స్వదేశీ కంపెనీ అయితే… ఇక్కడ సంపాదించిన ప్రతి పైసా మళ్లీ ఇక్కడే ఏదో ఓ రంగంలో ఇన్వెస్ట్ చేయబడుతుంది… అది ఈ దేశ ఎకనమిక్ యాక్టివిటీ పెరగడానికి ఉపయోగపడుతుంది… అంటే ఇక్కడే వినియోగించబడుతుంది… కానీ విదేశీ కంపెనీలు, బహుళజాతి కంపెనీలు అయితే..? ఇక్కడి సహజ వనరులు, ఇక్కడి మానవ వనరులతో ఇక్కడే డబ్బు సంపాదించి, ఆ డబ్బును తమ దేశాలకు తరలించుకుంటాయి… అవి ఆ దేశాల ఎకనమిక్ యాక్టివిటీకి దోహదపడుతుంది… సో, ప్రభుత్వాలు ఉచితంగా ఎకరాలకొద్దీ జాగా ఇస్తుంటయ్, పన్ను రాయితీలు ఇస్తుంటయ్, నీళ్లు-కరెంటు కారుచౌక రేట్లకు అందిస్తుంటయ్.., ఇక్కడ ఫలానా పెద్ద పెద్ద కంపెనీలు ఆఫీసులు పెట్టినయ్ చూశారా, మేం ఎన్ని పెట్టుబడులు ఆకర్షించామో అని ప్రభుత్వాలు గొప్పగా చెప్పుకుంటుంటయ్, కానీ అల్టిమేట్‌గా వచ్చే ప్రయోజనం ఎంత అనేది పెద్ద ప్రశ్న…
ఆయా కంపెనీలు మన యువతకు కల్పించే ఉపాధి లెక్కలు కూడా పెద్ద మాయ, పెద్ద నాటకం… ఏ కంపెనీ అయినా సరే, ఇక్కడి మార్కెట్‌ను వాడుకుంటది, 130 కోట్ల మంది వినియోగదారులున్న అతి పెద్ద మార్కెట్ కాబట్టి ఇక్కడే పాగా వేస్తది, అంతేతప్ప ఈ భూమి మీదో, ఈ జనం మీదో వీసమెత్తు ప్రేమ ఏమీ ఉండదు, అంతా దందా… అప్పట్లో బ్రిటిషోళ్లు మస్తు సంపదను తరలించుకుపోయారు అని పుస్తకాల్లో చిన్నప్పటి నుంచీ చదువుకుంటూనే ఉన్నాం… నిజానికి ఇప్పటికీ జరుగుతున్నది అదే… ఇక్కడి విస్తృతమైన వినియోగదార్ల మార్కెట్, నెట్‌వర్క్ విదేశీ కంపెనీల నెట్‌వర్త్‌ను పెంచుతూనే ఉంది… ఓ చిన్న ఉదాహరణ… నిన్న మనం చెప్పుకున్నదే…
Ads
గూగుల్, ఫేస్‌బుక్ కలిసి మన దేశంలో యాడ్ రెవిన్యూను దున్నేస్తున్నయ్… కరోనా పుణ్యమాని ఆ రెండు కంపెనీల ఆదాయం గత ఏడాది 29 శాతం పెరిగింది… మన దేశీయ టాప్ యాడ్ రెవిన్యూ మీడియా సంస్థలు తొమ్మది కంపెనీల ఉమ్మడి ఆదాయాన్ని మించి గూగుల్- ఫేస్‌బుక్ ఆర్జించాయి… టీవీలు, పత్రికలు ఇతర యాడ్ సోర్స్ ఎలా దెబ్బతింటున్నాయో, డిజిటల్ యాడ్స్ ఎలా పెరిగిపోతున్నాయో వివరంగా చెప్పుకున్నాం… అయితే గూగుల్, ఫేస్‌బుక్ ఆర్జించిన ఆదాయం ఎటుపోతోంది..? ఇదీ ప్రశ్న… ఆ డబ్బు మళ్లీ ఇక్కడే ఇన్వెస్ట్ చేయబడటం లేదు… మళ్లీ ఓ మాయదందాలో విదేశాలకు మన వేల కోట్ల రూపాయల డబ్బు ఎగిరిపోతోంది…
గూగుల్ ఏం చేస్తుంది..? గూగుల్ ఇండియా అని లోకల్‌గా ఓ కంపెనీ పెడుతుంది… అది గూగుల్ ఆసియా పసిఫిక్ అనే కంపెనీ నుంచి యాడ్ ఇన్వెంటరీ కొంటుంది… ప్రతిగా దానికి డబ్బు చెల్లిస్తుంది… సేమ్, ఫేస్‌బుక్ కూడా ఫేస్‌బుక్ ఇండియా అనే కంపెనీ పెడుతుంది, అది ఫేస్‌బుక్ ఐర్లండ్ అనే కంపెనీకి డబ్బు చెల్లిస్తుంది… అంటే డబ్బు విదేశాలకు ఎగిరిపోతోంది… అవి నిజానికి వాటి మాతృసంస్థలు, అనుబంధ సంస్థలే… 2020 ఆర్థిక సంవత్సరంలో గూగుల్ 10,070 కోట్లను ఇలా గూగుల్ ఆసియా పసిఫిక్ కంపెనీకి చెల్లించగా, గత ఏడాది 12,262 కోట్లను చెల్లించింది… 22 శాతం ఎక్కువ… ఫేస్‌బుక్ కూడా 2020లో 6067 కోట్లను ఫేస్‌బుక్ ఐర్లండ్‌కు చెల్లించగా, గత ఏడాది 8638 కోట్లను చెల్లించింది… అంటే 42 శాతం ఎక్కువ…
అంతిమంగా జరుగుతున్నది ఏమిటి..? మన డబ్బే వేల కోట్లు ఎక్కడెక్కడికో ఎగిరిపోతోంది అని అర్థం… చైనాలో ఏం జరుగుతుంది..? ఈ గూగుల్ ఉండదు, ఈ ఫేస్‌బుక్ ఉండదు, దానికి సొంతంగా ఆ దేశానికి సంబంధించి సెర్చ్ ఇంజన్లు, సోషల్ మీడియా కంపెనీలు ఉంటయ్, తద్వారా ప్రైవసీ సేఫ్, సామాజిక ఉద్రిక్తతలు రెచ్చగొట్టే చాన్స్ ఉండదు, తప్పుడు ప్రచారాలు ఉండవ్, అన్నింటికీ మించి ఆ స్వదేశీ కంపెనీలు సంపాదించే డబ్బు మళ్లీ చైనాలోనే ఖర్చుపెట్టబడుతుంది..! తేడా అర్థమైంది కదా..!!
Share this Article