Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

భార్య చచ్చిపోతున్నా పట్టని నెహ్రూ… ఓ వాట్సప్ స్టోరీ, నిజానిజాలు…

April 3, 2025 by M S R

.

వాట్సప్ గ్రూపుల్లో, ఫేస్‌బుక్‌లో ఓ స్టోరీని మళ్లీ వైరల్ చేస్తున్నారు… చదివితే కొన్ని డౌట్లు వస్తాయి, సర్క్యులేట్ చేస్తున్నవారి ఉద్దేశాల గురించి… ముందుగా ఆ స్టోరీ చదవండి…

నెహ్రూ గురించిన ఈ సత్యాన్ని మరచిపోయే ప్రజలు మర్చిపోయి ఉండవచ్చు!!
…… భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ భార్య కమలా నెహ్రూ మరణం వెనుక ఉన్న నిజం చెప్పలేని కాంగ్రెస్, కమ్మీ సభ్యులు మోడీ తన భార్యను ఎందుకు విడిచిపెట్టారని అడుగుతారు…

Ads

నెహ్రూ భార్య కమలా నెహ్రూకు టీబీ ఉండేది. ఆ రోజుల్లో టీబీ భయం నేటి ఎయిడ్స్ లాగే ఉంది అది. ఎందుకంటే అప్పుడు టీబీకి చికిత్స లేదు మరియు ఆ వ్యక్తి కొంచెం కొంచెంగా బాధతో కృశిస్తూ పూర్తిగా కరిగిపోతాడు, అతను అస్థిపంజరంలా చనిపోతాడు. …. మరియు ఏ టీబీ రోగి దగ్గరకు కూడా వెళ్ళలేరు ఎందుకంటే టీబీ శ్వాస ద్వారా వ్యాపిస్తుంది.

TB బాధితులుగా మారిన ప్రజలని ఒక కొండ ప్రాంతంలోని శానిటోరియంలో చేర్చేవారు… కానీ నెహ్రూ తన భార్యను ప్రేగ్ నగరంలోని యుగోస్లేవియాకు పంపారు [నేడు చెక్ రిపబ్లిక్] మరొక వ్యక్తితో. అక్కడ ఆమె ఒక శానిటోరియంలో చేర్చబడ్డారు.

TB శానిటోరియంలో ప్రతి క్షణం మరణం కోసం ఎదురుచూస్తూ కమలా నెహ్రూ పదేళ్లు ఒంటరిగా ఉన్నారు. కానీ నెహ్రూ ఢిల్లీలో ఉన్నాడు మరియు ఎడ్వినా బెంటన్‌తో సరసాలాడుకుంటూ!
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ కాలంలో నెహ్రూ చాలాసార్లు బ్రిటన్ వెళ్ళాడు కానీ ఒక్కసారి కూడా తన భార్య ఆరోగ్యం గురించి విచారించడానికి ప్రేగ్ వెళ్ళలేదు.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు ఈ విషయం తెలియగానే, ఆయన ప్రేగ్ వెళ్లి అక్కడి వైద్యులతో మెరుగైన చికిత్స గురించి మాట్లాడారు… స్విట్జర్లాండ్‌లోని బుసాన్ నగరంలో ఆధునిక టిబి ఆసుపత్రి ఉందని, అక్కడ ఆమెకు మంచి చికిత్స అందించవచ్చని ప్రేగ్ వైద్యులు చెప్పారు.

వెంటనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆ సమయంలో 70 వేల రూపాయలు సేకరించి విమానంలో స్విట్జర్లాండ్‌లోని బుసాన్ నగరంలోని ఆసుపత్రికి పంపారు. కానీ కమలా నెహ్రూ నిజానికి తీవ్రంగా బాధపడింది. గత పదేళ్లుగా తన భర్త తన యోగక్షేమాలు విచారించడానికి రాలేదని, అపరిచితులు తనను జాగ్రత్తగా చూసుకుంటున్నారని ఆమె బాధపడింది.

రెండు నెలలు బుసాన్‌లో చేరిన తర్వాత, కమలా నెహ్రూ ఫిబ్రవరి 28, 1936న బుసాన్‌లోనే మరణించారు.
తన మరణానికి పది రోజుల ముందు, నేతాజీ నెహ్రూకు టెలిగ్రామ్ పంపి వెంటనే బుసాన్ కు రమ్మని కోరాడు కానీ నెహ్రూ రాలేదు. అప్పుడు నెహ్రూకు తన భార్య మరణవార్తను తెలియజేస్తూ ఒక టెలిగ్రామ్ పంపబడింది కానీ నెహ్రూ తన భార్య అంత్యక్రియలకు కూడా రాలేదు.

చివరికి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్విట్జర్లాండ్‌లోని బుసాన్ నగరంలో నెహ్రూ భార్య కమలా నెహ్రూ అంత్యక్రియలు నిర్వహించారు. నిజానికి, వామపక్ష చరిత్రకారులు ఈ సత్యాన్ని చరిత్ర పుటల నుండి అదృశ్యం చేశారు…



ఇదీ సదరు స్టోరీ… ఏమయ్యా గ్రోకూ నీకేమైనా తెలుసా ఈ కథ అనడిగితే… సింపుల్‌గా తేల్చేసింది ఇలా…

‘‘స్విట్జర్లాండ్‌లోని లుసానేలో 1936లో కమలా నెహ్రూ మరణించింది… 1930 నుంచే ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది… తరచూ ఆమెను స్విట్జర్లాండ్, జర్మనీలోని శానిటోరియాల్లో చికిత్స కోసం తిప్పేవారు… 1935లో ఆమె పరిస్థితి మరీ క్షీణించేసరికి చికిత్స కోసం జర్మనీలోని బాడెన్‌వీలర్‌కు సుభాష్ చంద్రబోస్ తరలించాడు…

అప్పుడు ఆమె భర్త జైలులో ఉన్నాడు… నెహ్రూ 1935 అక్టోబరులో రిలీజయ్యాక వెంటనే యూరప్‌లో ఉన్న తన భార్య దగ్గరికి వెళ్లాడు… బాగోగులు చూసుకోవడానికి… మరణించే సమయానికి ఆమె వయస్సు 36 సంవత్సరాలు… ఆమె అంత్యక్రియల్ని కూడా లుసానేలోనే జరిపించేశారు…’’ ఇదీ అసలు కథ…

అంటే అర్థమేమిటి..? కావాలని నెహ్రూ కుటుంబం మీద సాగించే దుష్ప్రచారంలో భాగంగానే పైన చెప్పిన వాట్సప్ స్టోరీలు అన్నమాట… ఎస్, నెహ్రూ రసపురుష్… అందరికీ తెలిసిందే… ప్రత్యేకించి ఇంగ్లిష్ భామల మీద అనురక్తి… కానీ భార్యను చిన్నచూపు చూశాడు, ఆమె చస్తున్నా సుభాష్ చంద్రబోస్ తప్ప తను మాత్రం పట్టించుకోలేదు… చివరకు చచ్చినా వెళ్లలేదు అనే కల్పన మాత్రం దుర్మార్గం… ఇలాంటి బురద మాత్రం సరైనది కాదు…!!

ఐతే అదే సుభాష్ చంద్ర బోస్ పట్ల… తను లేనప్పుడు తన భార్య ఆరోగ్యాన్ని పట్టించుకుని, నిజమైన శ్రేయోభిలాషిగా వ్యవహరించిన అదే నేతాజీ పట్ల సోకాల్డ్ గాంధీ, నెహ్రూ అండ్ అదర్స్ ఎంత దారుణంగా వ్యవహరించారనేది వేరే కథ..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions