.
ఎస్.., మిస్ వరల్డ్ పోటీలకు ’జరూర్ ఆనా జరూర్ ఆనా’ అనే స్లోగన్ తీసుకుని, జాడించి తన్నించుకున్నటు అయిపోయింది ఇప్పుడు… అంతర్జాతీయ ఖ్యాతి అనుకుంటే విశ్వవీథుల్లో ఇజ్జత్ బర్బాద్ అయిపోయింది…
పోటీల నుంచి అర్థంతరంగా తప్పుకుని లండన్ చెక్కేసిన మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ చేసిన ఒక్క వ్యాఖ్య చాలు మనం సిగ్గుతో తలదించుకోవడానికి..! ‘‘మేం మిస్ వరల్డ్ పోటీలకు వచ్చామా..? దేనికొచ్చామో తెలియడం లేదు… మరీ వేశ్యల్లా చూస్తున్నారు కంటెస్టెంట్లను..’’
Ads
అబ్బే, అదంతా మిస్ వరల్డ్ పోటీల సంస్థ నిర్వాకం, ప్రభుత్వానికి ఏం సంబంధం అని తప్పించుకోవడానికి కూడా వీల్లేదు… అదీ చెప్పుకుందాం… ముందుగా ఆమె ఇంకా ఏమన్నదో చదవండి… బ్రిటన్ పత్రికలు కంపు కంపు చేస్తున్నాయి ఇప్పటికే…
‘‘ఈ పార్టీలు ఏమిటో, పర్యటనలు ఏమిటో, ఎండల్లో బస్సుల్లో తిప్పడం ఏమిటో తెలియడం లేదు, అసలు మిస్ వరల్డ్ అవుట్ డేటెడ్ పోటీలు అయిపోయాయి… స్పాన్సరర్లను, అతిధులను అలరించడానికా మేం పోటీలకు వచ్చింది… సో, విలువలు లేని చోట మనసు చంపుకుని ఉండలేను, నేనే పోటీల నుంచి తప్పుకుంటున్నా’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది ఆమె…
‘‘తెలంగాణ పై గౌరవం పెరిగింది.., తెలంగాణ అతిధ్యం బావుంది… కానీ గెస్టులు అంటూ తీసుకొచ్చి టేబుల్ కు గెస్టులు నలుగురిని, మాలో ఇద్దరినీ కేటాయించి ఎంటర్-టైన్ చేయాలనడం, బ్రేక్ ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు ఈ అతిధి మర్యాదలు చేయమనడం, ఫ్యాషన్ (బాల్) గౌన్లు ధరించమనడం ఏమిటి..? 24 గంటలు మేకప్ లోనే ఉండాల్సి వస్తోంది! హెక్టిక్ షెడ్యూల్, మిస్ వరల్డ్ అంటేనే విరక్తి వచ్చేలా చేశారు’’ అని కంట తడిపెట్టుకుంది మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ!
నో, నో, అవి తప్పుడు ఆరోపణలు అంటోంది మిస్ వరల్డ్ CEO జూలియా… ‘‘ఆమె ఆరోపణలు తప్పు, తన తల్లికి ఆరోగ్యం బాగాలేకపోతే, తప్పనిసరిగా వెళ్లిపోతానని అడిగితే మేమే వెనక్కి పంపించేశాం, కుటుంబం ముఖ్యం కదా, ఆమె బదులుగా మిస్ ఇంగ్లండ్ పోటీల ఫస్ట్ రన్నరప్ షార్లీని ఆ దేశమే పంపించింది… మొన్నటిదాకా మిల్లా చాలా పాజిటివ్‌గా మాట్లాడి, లండన్ వెళ్లగానే ఈ ఆరోపణలు చేస్తోంది’’ అని సమర్థించుకునే ప్రయత్నం చేసింది…
కానీ తల్లి ఆరోగ్యం బాగాలేదనే సాకు చెప్పి మిల్లా వెళ్లిపోయినట్టు బ్రిటన్ పత్రికల కథనాలు… అసలు ఏం జరుగుతోంది..? స్మితా సబర్వాల్ ఈ మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్‌ను ఎంపిక చేయించడం, ముందస్తు కసరత్తు, ఏర్పాట్ల వరకూ బండి సాఫీగా నడిచింది… సరే, ఆమెను వేరే నాన్ ఫోకల్ పోస్టుకు పంపించడంతో ఈ మిస్ వరల్డ్ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది… తరువాత ఎవరు టేకప్ చేశారో తెలియదు…
ఈవెంట్‌కు సరిపడా ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవు, అక్కడొచ్చాయి అసలు తిప్పలు… ఖజానా సిట్యుయేషన్ గురించి రేవంత్ రెడ్డి తనే చేసిన వ్యాఖ్యలు ఓసారి గుర్తు చేసుకొండి… సరే, స్పాన్సరర్లను వెతుక్కుని ఈవెంట్ ఏదోలా ముగించేద్దాం అనుకున్నారు మిస్ వరల్డ్ నిర్వాహకులు… కానీ అడుగడుగునా ప్రభుత్వ ముఖ్యుల జోక్యం, పెత్తనాలు సిట్యుయేషన్‌ను పెంట పెంట చేశాయి… మరీ ప్రభుత్వం అధికారికంగా విందు ఇచ్చిన చౌమహల్లా ప్యాలెసులో కూడా ప్రభుత్వ ముఖ్యుల వ్యవహారశైలితో కంటెస్టెంట్లు తెగ చిరాకు పడ్డారని కూడా వినిపించింది…
నిజంగానే మిస్ వరల్డ్ కంటెస్టెంట్లను ఎటుపడితే అటు తిప్పారు, చూసేవాళ్లకే విసుగొచ్చేలా… అదీ తెలంగాణలో మాత్రమే… ఇది తెలంగాణ ఈవెంట్ కాదురా బాబూ, ఇండియాకు బ్రాండ్ ఇమేజ్ రావాలి కదా అని అడిగినవారు లేరు… పోనీలే, తెలంగాణ కల్చర్, టూరిస్ట్ పాయింట్లకు మంచి విశ్వప్రచారం వస్తుందిలే, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ పెరుగుతుందిలే అనుకున్నారు అందరూ…
కానీ మరీ అంతగా తిప్పాలా..? ఇక స్పాన్సరర్ల మెప్పు కోసం, వాళ్లను శాటిస్‌ఫై చేయడం కోసం పార్టీలు, ఈ కంటెస్టెంట్లతో టేబుళ్ల దగ్గర మాటామంతీ మరీ ఓవర్ అయిపోయింది… మరీ చిల్లర పోటీలకూ దింపారు… అదేదో ట్రైడెంటు హోటళ్లో మరీ పూరీలు చేయించడం ఏమిటి…? గలీజ్ ఐటమ్ సాంగ్స్ పాడించడం ఏమిటి అనే విమర్శలు, పెదవి విరుపులు ఈవెంట్‌ను క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తున్నవాళ్ల నుంచి వినిపించాయి…
‘జీతెలుగు, స్టార్‌మా, ఈటీవీల్లో వచ్చే కిట్టీపార్టీల వంటి ప్రోగ్రాముల స్థాయికి దింపేశారు మరీ మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల ఈవెంట్లను…’ అనే విమర్శ కూడా వినవచ్చింది…
ఫస్ట్, గవర్నమెంట్ ఈవెంట్ మేనేజ్‌మెంట్‌కి కమిట్మెంట్ ఇచ్చినా, టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద వెనక్కి వెళ్ళింది… లిటరల్ గా ఎటూగాకుండా మధ్యలో వదిలేసింది… ఓన్లీ, ఎక్కడైతే పబ్లిసిటీకి పనికి వస్తారో అక్కడే వాళ్ళను వాడుకుంటున్నారు… ఆ ఈవెంట్ మేనేజమెంట్ వాళ్ళకి అనుకున్నట్టు స్పాన్సరర్స్ రాలేదు…
దానివల్ల మొత్తం ఫ్లో అఫ్ ఈవెంట్స్ లో కంటెస్టెంట్లను తోలుబొమ్మల్లా మార్చారు… అదుగో అందులో నుంచి వచ్చిన ఫ్రస్ట్రేషన్నే మిస్ ఇంగ్లండ్ విమర్శలు… సో, ఏం జరిగింది…? విశ్వఖ్యాతి బదులుగా విశ్వఅపఖ్యాతిని మూటగట్టుకుని… ఏ సిటీ బ్రాండ్ ఇమేజీ కోసం అన్నారో, సరిగ్గా దాన్నే చేజేతులా అసమర్థ నిర్వహణతో దెబ్బకొట్టుకున్నాం..!!
ఫార్ములా-ఈ రేసు కూడా డిజాస్టర్ మేనేజమెంట్… మనం వేసిన ట్రాకులకి చాలా యాక్సిడెంట్స్ జరిగి, కార్ స్పీడ్ తగ్గించి పార్టిసిపేట్ చేసారు.., అందుకే సెకండ్ ఇయర్ హైదరాబాద్ ని లిస్టులో నుంచి తీసేసారు..!! ఇంటర్నేషనల్ ఈవెంట్స్ మన వల్ల కాదు..!!
Share this Article