జనగామ ముత్తిరెడ్డి నుంచి కోరుట్ల విద్యాసాగరుడి దాకా……. ఇంతటి సూపర్ ఎమ్మెల్యేలకు నాయకుడిగా ఉన్న కేసీయార్ ధన్యుడు… తెలంగాణ సమాజం అత్యంత ధన్యం… రేప్పొద్దున కేసీయార్ నిర్వహించే హోమం దగ్గరకు రమ్మంటే… ఏం, మా ఊళ్లో మేం హోమాలు చేసుకోలేమా, ఈయన పిలవగానే ఎగేసుకుని పోయి, ఆయన పెట్టిన ప్రసాదం తిని రావాలా అంటారేమో… హహహ… తాజాగా ఓ వార్త చూస్తే అలాగే అనిపించింది… కేసీయార్ పట్ల జాలి కూడా వేసింది… ఒకవైపు పాత మెదక్ జిల్లా ఎమ్మెల్యే క్రాంతి తనే టూవీలర్ల మీద తిరుగుతూ, అయోధ్య రాముడి గుడికి చందాలు సేకరిస్తున్న ఫోటోలు చూస్తూ… భలే పొలిటికల్ స్ట్రాటజీ అనుసరిస్తున్నారే అని మెచ్చుకునేలోపు… ఇదుగో, ఈ కోరుట్ల విద్యాసాగరుడి వార్త కనిపించింది… ఏదో గొర్రెల పంపిణీ ప్రోగ్రాములో పాల్గొన్న సారు గారు… ‘‘రామమందిర నిర్మాణానికి ఎవ్వడూ విరాళాలు ఇవ్వొద్దు… ఏం, మన ఊళ్లో గుళ్లు లేవా..? ఆ దిక్కుమాలిన అయోధ్య రాముడి గుడి మనకెందుకు..?’’ అన్నట్టుగా మాట్లాడాడట… ఏం..? బొట్టు పెట్టుకుంటేనే భక్తులమవుతామా అని కూడా ప్రవచన ప్రసంగం చేశాడట…
హబ్బ… కేసీయార్‌కు బలం, బలగం… ఇదుగో ఇలాంటి నేతలు… ఎంతటి పరిపక్వత..? నిజంగానే కేసీయార్ ఎంత లక్కీ… వీళ్లను మోస్తూ, గెలిపిస్తూ… ఫాఫం… అటు ఢిల్లీలో వంగీ వంగీ రాజీలు పడుతూ..!! అసలు బాసు ఏం ఆలోచిస్తున్నాడో, ఏం అడుగులు వేస్తున్నాడో కూడా వీళ్లకు తెలియదు… చెప్పేవాళ్లు ఉండరు, చెప్పినా వినేవాళ్లు ఉండరు… మెచ్యూర్డ్ ఆలోచనలు ఉండవు… దేశంలో చాలామంది ప్రతిపక్ష నాయకులే అయోధ్యకు చందాలు ఇస్తూ ప్రచారం చేసుకుంటున్నారు… ఎందుకంటే..? రాముడి గుడి బీజేపీకి రాజకీయంగా ఉపయోగపడకుండా చూడటానికి… ఇక రాముడి గుడి రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు… కనీసం ఈమాత్రం ఆలోచించే స్థాయి కూడా లేదా కేసీయార్ బలగానికి, దళానికి..? ఈ కోరుట్ల వారి ఇంటిపేరు కూడా కల్వకుంట్ల… పెద్ద సారు గారికి ఏదో చుట్టరికం కూడా… గుడి పేరు మీద బీజేపీ బిచ్చం ఎత్తుకుంటున్నది అట…!! బండి సంజయ్ అన్నా, నీకన్నా ఇదుగో ఇలాంటి వాళ్ళే రేప్పొద్దున బీజేపీ ఓట్లు పెంచేది…
Ads
ఒక దిగ్విజయ్ సింగ్ లక్ష రూపాయల చందా ఇచ్చాడు అయోధ్యలోని రాముడి గుడికి… ఎందుకు..? తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య లక్ష రూపాయల్ని రాష్ట్రపతి ద్వారా విరాళం ఇచ్చాడు… ఎందుకు..? ఇదే టీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి రెండు లక్షలు ఇచ్చాడు ఎందుకు..? ఇవి ఆలోచిస్తే ఈ విద్యాసాగరుడికి అసలు తత్వం బోధపడేది… ఢిల్లీ వెళ్లొచ్చాక కేసీయార్ సైలెంట్ ఎందుకు అయిపోయాడో కాస్త థింక్ చేస్తేనయినా అర్థమయ్యేది… ఆయుష్మాన్ భారత్, అగ్రిచట్టాలకు సై… ఇప్పుడు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లకూ సై… గులాజీ రంగు క్రమేపీ కాషాయంలోకి ఎందుకు మారుతుందో కాస్త ఆలోచిస్తే నిజాలేమిటో అర్థమయ్యేది… అవన్నీ ఏమీ లేకుండా… నాన్సెన్స్, ఆ గుడికి ఎవడు చందా ఇస్తాడు అని వీరంగం వేయడం అంటే… ఏదో కావాలనే కేసీయార్ కాళ్లకు కట్టెలు అడ్డం పెడుతున్నట్టుగా ఉంది… అయ్యా, పెద్ద సారూ… ఇదీ నీ ఎమ్మెల్యేల ఆలోచన స్థాయి…!!
Share this Article