన సంగతి తెలిసిందే ! ఇప్పుడు ఉక్రేయిన్ ని స్వాధీనం చేసుకోవడానికి పట్టుదలగా ఉన్నది రష్యా !మరోవైపు నాటో దేశాలు కూడా తమ సైనికులని ఉక్రేనియన్ సరిహద్దుల దగ్గరికి తరలిస్తున్నాయి. ఇక అమెరికా అంకుల్ శామ్ ఆఫ్ఘనిస్తాన్ విషయంలో పోయిన పరువుని కాపాడుకొనే ప్రయత్నంలో, నాటో దేశాలలో ఉన్న తమ సైనిక స్థావరాలలో ఉన్న తమ సైనికులని కూడా ఉక్రేయిన్ సరిహద్దుల దగ్గరికి తరలిస్తున్నాడు. నాటో దేశాలతో పాటు అమెరికా కూడా ఉక్రేయిన్ కి ఆయుధాలు అందిస్తున్నది.

రష్యా ఆయుధాలు Vs అమెరికన్,యూరపు ఆయుధాలు

ఉక్రేయిన్ దగ్గర ఉన్నవి పాత కాలపు సోవియట్ ఆయుధాలు. ఆమాట కొస్తే ఒకప్పటి సోవియట్ యూనియన్ లో ఉక్రెయిన్ భాగంగా ఉన్నప్పుడు మిగ్, సుఖోయ్ యుద్ధ విమానాలు, వాటి విడి భాగాలు ఇప్పటి ఉక్రెయిన్ లో తయారయ్యేవి. సోవియట్ విచ్చిన్నం తరువాత ఉక్రెయిన్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించినప్పుడు క్రమంగా అన్ని ఆయుధ ఫ్యాక్టరీలు రష్యాకి తరలి వెళ్ళిపోయాయి… కానీ కొన్ని మాత్రం ఉక్రెయిన్ లో ఉండి పోయాయి. 1990 లలో సోవియట్ విచ్చిన్నం తరువాత అక్కడి ఆయుధ ఫ్యాక్టరీలలో పనిచేసిన ఇంజినీర్లు మొదట భారత్ లో పని దొరుకుతుంది అని ఆశపడ్డారు. కానీ భారత్ ఎలాంటి ఆసక్తి చూపలేదు. దానితో చాలా మందిని కమ్యూనిస్ట్ దేశం చైనా ఆహ్వానించింది. చైనా ఆయుధాల అభివృద్ధి వెనుక ఉక్రెయిన్ ఇంజినీర్ల కృషి ఉంది కనుకనే చైనా స్వంతంగా ఆయుధాలు తయారు చేసుకోగలుగుతున్నది. ఇప్పుడు మొదటిసారిగా రష్యా, అమెరికన్, యూరోపు ఆయుధాలని ఎదుర్కోబోతున్నది ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ కారణంగా !

Ads

నిపుణులు ఏమంటున్నారు ? 

ఇప్పటి వరకు ప్రపంచ దేశాలు వినని, చూడని ఆయుధాలని బహుశా రష్యా ఉపయోగించవచ్చు అంటున్నారు. అయితే ముందుగా ఆయుధప్రయోగం ఎవరు మొదలుపెడతారు అన్నదే ప్రశ్న ! ఇజ్రాయెల్ లో స్థిరపడిన ఒక ఉక్రేనియన్ ఆయుధ నిపుణుడి అంచనా ప్రకారం… మొదట రష్యా, ఉక్రెయిన్ సరిహద్దుల దగ్గర ఉన్న ఎరువుల కోసం ఏర్పాటు చేసిన ‘అమ్మోనియా ‘ కర్మాగారం నుండి అమ్మోనియా గాస్ లీక్ చేసి ఆ నెపం నాటో దేశాల మీద పెట్టడానికి సిద్ధం అవుతున్నది రష్యా అని… దీనికి కారణాలు లేకపోలేదు. తూర్పు ఉక్రెయిన్ లో రష్యా అనుకూల ప్రజల సంఖ్య ఎక్కువగానే ఉంది. వీళ్ళు రష్యాకి మద్దతుగా ఆయుధాలు ధరించి ఉక్రెయిన్ సైన్యం మీద తరుచూ దాడులు చేస్తున్నారు. ఇది గత 8 ఏళ్లుగా జరుగుతున్నదే!

ukraine

యుద్దం ఎవరు ప్రారంభిస్తారు..?

రష్యా, తూర్పు ఉక్రెయిన్ సరిహద్దుల దగ్గర 10 మైళ్ళ దూరంలో ఈ అమ్మోనియా కర్మాగారం ఉక్రేయిన్ లో ఉంది. అయితే ఇప్పటికే నాటో దేశాలు కూడా రష్యా రహస్యంగా అమ్మోనియా తో నిండి ఉన్న సిలిండర్ల ని తమకి మద్దతు ఇచ్చే ఉక్రెయిన్ తిరుగుబాటు దళాల ద్వారా ఆ అమ్మోనియా ఫ్యాక్టరీకి తరలించింది అని ఆరోపిస్తున్నాయి. కానీ రష్యా మాత్రం ఈ ఆరోపణని ఖండిచింది. ఇప్పటికే రష్యా సరిహద్దుల్లో తూర్పు ఉక్రెయిన్ లో మంచు విపరీతంగా కురుస్తూ అసలు ఏమీ కనపడని పరిస్థితి ఉంది… అలాంటిది ఈ సమయంలో ఉక్రెయిన్ ని ఆక్రమించుకోవాలని చూస్తున్నది రష్యా… కానీ ఎలా ? రష్యా తన సైనికులకి తీవ్ర మంచులో కూడా దాడి చేయడానికి అవసరం అయిన సరికొత్త దుస్తులతో పాటు హీట్ ఇమేజింగ్ బైనాక్యులర్స్ ని ఇచ్చింది. దాంతో మనిషి కనపడకపోయినా థర్మల్ ఇమేజింగ్ సహాయంతో శత్రువు ఎక్కడ ఉన్నాడో చూడవచ్చు. కానీ ఉక్రెయిన్ దగ్గర ఈ బైనాక్యులర్స్ లేవు. అయితే నాటో యుద్ధ నిపుణులు మాత్రం తన అధునాతన యుద్ధ విమానాల ద్వారా మొదట దాడి మొదలుపెట్టి, తరువాత సముద్రం ద్వారా దాడులు తీవ్రతరం చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

యూరప్ దేశాలకు సహజవాయువు కట్..?

ఇంత తీవ్రమయిన మంచు కురిసే కాలంలో రష్యా దాడి చేయడానికి కల కారణం…? రష్యా నుండి సహజ వాయువు పైప్ లైన్ ద్వారా యూరోపుకి సరఫరా అవుతున్నది. ఈ సహజ వాయువుని ఉపయోగించి ఈ చలి కాలంలో హీటర్స్ తో పాటు వంట, పారిశ్రామిక అవసరాలు తీరుతున్నాయి. ఒకవేళ నాటో గనుక ఉక్రెయిన్ తో చేయి కలిపితే రష్యా సహజ వాయువుని ఆపేస్తుంది. అసలే కరోనా వల్ల దెబ్బ తిన్న ఆర్ధిక వ్యవస్థని మళ్ళీ గాడిలో పెట్టేందుకు నానా తంటాలు పడుతున్న నాటో దేశాలకి సహజ వాయువు దొరకకపోతే అది మరిన్ని కష్టాలని తెచ్చి పెడుతుంది. యుద్ధానికి మీరు దూరంగా ఉంటే మంచిది అని రష్యా పరోక్షంగా హెచ్చరిస్తున్నది నాటో దేశాలని.

ukraine

ప్రపంచదేశాల మీద ప్రభావం..?

రష్యా, ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ప్రభావం పరోక్షంగా ప్రపంచ దేశాల మీద కూడా ఉంటుంది. ప్రధానంగా అమరికా మరిన్ని ఆంక్షలు విధించవచ్చు రష్యా మీద… దాంతో ముడి చమురు కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. బహుశా ముడి చమురు బ్యారెల్ ధర 150 డాలర్లకి చేరుకోవచ్చు. ముడి చమురు దిగుమతి చేసుకొనే అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థల మీద పెను భారం పడవచ్చు. ఇక సింహభాగం సన్ ఫ్లవర్ గింజలు రష్యా నుండి మన దేశానికి దిగుమతి అవుతున్నాయి… అంటే వంట నూనెల మీద కూడా భారం పడవచ్చు.

మనకూ నష్టదాయకమే…

ఇప్పటికే కరోనా వల్ల ఉత్పత్తి పడిపోయి సరఫరాలో అంతరాయం ఏర్పడినందు వల్ల వంట నూనెల ధరలు ఆకాశానికి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఒకవేళ వేరే దేశాల నుండి దిగుమతి చేసుకోవాలన్నా, పెరిగిన ముడి చమురు ధరలని సన్ ఫ్లవర్ మీద కూడా వేస్తాయి కాబట్టి ధరలు పెరిగేవే కానీ తగ్గే సూచనలు లేవు. So ! లాభపడేది గల్ఫ్ దేశాలతో పాటు అమెరికా మాత్రమే ! అందుకే యుద్ధం జరగాలనే కోరుకుంటున్నది అమెరికా ! ఉక్రెయిన్ రాజధాని కీవ్ త్వరలో రష్యాలో కలిసి పోనున్నదా ? ఉక్రెయిన్ ఆర్ధిక పరిస్థితి మాత్రం యుద్ధం చేసే స్థితిలో లేదు. ఉక్రెయిన్ ప్రధానంగా టూరిజం మీద ఆధారపడి బతుకుతున్నది. కరోనా వల్ల టూరిజం ఆదాయం లేదు. ప్రస్తుతం ఉక్రెయిన్ చాలా దీన స్థితిలో ఉంది. ఒకవేళ రష్యా ఉక్రెయిన్ ని ఆక్రమిస్తే భారత్ ఎలా స్పందించాలి ? మరో పోస్ట్ లో తెలియచేస్తాను….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions