.
Pardha Saradhi Potluri …… భారత్ ఎప్పుడు పాకిస్తాన్ మీద దాడి చేస్తుంది? Part 2
చైనా పూర్తిగా పాకిస్థాన్ వెనుక ఉండి ప్రోత్సహస్తున్నది!
చైనా పాకిస్తాన్ కి ఇచ్చిన PL-15 లాంగ్ రేంజ్ ఎయిర్ TO ఎయిర్ మిసైల్ అనేది గేమ్ చేంజర్ అనడంలో సందేహం లేదు!
Ads
ఒకసారి వివరాలలోకి వెళదాం!
PL-15 లాంగ్ రేంజ్ మిసైల్ ని చైనా తయారు చేసింది కేవలం అమెరికాని దృష్టిలో పెట్టుకొని మాత్రమే! బయటికి 200 km రేంజ్ అని చెపుతున్నా 230 km వరకూ వెళ్ళగలదు!
ఒకసారి లాంగ్ రేంజ్ Air to Air మిసైల్స్ ఎవరి దగ్గర ఉన్నాయో చూద్దాం!
అమెరికా: AIM 120D AMRAAM ( Advanced Medium Range Air to Air Missile) 160 km.
చైనా: PL-15 VLRAAM 200+ KM. దీనికోసం చైనా డ్యూయల్ పల్స్ సాలిడ్ ప్రొపెల్లెంట్ ర్యామ్ జెట్ ఇంజిన్ ని అభివృద్ధి చేసింది. మరో విశేషం ఏమిటంటే EASA రాడార్ సీకర్ ఉండడం, Two way data link ఉండడం వలన PL-15 ని శత్రు దేశపు జెట్ ఫైటర్స్ యొక్క రాడార్ దీనిని జామ్ చేయలేదు. PL 15 నిరంతరం తనని ప్రయోగించిన విమానం రాడార్ నుండి ఆజ్ఞలు తీసుకుంటూ టార్గెట్ ని నాశనం చేస్తుంది!
యూరోప్: MBDA (Matra BAe Dynamics Anglo Italian Alenia Marconi Systems- MBDA European consortium). మనం రాఫెల్ F3R కొన్నప్పుడు ఎక్సట్రా ప్యాకేజి టాగ్ తో METEOR లాంగ్ రేంజ్ ఎయిర్ to ఎయిర్ మిసైల్స్ కొన్నాము.
Meteor BVRAAM ( Beyond Visual Range Air to Air Missile) పరిధి 200 km. అఫ్కోర్స్! అమెరికా కానీ చైనా కానీ రష్యా కానీ ఇవ్వలేని గ్యారంటీ MBDA METEOR BVRAAM మిసైల్ ఇస్తుంది అది: నో ఎస్కెప్ జోన్. No Escape Zone అంటే 120km లోపు శత్రు దేశపు టార్గెట్ ని నాశనం చేయగలదు.
రష్యా: R-37 ఎయిర్ to ఎయిర్ మిసైల్ పరిధి 400 km. కానీ R-37 అనేది హైపర్ సానిక్ మిసైల్. రష్యన్ Mig-31, Su-35,Su-57 లతో అనుసంధానించబడింది కానీ Su-30 MKI తో కాదు. మన దగ్గర ఉన్న SU-30 MKI లతో లాంచ్ చేయలేము! ఇప్పటికిప్పుడు R-37 లని SU-30 MKI లతో అనుసంధానం చేయాలంటే సమయం సరిపోదు!
******************
చైనా పాకిస్థాన్ కి ఇచ్చిన PL-15 తో మనకి నష్టం ఎలా ఉండబోతున్నది?
PL-15 తో రాఫెల్ ని తప్ప మిరేజ్ 2000, SU-30 MKI లని దూరం నుండే కూల్చివేయగలదు పాకిస్థాన్!
SU-30 MKI కేవలం 110 KM రేంజ్ కలిగిన ఎయిర్ to ఎయిర్ మిసైల్ అయిన Astra- Mark 1 ని ప్రయోగించగలదు. Astra-Mark 1 పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో మన దేశంలోనే తయారువుతున్నది.
Astra- Mark 2 180km పరిధి కలిగి ఉంది కానీ ఇంకా పరీక్ష దశలోనే ఉంది. Astra-Mark3 210km పరిధి కలిగి ఉంది కానీ 2027 చివరినాటికి కానీ సిద్ధం అవదు.
So..! PL 15 వల్ల మన దేశ సరిహద్దులలో AWACS విమానాలు, ఆకాశంలో ఇంధనం నింపే ట్యాంకర్ విమానాలు, ట్రాన్స్పోర్ట్ విమానాలు తిరగలేవు!
పాకిస్థాన్ JF-17 BLOCK III ఫైటర్ జెట్ KLJ -7A EASA రాడార్ తో అత్యంత శక్తివంతమైన ఫైటర్ జెట్ గా మారింది. JF-17 అనేది పాకిస్థాన్ భూభాగంలో ఉంటూనే మన సరిహద్దుల దగ్గర ఎగిరే మిరేజ్ 2000, SU-30 MKI ల మీదకి PL-15 లని ప్రయోగించగలదు.
JF-17 బ్లాక్ III ఫైటర్ జెట్ పాకిస్థాన్ కోసమే చైనా డిజైన్ చేసి తయారుచేసి ఇచ్చింది కానీ చైనా వీటిని వాడదు!
నిపుణులు అంటున్నది ఏమిటంటే 1947 నుండి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కంటే బలంగా ఉంటూ వస్తున్నది అని. భారత్ రాఫెల్స్ కొన్న తరువాతే ఈక్వేషన్స్ లో మార్పు వచ్చి ప్రస్తుతం భారత్ ది పైచేయిగా మారింది!
***********************
చైనా మరో సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది!
రెండు నెలల క్రితం ఆశిమ్ మునీర్ చైనాని సెకండ్ స్ట్రైక్ సౌకర్యం ఇవ్వమని ఒత్తిడి తెచ్చాడు!
సెకండ్ స్ట్రైక్ అంటే ఏమిటీ?
అణు దాడి చేయడంలో FIRST STRIKE మరియు SECOND STRIKE అనే రెండు దశలు ఉంటాయి.
ఫస్ట్ స్ట్రైక్ అంటే బాలిస్టిక్ మిసైల్ ని అణు వార్ హెడ్ తో శత్రు దేశం మీద దాడి చేయడం. ఇది పాకిస్థాన్ చేయగలదు!
సెకండ్ స్ట్రైక్ అంటే ఫస్ట్ స్ట్రైక్ చేసిన తరువాత శత్రు దేశం తిరిగి దాడి చేస్తే అణు ధార్మిక శక్తి వలన భూమి మీద నుండి దాడి చేయడం కష్టం! అటువంటి స్థితిలో సముద్రంలో ఉంటూ సబ్ మేరైన్ ద్వారా రెండో సారి శత్రు దేశం మీద ఆటమిక్ బాలిస్టిక్ మిసైల్ ని ప్రయోగించడాన్ని సెకండ్ స్ట్రైక్ కాపబిలిటీ అంటారు.
పాకిస్థాన్ కి సబ్ మెరైన్ ద్వారా అణు దాడి చేసే సామర్ధ్యం లేదు. సబ్ మెరైన్ ద్వారా సెకండ్ స్ట్రైక్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీతో పాటు దాడి చేయగల సబ్ మెరైన్ ని కూడా ఇవ్వమని చైనాని అడిగాడు ఆసిమ్ మునీర్!
చైనా ఇస్తుందా లేదా అన్నది తెలిసే అవకాశం ఉండదు, ఎందుకంటే సముద్రం అడుగున జరిగే విషయం ఇది!
టర్కీ: నిన్న టర్కీ తన డిస్ట్రాయర్ నౌకని పాకిస్థాన్ తీరానికి పంపింది! అఫ్కోర్స్! టర్కీ ఇప్పటికే తన బైరాక్టర్ TB2 డ్రోన్లని పాకిస్తాన్ కి సరఫరా చేసింది.
2023 లో బ్లాక్ సీ లో రష్యన్ ఫ్రీగెట్ అయిన మాస్కోవని బైరాక్టర్ TB2 తో దాడి చేసి ముంచేసిన విషయం తెలిసిందే!
సోషల్ మీడియాలో యుద్ధం కోసం పరితపించే వాళ్లు తెలుసుకోవాలసింది ఏమిటంటే విజయం భారత్ కి ఏకపక్షంగా ఉండబోదు అని!
రష్యా ఉక్రెయిన్ యుద్ధంలాగా భారత్ పాకిస్తాన్ యుద్ధం కూడా సంవత్సరాల తరబడి కొనసాగి భారత్ అభివృద్ధిని దెబ్బ తీయాలనే వ్యూహం దాగి ఉన్నది!
2022 లో రష్యా ఉక్రెయిన్ మీద దాడి మొదలుపెట్టిన తరువాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తనకి Strom Shadow మిసైల్స్ కావాలని అడిగిన రెండురోజులకే బ్రిటన్ తన వద్ద ఉన్న మిసైళ్ళని ఉక్రెయిన్ కి పంపించింది!
ఏప్రిల్ 22 న పహాల్గామ్ దాడి జరిగిన వెంటనే ఆసిమ్ మునీర్ PL -15 లాంగ్ రేంజ్ మిసైల్స్ కావాలని అడిగితే 25 న తన వద్ద ఉన్న ఎక్స్పోర్ట్ చేయకూడని వాటిని పాకిస్తాన్ కి పంపించాడు జిన్ పింగ్!
పూర్తి స్థాయి యుద్ధం జరిగితే రోజుకి 70 వేల నుండి లక్ష కోట్ల రూపాయలు వరకూ ఖర్చు అవుతుంది!
మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రారు. క్షణాలలో లక్షల కోట్ల రూపాయలు స్టాక్ మార్కెట్ నుండి వెనక్కి వెళ్ళిపోతాయి!
అందుకే అన్నీ ఆలోచించి అప్రమత్తంగా ఉంటున్నారు మోడీ!
పాకిస్తాన్ కి అన్నీ విధాల రహస్యంగా చైనా సహాయం చేస్తుంది అన్నది స్పష్టంగా కనిపిస్తున్నది!
పుతిన్ రెండు లేదా మూడు రోజులలో తన స్పెషల్ మిలిటరీ యాక్షన్ పూర్తవుతుంది అని భావించాడు కానీ మూడేళ్లు అయినా ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది.
ఎప్పుడు ఏ దేశం ఎలా ప్రవర్తిస్తుందో తెలీదు!
డోనాల్డ్ ట్రంప్ కి వ్యతిరేకంగా డీప్ స్టేట్ చైనాతో చేతులు కలిపితే భారత పాకిస్తాన్ యుద్ధం కూడా ఎటూ తేలదు ఈ సారి!
Share this Article