.
Pardha Saradhi Upadrasta …… చమురు యుద్ధాల వాస్తవం | చివరికి అన్నీ వ్యాపారమే
అమెరికన్ ఆయిల్ కంపెనీలు వెనిజులాలో చమురును శుద్ధి చేసినా — అది ఎవరో ఒకరు కొనాల్సిందే. ఆ కొనుగోలు శక్తి ఉన్న అత్యంత పెద్ద మార్కెట్ ఎవరు? భారత్.
భారత్ ప్రపంచంలోనే ఒక పెద్ద ఆయిల్ కన్స్యూమర్ మార్కెట్, ప్రపంచ దేశాలు భారత్ ను కాదు అనలేవు.
Ads
సుంకాలు ఉన్నా సరే — భారత్ రష్యా నుంచీ చమురు కొనుగోలు కొనసాగిస్తోంది. ఇతర దేశాల నుంచీ అలాగే., డైవర్సిఫికేషన్ మన శక్తి. ఈ ఆయిల్ మార్కెట్‌ను ఇంకా విస్తరిస్తూనే ఉంటాం.
మరొక కీలక అంశం
- మన భారత ప్రభుత్వ సంస్థ ONGC Videsh Limited (OVL) వెనిజులాలోని ప్రపంచంలోనే అతిపెద్ద హెవీ ఆయిల్ నిల్వల ప్రాంతమైన Orinoco Oil Belt లో 2000 – 2010 ల మధ్య భారీ పెట్టుబడులు పెట్టింది.
PDVSAతో కలిసి Joint Venture ప్రాజెక్టులు బిలియన్ల డాలర్ల విలువైన భారత పెట్టుబడి, ఉత్పత్తి హక్కులు (equity oil rights) భారత్‌కి అనుకూలంగానే ఒప్పందాలు జరిగాయి. తరువాత వారి ఆయిల్ బావుల జాతీయీకరణ వల్ల, తరువాత అమెరికా ఆంక్షల వల్ల ఉత్పత్తి, లాభాలు తాత్కాలికంగా ఆగిపోయాయి. కానీ పెట్టుబడులు, ఒప్పందాలు రద్దు కాలేదు., ఆయిల్ రిజర్వులు అక్కడే ఉన్నాయి.
పరిస్థితి మారితే ఏమవుతుంది?
మడురో తర్వాత ప్రభుత్వం వస్తే లేదా ఆంక్షలు ఎత్తివేస్తే — ONGC పెట్టిన మన పెట్టుబడులపై ఉత్పత్తి తిరిగి ప్రారంభం. భారత్‌కు equity oil లభ్యం. అంటే మన డబ్బుతో పెట్టిన మన చమురే మళ్లీ మనకే.
- అమెరికా కంపెనీలతో పాటు మనం కూడా చమురు తవ్వుకుంటాం. ఇంకా సూటిగా చెప్పాలి అంటే అమెరికా మీద స్థానికులకు ఉన్నంత కోపం భారత్ మీద ఉండదు. స్థానికులు భారత్ కు సహకరిస్తారు. రేప్పొద్దున వీటన్నిటిలో అమెరికా భారత్ సహకారం అడిగినా ఆశ్చర్యం లేదు.
మనకు man power ఉంది, అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. మన జోలికి ఎవరు రారు. అఫ్గానిస్థాన్ లో మాంచి యుద్ధం జరుగుతున్న రోజుల్లోనే భారత కంపెనీలు ఎంటర్ అయ్యి అభివృద్ధి ప్రాజెక్ట్ లు చేశాయి. మన జోలికి ఎవరూ రాలేదు, పైగా స్థానికులు మనకు రక్షణగా ఉన్నారు., తాలిబన్ లు కూడా భారతీయుల జోలికి రాలేదు. మన బలం అదే.
చివరికి నిజం ఒక్కటే భావోద్వేగాలు కాదు, సిద్ధాంతాలు కాదు, ఇది అంతా వాణిజ్యం, జియో పాలిటిక్స్..
One-Line Strategic Takeaway
భారత్ దృష్టిలో, మడురో తరువాతి వెనిజులా — తక్కువ రిస్క్, ఎక్కువ లాభం, ఇంధన భద్రత ఇంకా పెరుగుతుంది, ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గుతుంది, అమెరికాతో సంబంధాలు బలపడతాయి, చైనా వ్యూహాత్మక స్థలం నెమ్మదిగా కుదించబడుతుంది — ఇదంతా భారత్ ఒక్క అడుగు వేయకుండానే.
మనకు అందరూ కావాలి, మన మార్కెట్, మన స్వతంత్రత, మన ఆర్థిక వ్యవస్థ, మన కన్స్యూమర్ మార్కెట్ అందరికీ కావాలి. మనం ఎవరితో అనవసరంగా సున్నం పెట్టుకోము. మన జోలికి వస్తె ఊరుకోం. నిశ్శబ్దంగా మన పని మనం చేసుకుంటూ పోతాం. తాటాకు చప్పుళ్లకు ఆదరం, అసలు బెదరము. అద్ది లెక్క…….. — ఉపద్రష్ట పార్ధసారధి
#OilPolitics #EnergySecurity #IndiaFirst #Geopolitics #RussiaOil #VenezuelaCrisis #ONGC #GlobalTrade #pardhatalks
Share this Article