నాయకులు పుడుతుంటారు, గిడుతుంటారు… కానీ కొందరి గురించి చదువుతుంటే ఆనందమేస్తుంది… నైతిక, వ్యక్తిగత జీవితాలకు సంబంధించి నిజంగా మన వర్తమాన భారతీయ నాయకులెంత అల్పులో కదా అనిపిస్తుంది… అందరూ అని కాదు… మెజారిటీ… వార్డు సభ్యులకు సైతం డబ్బు, పైరవీలు, ఆధిపత్యం, అట్టహాసం, ఆభిజాత్య ప్రదర్శన, ఎప్పుడూ వెంబడి జేజేలు కొట్టే వందిమాగధగణం… వాట్ నాట్..? లేని అవలక్షణం అంటూ ఉండదు… నోరిప్పితే బూతులు, సబ్జెక్టు ఉండదు, బుర్ర నిండా డొల్లతనం అదనపు లక్షణాలు… Venkateswara Rao Daggubati వాల్ మీద అనుకోకుండా ఓ ఆర్టికల్ కనిపించింది… ఆసక్తిగా సెర్చింగులోకి వెళ్తే ఇంకొన్ని వివరాలు… జర్మనీ మాజీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌కు సంబంధించిన ఆర్టికల్ అది… ఈమధ్య ఆమె రాజకీయాలకు స్వస్తి చెప్పినప్పుడు దేశప్రజలకు ఆమెకు వీడ్కోలు చెప్పిన తీరు ఆశ్చర్యం కలిగించింది కూడా…
ఏంజెలా మెర్కల్… 18 సంవత్సరాలపాటు 8 కోట్ల జనాభా ఉన్న జర్మనీని ఏలింది… అసలు జర్మనీ ఏమిటి..? జర్మనీ ఛాన్సలర్ హోదాలో ఏకంగా యూరోపియన్ యూనియన్‌కే పెబ్బ… ఆమె చెప్పేదే జరిగేది… అంతటి అధికారాన్ని కలిగిన ఆమె చాలా సింపుల్ జీవితాన్ని గడిపినట్టుగా వచ్చిన వార్తలు, కథనాలు విస్తుగొలుపుతాయి మనల్ని… 1954లో పుట్టిన ఆమె నాలుగు టరమ్స్ చాన్సలర్‌గా చేశాను కదా, ఇక చాలు అనుకుని తనే వదిలేసింది రాజకీయాల్ని… ఆమె పదవీ విరమణ సందర్భంగా దేశ ప్రజలు ఆరు నిమిషాలపాటు బాల్కనీల్లో, కిటికీల వద్ద, వీథుల్లో నిలబడి చప్పట్లు కొడుతూ వీడ్కోలు పలికారు… ప్రజలు ఆమె పట్ల చూపించిన ఆ అభిమానానికి కొలమానం ఎక్కడుంది..? నిజానికి ఆమె సైంటిస్టు… తరువాత రాజకీయాల్లోకి వచ్చింది… సక్సెసైంది… ఎంత అంటే.. ఫోర్బ్స్ పత్రిక కనీసం పదిసార్లు ప్రపంచంలోకెల్లా పవర్ ఫుల్ వుమన్ అని ప్రకటించింది ఆమెను…
Ads
పుట్టింది హాంబర్గ్… కానీ పుట్టిన కొన్నాళ్లకే తూర్పు జర్మనీ వెళ్లారు ఆమె పేరెంట్స్, అక్కడే చదివింది… స్టూడెంట్స్ డిస్కోల్లో బార్ టెండర్‌గా కూడా పనిచేసింది… టీచర్ అవుదామనుకుంది, క్వాంటమ్ కెమెస్ట్రీలో డాక్టరేట్ చేసి, సైంటిస్ట్ అయిపోయింది… రెండు జర్మనీల నడుమ బెర్లిన్ గోడ కూలిపోయాక రాజకీయాల్లోకి వచ్చింది… తూర్పు జర్మనీలో స్టాసి అనే సీక్రెట్ పోలీస్ దళాలు ఉండేవి… వాటి అరాచకాలు బోలెడు… అందులోకి ఆమెను రమ్మన్నారు, కానీ ఆమె తమాయించుకుంది… లేకపోతే తన రాజకీయ జీవితానికి అది పెద్ద అడ్డంకిగా మారి ఉండేది… ఆమె అసలు పేరు ఏంజెలా కాస్నర్… మొదటి భర్త ఉల్‌రిచ్ మెర్కల్ పేరులోని మెర్కల్‌ను తన సర్‌నేమ్‌గా మార్చుకుంది… విడాకులు… తరువాత భర్త పేరు జొయాచిమ్ సార్… తను ప్రొఫెసర్… తెరమీదకు రావడానికి, ప్రచారానికి ఇష్టముండదు…
అసలు ఆమె తన వ్యక్తిగత గుర్తింపు కోసం ఎప్పుడూ ప్రయత్నించలేదు… తన ఫోటోలు ప్రభుత్వ పథకాల ప్రచారాల్లో కనిపించేవి కావు… తన రాజకీయ విధాన నిర్ణయాలపై విమర్శలున్నాయి… అంతేతప్ప అధికార దుర్వినియోగమో, అవినీతి ఆరోపణలో లేవు… బంధువుల్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో పెట్టడం, భారీగా జీతాలు తీసుకోవడం, అట్టహాసపు ప్రభుత్వ భవనాల్లో నివసించడం, చాకిరీ చేయడానికి సేవకుల్ని పెట్టుకోవడం వంటివి ఏమీ లేవు… చాన్సలర్‌గా ఆమె సంపాదించుకున్నది కూడా ఏమీ లేదు… కార్లు లేవు, స్థలాలు కొనలేదు, ప్రైవేటు జెట్లు కొనలేదు… అంతెందుకు..? చాన్సలర్ కావడానికి ముందు ఏదయితే అపార్ట్‌మెంటులో ఉండేవాళ్లో, తరువాత కూడా అక్కడే ఉండేవాళ్లు… ఎడాపెడా ఆడంబరాలు, దుస్తులు, నగలు గట్రా మోజు లేదు ఆమెకు…
ఏమిటమ్మా, ఇలా ఎప్పుడూ ఈ డ్రెస్సులేనా అని ఎవరో విలేకరి అడిగితే… నేనేమైనా మోడల్‌నా..? ప్రభుత్వ ఉద్యోగిని అని బదులిచ్చింది… రోజూ పొద్దున్నే తనే భర్తకు బ్రేక్ ఫాస్ట్ ప్రిపేర్ చేసేది… పనిమనుషులు ఎవరూ లేరు… ఇంటి పనీ, వంట పనీ భార్యాభర్తలు షేర్ చేసుకునేవాళ్లు… బట్టలు ఉతుక్కోవడం సహా…! చివరకు పొరుగువారికి ఇబ్బంది కలగకూడదని రాత్రిళ్లు వాషింగ్ మెషిన్ ఉపయోగించేవాళ్లు… థాంక్ గాడ్, పక్కనున్న ఫ్లాట్లకూ మాకూ నడుమ గోడలు మందంగానే ఉండేవి అని ఓసారి జోక్ చేసి నవ్వేసింది విలేకరులతో మాట్లాడుతూ… అపరిమితమైన అధికారం ఉండీ… వాటితో వందశాతం డిటాచ్డ్‌గా ఉండగలగడం చాలా కష్టం… ఒక్కసారి మన చుట్టూ ఉన్న మన నేతలతో పోల్చి చూడండి… ఆమెను అభినందిస్తూ చప్పట్లు కొట్టాలనిపిస్తోంది కదా… దటీజ్ ఏంజెలా..!!
Share this Article