Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఫేక్ న్యూస్‌పై కేంద్ర ప్రభుత్వం ‘యుద్ధం’ ప్రారంభించింది !

August 19, 2026 by M S R

.

Pardha Saradhi Upadrasta ….  ఫేక్ న్యూస్‌పై కేంద్ర ప్రభుత్వం ‘యుద్ధం’ ప్రారంభించింది!
సోషల్ మీడియాలో తప్పుడు, తప్పుదారి పట్టించే, మార్చి రూపొందించిన లేదా సందర్భం తప్పుగా చూపించే కంటెంట్ వేగంగా వ్యాప్తి చెందకుండా కేంద్రంలోని మంత్రిత్వ శాఖలు Quick Response Teams (QRTs) ఏర్పాటు చేస్తున్నాయి.

లక్ష్యం ఒక్కటే — Fake Content ను గుర్తించడం, వాస్తవాలను పరిశీలించడం, వేగంగా ప్రజలకు సరైన సమాచారం అందించడం.
ముఖ్యంగా ఒక తప్పుడు లేదా misleading కంటెంట్ గుర్తించిన తర్వాత 2 గంటల్లోపే అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా స్పందించేలా QRTలకు లక్ష్యాన్ని నిర్దేశించారు.

Ads

 QRTలు ఏం చేస్తాయి?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కంటెంట్‌ను నిరంతరం పర్యవేక్షిస్తాయి. Fake News, Misleading Information, Manipulated Contentను గుర్తిస్తాయి. సందర్భం తప్పుగా చూపిస్తున్న పోస్టులు, వీడియోలు, క్లిప్పులను పరిశీలిస్తాయి.

అవసరమైతే సంబంధిత వాస్తవాలను సేకరించి అధికారికంగా వివరణ ఇస్తాయి.
కేవలం టెక్స్ట్ కాకుండా Reels, Short Videos, Graphics, Memes వంటి అదే ప్లాట్‌ఫారమ్‌కు సరిపోయే ఫార్మాట్‌లో స్పందించడంపై కూడా దృష్టి పెట్టనున్నారు.
విద్యుత్, వ్యవసాయం, వాణిజ్యం వంటి శాఖలు ఇప్పటికే ఇలాంటి QRTలను ఏర్పాటు చేశారు.

ఎందుకు ఈ చర్య?
ఒక Fake News వైరల్ కావడానికి కొన్ని గంటలు కూడా అవసరం లేకపోవచ్చు. ఒక చిన్న వీడియో, ఒక కట్ చేసిన క్లిప్…
ఒక తప్పుడు Headline, ఒక పాత వీడియోను కొత్త సంఘటనగా చూపించడం. కొన్ని నిమిషాల్లోనే వేల నుంచి లక్షల మందికి చేరవచ్చు.

అందుకే ప్రభుత్వం ఏం భావిస్తున్నదంటే…  “తప్పుడు సమాచారం ఎంత వేగంగా వ్యాపిస్తుందో, నిజమైన సమాచారం కూడా అంతే వేగంగా ప్రజలకు చేరాలి…”

మొత్తానికి కళ్ళు తెరిచారు. ఇప్పటి దాకా PIB లు, కొన్ని ప్రైవేట్ సంస్థలు ఫాక్ట్ చెక్ చేసేవి. మంత్రిత్వ శాఖ అధికారికంగా చెప్పటానికి సమయం తీసుకునే వారు. ఇలా వేగంగా ఏది నిజం, ఏది అబద్ధం అధికారికంగా రావటం మంచిదే……..
సమాచారం వేగంగా వ్యాపించే కాలంలో…
వాస్తవాలు ఇంకా వేగంగా ప్రయాణించాలి….

మరి ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసే హ్యాండ్లర్స్ మీద యాక్షన్..? అది వేచి చూడాలి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఫేక్ న్యూస్‌పై కేంద్ర ప్రభుత్వం ‘యుద్ధం’ ప్రారంభించింది !
  • ఓ ప్రియురాలి వేదన – ఈ ఒక్క పాటతో గుల్జార్ వెనక్కి చూసుకోలేదు ఇక !!
  • తడి తడిమే ఓ ఆర్ద్రగీతం- కర్కశ హృదయుల కళ్లూ చెమర్చాల్సిందే
  • మంత్రి క్షమాపణ ! ఇది స్వీయ అభిశంసన !! అయ్యో, పొంగులేటి !!
  • ధ్రువ… ఆ రీల్ అపరిచితుడి కొడుకేనా ఈ రియల్ అపరిచితుడు..?!
  • ఛిన్న మస్తాదేవి ! ఓ స్టేజ్ షో ప్రదర్శనపై రచ్చ ! అసలేం జరిగిందంటే !!
  • ఫాఫం తెలంగాణ బీజేపీ ! హైకమాండ్ గాలికి వదిలేసినట్టుగా ఉంది !!
  • ఏసేశాడు, రేవంత్ రెడ్డి మళ్లీ ఏసేశాడు..! సెటైర్ భలే పేలింది !!
  • సంస్కార దారిద్య్రం !! మీ దుంపతెగ- ఇదేం భాషరా బాబూ..!!
  • నా లైఫ్ నేను మాత్రమే మార్చుకోవాలి… ఇంకెవరో ఆ పని చేయరు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions