Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అటు పాకిస్థాన్‌తో యుద్ధం… సేమ్ టైమ్, విదేశీ కక్కుర్తి మీడియాతోనూ…

May 19, 2025 by M S R

.

Pardha Saradhi Potluri …. భారత్ ఒక వైపు – చైనా, పాకిస్తాన్, టర్కీ, CNN, BBC, అల్ జజీరా, బంగ్లాదేశ్ ఒక వైపు!

ఆపరేషన్ సిందూర్ వలన భారత్ నేర్చుకోవాల్సిన పాఠాలు చాలానే ఉన్నాయి, అలా అని భారత్ విఫలమైందని కాదు చెబుతున్నది…

Ads

1.భారత్ లోని R&AW, మిలిటరీ ఇంటెలిజెన్స్ ఎకో సిస్టమ్ తాము CIA, మోస్సాద్ లకి తీసిపోము అని ప్రపంచానికి చాటి చెప్పాయి!
2.చైనా ఆశలు అడియాశలు అయ్యాయి. ఆసియా ఖండంలో తన ఆధిపత్యం ఏకపక్షంగా చెలాయించాలి అనే ఆలోచనకి బ్రేక్ వేసింది భారత్!

3.ఆసియాలో చైనా అనే ఏక ధ్రువ ప్రపంచం ఉండాలి అని చైనా ప్రయత్నిస్తున్నది కానీ మొన్నటి వరకూ భారత్ ఒక చిన్న అడ్డంకి అని మాత్రమే భావించింది! ఆపరేషన్ సిందూర్ వలన చిన్న అడ్డంకి కాస్తా పెద్ద కొండ అయి కూర్చున్నది!

4.ప్రెసిషన్ స్ట్రైక్ చేయడంలో ఇజ్రాయేల్, అమెరికాలు మాత్రమే ముందు వరసలో ఉన్నాయి. ఇప్పుడు భారత్ స్థానం ఏమిటో మిగతా దేశాలు తేల్చుకోలేక పోతున్నాయి. ఎందుకంటే పౌరులకి ఎలాంటి నష్టం కలగకుండా జనావాసాల మధ్యలో ఉన్న టార్గెట్ ని పిన్ పాయింట్ యాక్యురసితో మిసైల్ దాడి చేయగలిగింది భారత్!

5. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్థాన్ లోని టార్గెట్లని ధ్వంసం చేసిన తీరు చూసి పశ్చిమ దేశాలతో పాటు రష్యన్ వార్ ప్లానర్స్ కూడా ఆశ్చర్యపోయారు!
6.పాకిస్తాన్ లో కీలక స్థావరాల మీద ఇండియన్ మిసైళ్ళు విరుచుకుపడిన తీరుని గ్లోబల్ ఫైర్ పవర్ మీద నిష్పాక్షిక విశ్లేషణ చేసే నిపుణులు సైతం ఇండియా ఇక ఎంతమాత్రం ప్రాంతీయ శక్తి కాదు, ప్రపంచ యుద్ధం అంటూ జరిగితే ఆసియాలో ఫలితాలని తారుమారు చేయగల స్థితికి చేరుకుంది అని విశ్లేషిస్తున్నారు!

7. అమెరికా నమ్మతగ్గ స్నేహితుడు కాదని మరోసారి రుజువు అయ్యింది! కేవలం వ్యాపార అవసరాల కోసమే అమెరికాతో స్నేహం చేయాలి!
8.రష్యా, ఇజ్రాయేల్ లు భారత్ తమకి ముఖ్యమైన స్నేహితుడు అని నిరూపించాయి బేషరతుగా!
9.ఇరాన్ ని పూర్తిగా నమ్మకూడదు!

10.మధ్యప్రాచ్యంలో సౌదీ, UAE లు తటస్థం గా ఉండిపోయినా చాలా కొద్దిగా భారత్ వైపు ఉన్నట్లుగా ప్రవర్తించాయి…

11.వెస్ట్రన్ మీడియా చాలా ప్రమాదకరమైన పాత్ర పోషిస్తున్నది భారత్ కి వ్యతిరేకంగా!

12. పాకిస్తాన్ అణు దాడి హెచ్చరికలు చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో నూర్ ఖాన్ అణు స్థావరం మీద భారత్ చేసిన దాడి గతంలో ఇజ్రాయేల్ ఇరాక్ లోకి చొరబడి అణు స్థావరం మీద చేసిన దాడిని గుర్తుకు తెచ్చింది! ఇంకోసారి అణు దాడి చేస్తామంటూ పాకిస్తాన్ రాజకీయ నాయకులు ప్రకటనలు చేయాలంటే భయపడి పోయేలా ఉంది భారత్ చేసిన దాడి!

13.యూరోపు దేశాలు భారత్ చేసిన దాడిని ఆసక్తిగా పరిశీలించాయి కానీ భవిష్యత్ లో కాశ్మీర్ లో మానవహక్కులు ఎలా ఉన్నాయో పరిశీలిస్తాము అని డిమాండ్ చేసే అవకాశాలు లేకుండా చేశారు మోడీ. ప్రెసిషన్ స్ట్రైక్ తాము మాత్రమే చేయగలని భావించే యూరోపు దేశాలు ఇక నుండి ఆ భ్రమలో ఉండవు!

******************
భారత్ కి అంతర్జాతీయ మీడియా మద్దతు దొరకపోగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ లోని ప్రార్ధనా స్థలాల మీద దాడి చేసింది అంటూ దుష్ప్రచారం చేశాయి!
లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ లాంటి ఉగ్ర సంస్థలు మదర్సాల పేరుతో ఉగ్రవాద ఫాక్టరీలు నడుపుతున్న సంగతి తెలిసి కూడా దుష్ప్రచారం చేయడం వెనక ఉద్దేశం పశ్చిమ దేశాలకి భారత్ ఎదగడం ఇష్టం లేకపోవడమే. 1947 నుండి 2014 వరకూ ఈ ట్రెండ్ కొనసాగింది!

న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, వాల్ స్ట్రీట్ జర్నల్, ది టెలిగ్రాఫ్, BBC, CNN, ఫాక్స్ న్యూస్ లకి చైనా నుండి భారీగా ఫండింగ్ జరిగింది!

ఈ నిధుల ప్రవాహం దేని కోసం?
చైనా మిలిటరీ ఇండస్ట్రీయల్ కాంప్లెక్స్ ప్రయోజనాల కోసం! ఓహ్! చైనా కోసం కూడా వెస్ట్రన్ మీడియా పనిచేస్తుందా? YES! మీడియా సంస్థలు అందులోనూ అంతర్జాతీయ మీడియా సంస్థలు విరాళాలు లేకుండా మనుగడ సాగించలేవు!
డబ్బులు ఇస్తే ఎవరి పక్షమైన వకాల్తా పుచ్చుకుంటాయి.

చైనా పాకిస్తాన్ ఉమ్మడి తయారీ అని చెప్పుకుంటున్న JF-17 ప్రమోషన్ కోసం, ప్రొడక్షన్ పక్కకి తప్పించి తాను వాడడం మానేసిన J-10C ఫైటర్ జెట్లని అమ్ముకోవడం కోసం చైనా విపరీతంగా డబ్బులు ఖర్చుపెడుతున్నది గత పది రోజులుగా!

చైనా, పాకిస్థాన్ లతో పాటు వెస్ట్రన్ మీడియా అల్లిన కధనాలు ఏమిటో చూద్దాం….
ఆపరేషన్ సిందూర్ లో భాగంగా may 7 తెల్లవారు ఝామున ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన 5 జెట్ ఫైటర్స్ ని పాకిస్థాన్ J10 C , JF-17 కూల్చివేసాయి అని పాకిస్తాన్ ప్రకటించింది.
ఆ 5 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జెట్ ఫైటర్స్ కూడా భారత భూభాగంలో ఉండగానే కూల్చేశామని పాకిస్థాన్ చెప్పింది. భారత భూభాగంలోనే కూలిపోవడం వలన తమ దగ్గర ఆధారాలు లేవని ప్రకటించింది!

PAF చెప్తున్న దాని ప్రకారం 3 రాఫెల్ జెట్ ఫైటర్స్, ఒక SU-30MKI, ఒక మిరేజ్ 2000 లతో కలిపి మొత్తం అయిదు జెట్ ఫైటర్స్ ఉన్నాయి… నిజమా…
ఎలా జరిగింది?
ఏమీ లేదు, ఇదంతా ఒక సైన్స్ ఫిక్షన్ కధ ……

భారత్ దాడి చేస్తుందని తెలుసు కాబట్టి చైనా ఏవియేషన్ ఇంజినీర్లు, పైలట్లు, పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ వ్యూహకర్తలతో కలిసి వ్యూహం రచించారట ఇలా..
చైనా తయారీ ZDK – 03 అవాక్స్ ( AEWACS – Airborne Early Warning and Control Systems) విమానం, J-10c ఫైటర్ జెట్, JF-17 ఫైటర్ జెట్లని లాంగ్ రేంజ్ ఎయిర్ to ఎయిర్ మిసైల్ PL-15E లతో మూడు రోజుల పాటు ముందస్తు సన్నాహాలు చేసుకున్నారట.

మరి దాడి ఎలా చేశారట?
డేటా లింక్ ( Data Link) : ZDK – 03 అవాక్స్ విమానం అనేది ఆకాశంలో ఎగురుతూ ఉండే ఒక కమాండ్ & కంట్రోల్ సిస్టమ్! అవాక్స్ ఆకాశంలో ఎగురుతూ 300 నుండి 400 KM వరకు ఆకాశంలో, భూమి మీద పహారా కాస్తుంది. శత్రు దేశపు విమానం 300 KM దూరంలో ఉండగానే గుర్తించి అలర్ట్ చేస్తుంది. అలాగే శత్రు భూభాగం నుండి ఏదన్నా మిసైల్ గాల్లోకి లేచినా లేదా శత్రు దేశపు విమానం టేక్ ఆఫ్ చేస్తున్నా గుర్తిస్తుంది. అవాక్స్ నేరుగా తమ దేశ విమాన పైలట్లతో నేరుగా మాట్లాడి సూచనలు ఇస్తుంది.

అవాక్స్ మోడల్ ని బట్టి శత్రు దేశపు జెట్ ఫైటర్స్ రాడార్స్ ని, కమ్యూనికేషన్ వ్యవస్థని జామ్ చేయగలదు.
అవాక్స్ శత్రు దేశపు జెట్ ఫైటర్ ని ట్రాక్ చేసి తమ జెట్ ఫైటర్స్ కి సమాచారం ఇవ్వగలదు!
So! మేడ్ ఇన్ చైనా ZDK-03 AWACS + J10C +JF-17+ PL-15 లాంగ్ రేంజ్ మిసైల్స్ + అంతరీక్షంలో చైనా కమ్యూనికేషన్ ఉపగ్రహాలు కలిసి నెట్వర్క్ గా ఏర్పడి ఒకే సారి అన్నీ కలిసి సమాచారం ఇచ్చి పుచ్చుకుంటాయి.. DATA LINK అంటే ఇదే!

భారత్ జెట్ ఫైటర్స్ రన్వే నుండి గాల్లోకి లేచాయో ZDK-03 అవాక్స్ వెంటనే పసిగట్టింది. అప్పటికే భారత్ సరిహద్దు నుండి దూరంగా గాల్లో చక్కర్లు కొడుతున్న J10C, JF 17 లకి అవాక్స్ సమాచారం ఇవ్వడం వెంటనే J10C మన రాఫెల్స్ ని రాడార్ లాక్ చేసి PL-15 లని వరసగా ఫైర్ చేశాయి, అవి నేరుగా రాఫెల్ ఫైటర్ జెట్స్ ని మూడింటిని కూల్చేసాయట.

మరో JF 17 SU-30MKI ని టార్గెట్ లాక్ చేసి PL-15 ని లాంచ్ చేసింది అది SU 30 MKI ని కూల్చేసింది. అదే విధంగా J10C మరో మిసైల్ లాంచ్ చేసి మీరేజ్ 2000 ని కూల్చేసింది!
మరి J10 C మరియు JF-17 ల రాడార్ పరిధి తక్కువ కదా? PL-15 230 KM దూరం ని ఎవరు గైడ్ చేశారు? అవాక్స్ PL-15 ని టార్గెట్ వరకు గైడ్ చేసింది.

ఇదంతా సాధ్యమా?
YES. సాధ్యమే థియరీ మరియు ప్రాక్టికల్ గా సాధ్యమే!
గతంలో ఇరాక్, లిబియా, ఆఫ్ఘనిస్తాన్ ల మీద నాటో విమానాలు దాడి చేసినపుడు DATA LINK సహాయంతో F-16, F-15, ఫైటర్ జెట్స్ ని అమెరికన్ అవాక్స్ అయిన E3-SENTRY తో కలిసి అమెరికన్ ఉపగ్రహాల సహాయంతో కో ఆర్డినేటెడ్ స్ట్రైక్స్ చేశాయి.
ఇక్కడ డేటా లింక్ చేయాలి అంటే అన్నీ ఒకే దేశానికి చెందినవి అయి ఉండాలి!
చైనా, పాకిస్తాన్ ల ప్రాపగాండాలో చాలా లోపాలు ఉన్నాయి… అవి ఏమిటంటే…

14. J-10C రాఫెల్ ని లాక్ చేసి PL-15 ని లాంచ్ చేసి దూరంగా వెళ్ళిపోయింది తరువాత ZDK-03 AWACS PL15 ని టార్గెట్ వరకూ గైడ్ చేసింది. WELL! ఇంతవరకూ సరిగ్గానే ఉంది! కానీ PL-15 మిసైల్ లో రాడార్ ఉంటుంది కదా? మరి ఆ రాడార్ సిగల్స్ ని రాఫెల్ జామ్ చేస్తుంది కదా?

అటువటప్పుడు PL-15 రాఫెల్ ఎలా కొట్టగలిగింది?
చైనా అవాక్స్ విమానం టార్గెట్ కి దారి మాత్రమే చూపగలదు కానీ తన టార్గెట్ ని కొట్టాలి అంటే PL-15 లోని రాడార్ ACTIVE గా ఉండి తీరాలి.
చైనా కథనంలో ట్విస్ట్ ఏమిటంటే….  J10c ఫైటర్ జెట్ రాఫెల్ ని లాక్ చేసి PL-15 ని లాంచ్ చేసి దాని రాడార్ ని ఆఫ్ చేశాడు పైలట్… వెంటనే అవాక్స్ దానిని రాఫెల్ వరకూ దారి చూపించింది. రాఫెల్ కి కొద్ది దూరంలో PL-15 ఉన్నప్పుడు J10-C పైలట్ PL-15 లోని రాడార్ ని ఆక్టివేట్ చేశాడు దాంతో మిసైల్ రాఫెల్ ని కొట్టేసింది!

ఇదీ వాళ్ల ప్రాపగాండా…
వాహ్! క్యా బాత్ హై!

TIME and DISTANCE
PL-15 లాంగ్ రేంజ్ మిసైల్ అనేది డ్యూయల్ పల్స్ రాకెట్ ఇంజన్లు కలిగి ఉండడం వలన శబ్ద వేగానికి నాలుగు రెట్ల ( MACH 4) వేగంతో ప్రయాణిస్తుంది.
250 KM దూరం నుండి ప్రయోగిస్తే అది భారత్ లోని పంజాబ్ సరిహద్దుల వద్ద ఉన్న రాఫెల్ ని చేరడానికి షుమారుగా 15 సెకన్ల సమయం పడుతుంది.

అంటే మిసైల్ లాంచ్ చేసేటప్పుడు టార్గెట్ ని చూపడానికి మిసైల్ లోని రాడార్ ని ఆక్టివ్ గా ఉంచి లాంచ్ చేసిన తరువాత మిసైల్ రాడార్ ని డియాక్టివేట్ చేసి 1234567 అంకెలు లెక్కపెట్టి తిరిగి మిసైల్ రాడార్ ని ACTIVATE చేశాడా పైలట్?

ఎంత డేటా లింక్ ఉన్నా J-10 C పైలట్ ఈ పనిచేయలేడు ఎందుకంటే J-10C రాడార్ సిగ్నల్స్ ని రాఫెల్ జామ్ చేస్తుంది!
రాఫెల్ స్పెక్ట్రా – RAFALE SPECTRA!
రాఫెల్ F3R కొన్నదే SPECTRA EW ( Electronic Warfare ) ఉన్నదనే!

స్పెక్ట్రా ew రాఫెల్ కి రక్షణ ఇస్తుంది శత్రు దేశపు మిసైల్స్ నుండి. శత్రుదేశపు జెట్ ఫైటర్ రాడార్ ని కూడా జామ్ చేసి గుడ్డిదాన్ని చేస్తుంది, no matter అది ఏ విమానమైనా సరే!

J-10C మరియు రాఫెల్ ల రాడార్ పరిధి 200 KM. అంటే J10 C కనుక రాఫెల్ ని చూస్తే రాఫెల్ కూడా J10C ని చూస్తుంది అటువంటప్పుడు రాఫెల్ స్పెక్ట్రా J-10C రాడార్ ని జామ్ చేయకుండా ఎందుకుంటుంది?
పోనీ J-10C రాడార్ రాఫెల్ రాడార్ ని జామ్ చేసిందా? అలా జరిగే అవకాశం ఎంతమాత్రమూ లేదు ఎందుకంటే రాఫెల్ రాడార్ జామ్ ప్రూఫ్!

పోనీ SPECTRA EW ని J10 C బోల్తా కొట్టించిందా అంటే దానికి ఆస్కారం లేదు. SPECTRA EW ప్రతీ సెకన్ కి ఒకసారి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీలలో సిగ్నల్స్ పంపిస్తూ ఉంటుంది ఎదుటి విమానాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి. అలాగే ఎదుటి విమానం కానీ మిసైల్ కానీ పంపించే ఫ్రీక్వెన్సీలని రియల్ టైంలో అదే తరహాలో తిరిగి పంపిస్తుంది కాబట్టి ఎదుటి విమానంకి సమాచారం దొరకదు.

PL-15 నే తీసుకుంటే రాఫెల్ దగ్గరికి వచ్చే లోపే దాని రాడార్ ని జామ్ చేయడంతో అది టార్గెట్ ని గుర్తించలేక నేరుగా వెళ్ళిపోయి పేలిపోతుంది! Air to Air మిసైల్స్ లో లోపల కిల్ స్విచ్ ఉంటుంది. టార్గెట్ మిస్ అయితే ఆటోమేటిగ్గా కిల్ స్విచ్ ఆన్ అయిపోయి గాల్లోనే పేలే విధంగా డిజైన్ చేస్తారు, ఎందుకంటే జనావాసాల మీద పడి పేలిపోకుండా ఉండేందుకు.

రెండు PL-15 మీసైళ్ళు భారత భూభాగంలో దొరికాయి, జస్ట్ బాక్స్ లో నుండి అప్పుడే బయటికి తీసినట్లుగా! వాటిలో ఇంధనం అయిపోయి ఏటవాలుగా భూమి మీద లాండ్ అవడం వలన అవి దెబ్బతినలేదు.
So! టెక్నీకల్ గా నమ్మేవిధంగా కట్టు కధ అల్లి ప్రచారం చేసింది చైనా!

అసలు లాజిక్ ఉందా?
చైనా, పాకిస్థాన్ లు అల్లిన కధలే నిజమైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ గగనతలాన్ని యదేచ్చగా ఎలా వాడుకొని దాడులు చేసి 11 ఎయిర్ బేస్ లని ధ్వంసం చేయగలిగింది? వాళ్లు చెప్పినట్లే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలన్నిటిని వాళ్ళ భూభాగంలోనే కూల్చి వేసుండాల్సింది కదా? అదే వ్యూహం ఎందుకు అమలు చేయలేకపోయారు?

Yes! మిరేజ్ 2000 కి కానీ Su-30MKI కి కానీ రాఫెల్ కి ఉన్నట్లుగా SPECTRA EW సూట్ లు లేవు కాబట్టి వాటిని కూల్చినట్లు చెపితే నమ్మవచ్చు. వాటికి జామింగ్ ప్యాడ్ లు మాత్రమే ఉంటాయి అవి కూడా అవుట్ డేట్ అయిపోయాయి PL-15 విషయానికి వస్తే!

ఏదన్నా డీప్ టెక్నాలజీ తో ముడిపడి ఉన్న అంశంలో వెంటవెంటనే న్యూస్ అప్డేట్స్ ఇవ్వడం అనేది ఆత్మహత్యతో సమానం! మెయిన్ స్ట్రీమ్ మీడియా కావొచ్చు సోషల్ మీడియాలో కావొచ్చు… బ్రేకింగ్ న్యూస్ ఇచ్చి సంచలనం సృష్టించాలి అనే తపనతో ఏ మాత్రం అవగాహన లేని అంశాలని ప్రసారం చేస్తున్నారు!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ప్చ్, మన బ్రాహ్మి ఆగిపోయాడు… కానీ వడివేలు వదలడం లేదు…
  • == యుద్ధము, వ్యాపారం, స్టాక్ మార్కెట్లపై ప్రభావం ==
  • నూకల అత్తెసరు..! ఈ తరానికి తెలియని సూపర్ రెసిపీ… విత్ పచ్చిపులుసు…!!
  • ఎస్.జైశంకర్..! నాన్- పొలిటికల్ మంత్రిగా ఓ విశిష్ట ఎంపికే..! చదవండి..!
  • అటు పాకిస్థాన్‌తో యుద్ధం… సేమ్ టైమ్, విదేశీ కక్కుర్తి మీడియాతోనూ…
  • విస్తరి లేదు, అరిటాకు లేదు… నేల మీదే భోజనం… మహాప్రసాదం..!!
  • వయస్సు ఓ దశ దాటాక ఎలా బతకాలి..? గానుగెద్దు జీవితం వదిలేదెలా..?
  • గూఢచారి జ్యోతి… ఎన్ఐఏ‌ను ఏడాది క్రితమే అలర్ట్ చేసిన ట్వీట్…
  • అందరూ సమానమే, కానీ కొందరు ఎక్కువ సమానం… అసలు ఏమిటీ 23…
  • పాకిస్థానీ క్యాంపెయిన్ టీమ్‌లో ఈ ఇద్దరూ… వారి చుట్టూ ఓ ప్రేమకథ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions