Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఘర్షణలో నష్టాలు సహజం… కానీ మనం 100 % అప్పర్ హ్యాండ్ సాధించాం…

June 2, 2025 by M S R

.

No డౌట్! రాఫెల్ 4.5++++ జెనరేషన్ ఫైటర్ జెట్!
చైనా తయారీ J 10 C అనేది 4.5 జెనరేషన్ ఫైటర్ జెట్ కాబట్టి రాఫెల్ నష్టపోక ఉండవచ్చు.
ఎందుకంటే మన దగ్గర ఉన్న Su-30 MKI, MIG-29UPG, మిరేజ్ 2000 లకి తమని తాము రక్షించుకోవడానికి టార్గెటింగ్ పోడ్ మాత్రమే ఉంటుంది అంటే బేసిక్ మరియు సెమీ అడ్వాన్స్ ఎలక్ట్రానిక్ జామింగ్ పోడ్ లు ఉంటాయి.

మనం కొన్నప్పుడు బేసిక్ ఎలక్ట్రానిక్ జామింగ్ పోడ్ లతోటే అవి వచ్చాయి. సుఖోయ్, మిగ్, మిరేజ్ లు 30 ఏళ్ళ పాతవి కాబట్టి వాటిని కొన్నప్పుడు డిఫాల్ట్ గా జామింగ్ పొడ్స్ తో వచ్చాయి. తరువాతి కాలంలో ఇజ్రాయేల్ కి చెందిన ELBIT సిస్టమ్స్ మనకి ఎలక్ట్రానిక్ జామర్స్ ని ఇచ్చింది! అవి కూడా అవుట్ డేట్ అయిపోయాయి కాబట్టి ఈ మూడు జెట్స్ మిసైల్ దాడికి గురయ్యే అవకాశం ఉందని గతంలోనే స్పష్టంగా చెప్పాను!

Ads

కానీ రాఫెల్ F3R కి విమానం చుట్టూ సెన్సర్స్ ఉంటాయి. అందుకే రాఫెల్ తో పాటు SPECTRA ELECTRONIC WARFARE SUIT అని పిలుస్తారు. EW సూట్ చాలా ఖరీదైన సిస్టం. F-35 కొనలేని దేశాలు NEXT BEST కేటగిరి కింద రాఫెల్ ని కొంటున్నాయి.

మన దగ్గర ఉన్న అన్ని జెట్ ఫైటర్స్ లకి లేనిది రాఫెల్ కి ఉన్నది RWR ( RADAR WARNING RECEIVER) ఉంది. భూమి మీద నుండి కానీ ( SAM), ఆకాశంలో నుండి ప్రయోగించే మిసైల్స్ ని పసిగట్టి RWR పైలట్ ని హెచ్చరిస్తుంది.

మరో సిస్టం ఉంది అది మిసైల్ అప్రోచింగ్ రాడార్ ( MISSILE APPROACHING RADAR) ఇది మిసైల్ ఎటువైపు నుండి వస్తున్నది, ఎంత వేగంగా వస్తున్నది అనే విషయాన్ని అంచనా వేసి వెంటనే చాఫ్స్ లేదా ఫ్లెర్స్ ( CHEFS or Flers ) ని రిలీజ్ చేయమని స్పెక్ట్రాకి కమాండ్ ఇస్తుంది. ఇదంతా పైలట్ ప్రమేయం లేకుండా జరిగిపోతుంది!

ఇవే ఫీచర్లు అమెరికన్ F-15 EX, F-35, F-22 లకి ఉన్నాయి. అందుకే ఈ ఫీచర్స్ ని ADD చేసి F-21 అనే పేరు పెట్టి లాక్ హీడ్ మార్టిన్ తన F-16 లని ( F-21) మనకి అమ్మడానికి సిద్ధపడింది. కానీ మనం కొనలేదు.

అఫ్కోర్స్! మన నావీ కోసం ఫైటర్ జెట్స్ కొనడానికి టెండర్లు పిలిచినపుడు లాక్ హీడ్ మార్టిన్ తన F-18 సూపర్ హార్నెట్ ని అమ్మచూపింది పైన పేర్కొన్న ఫీచర్స్ తో పాటు F-35 లో వాడుతున్న కొన్ని సెన్సర్స్ ని కూడా కలిపి ఇవ్వడానికి సిద్ధపడ్డా మనం రాఫెల్ M ( మేరైన్) కే ఆర్డర్ ఇచ్చాము.

ఇప్పటికే మిరేజ్, రాఫెల్ ని వాడుతున్నాము కనుక పైలట్లకి కానీ, స్పేర్ పార్ట్స్ తో పాటు లాజిస్టిక్స్ సమస్య ఉండదు అనే ఉద్దేశ్యంతో!

So! May 7, 8, 9 తేదీలలో జరిగిన కన్ఫ్లిక్ట్ లో అవుట్ రైట్ ఎయిర్ సుపీరియారిటి ( OAS ) వల్ల మనకి నష్టం జరగలేదు!
ఇక పైలట్ ఎర్రర్ వల్ల జరిగి ఉంటుందా?
పైలట్లు శిక్షణ తీసుకున్న తరువాత పీస్ టైమ్ సార్టీ ( Peace Time Sortie ) అనేది తప్పనిసరిగా ఉంటుంది ఏ దేశ ఎయిర్ ఫోర్స్ కి అయినా!

ఒకసారి గాల్లోకి లేచి ఒక రౌండ్ తిరిగి లాండ్ అవడాన్ని సార్టీ అంటారు. అంటే యుద్ధం లేని శాంతి సమయంలో రెగ్యులర్ సార్టీ లు ఉంటాయి!
ఏ దేశ పైలట్లు ఎన్ని గంటల ఫ్లైయింగ్ అనుభవం కలిగి ఉంటారు?
అమెరికన్ పైలట్లు సంవత్సరానికి 180 గంటల ఫ్లైయింగ్ అనుభవాన్ని గడిస్తున్నారు! ఇది చాలా ఎక్కువ సగటుగా చెప్తారు!

అదే యూరోపియన్ దేశాల పైలట్లు 120 గంటల ఫ్లైయింగ్ అనుభవాన్ని గడిస్తున్నారు! ఇది కావాల్సిన సగటు!
రష్యన్ పైలట్లు 80-100 గంటల ఫ్లైయింగ్ అనుభవాన్ని గడిస్తున్నారు! ఇది కావాల్సిన సగటు కంటే కొంచెం తక్కువ కానీ రష్యన్ పైలట్లు వాళ్ళ దేశంలోనే తయారైన వాటినే నడుపుతారు కాబట్టి సమస్య లేదు!

చైనాకి చెందిన డేటా అందుబాటులో లేదు! కానీ సోవియట్, రష్యన్ జెట్ ఫైటర్స్ తో పాటు స్వంత తయారీ విమానాలనే ఉపయోగిస్తుంది చైనా కాబట్టి వాళ్లకి సమస్య లేదు!

భారత్ విషయానికి వస్తే సంవత్సరానికి సగటున 200 గంటల ఫ్లైయింగ్ అనుభవాన్ని గడిస్తారు. ఇది కావాల్సిన సగటు కంటే ఎక్కువగా కనిపిస్తున్నా ఇందులో ఒక ట్విస్ట్ ఉంది, అది ఒక్కో పైలట్ రెండు రకాల ఫైటర్స్ ని నడపడంలో అనుభవం సంపాదించాల్సి ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు కదా!

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 5 దేశాల జెట్, రవాణా విమానాలని నడిపిస్తున్నది!
Mig-21, Mig-25( decommissioned), Mig-27 ( Decommissioned ), Mig-29K, Su-30MKI, IL-76 (transport), AN-32 (Transport) విమానాలు సోవియట్ రష్యావి.
Mirage 2000, రాఫెల్ F3R, ఎయిర్ బస్ C290 (Transport )లు ఫ్రాన్స్ వి.
సెపేకాట్ జాగ్వార్ జెట్లు బ్రిటన్ వి.
C130 J సూపర్ హెర్క్యూలస్ ( Transport), P 8 పెసోడియన్ ( సబ్ మేరైన్ హంటర్), సిర్కోస్కి MH-60R SEAHAWK హెలికాప్టర్ లు అమెరికావి.

ఇక తేజస్ తో పాటు రుద్ర, ప్రచoడ్, ధృవ్ హెలికాప్టర్స్ మన దేశంలోనే తయారవుతున్నాయి.
ఇంత వైవిధ్యమైన ఎయిర్ ఫోర్స్ ప్రపంచంలోనే ఒక్క మన దేశంలో ఉంది కాబట్టి పైలట్స్ కి శిక్షణ రోజువారీ డ్రిల్స్ నిర్వహించడం ఖర్చు, శ్రమతో కూడిన పని. ఈజీప్ట్ కూడా రష్యన్, అమెరికన్, ఫ్రెంచ్ జెట్స్ ని వాడుతుంది.

ఒక్కో ఇండియన్ పైలట్ కనీసం రెండు మోడల్స్ ని నడిపేట్లుగా డిజైన్ చేశారు డ్రిల్స్ ని. అభినందన్ Mig-21, Su-30 MKI ని నడపడంలో అనుభవం సంపాదించాడు. రెండూ రష్యన్ ఫైటర్ జెట్లే! కాబట్టి రోజువారీ డ్రిల్స్ విషయంలో ఒక్కో పైలట్ ఒక్కో ఫ్లైయింగ్ ఎక్సపీరియన్సు ఉంటుంది కాబట్టే సంవత్సరానికి ఎవరేజ్ ఫ్లైయింగ్ అవర్స్ 200 గంటలుగా ఉంటున్నది.

భారత ఫైటర్ జెట్ పైలట్స్ కి రోజువారీ డ్రిల్స్ విషయంలో ఎలాంటి లోపం లేదు మరియు నిర్దేశిత ఫ్లైయింగ్ అవర్స్ కంటే ఎక్కువే అనుభవం ఉంది.

**********
పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్
పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ పైలట్స్ ఎక్కువగా ఫిజికల్ ట్రైనింగ్ మీదనే ఆధారపడ్డారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అత్యాధునిక సిమ్యూలెటర్స్ మీద మరియు జెట్ ఫైటర్స్ మీద శిక్షణ మరియు డ్రిల్స్ ఉంటాయి.

పాకిస్తాన్ పైలట్ల ఫ్లైయింగ్ అవర్స్ సగటున 120 గంటలు ఉంటుంది! అత్యాధునిక సిమ్యూలెటర్స్ లేవు కాబట్టి నేరుగా జెట్ మీదనే డ్రిల్స్ ఉంటాయి కాబట్టి పాకిస్తాన్ పైలట్స్ స్కిల్స్ మరీ అంత అడ్వాన్స్ గా ఉండవు!

***********
పాకిస్థాన్ పైలట్స్ రోజు వారీ డ్రిల్స్ కోసం అయ్యే ఖర్చుని భరించే స్థితిలో లేదు ఎందుకంటే మెయింటనెన్స్ మరియు ఆపరేటింగ్ ఖర్చు ఒక గంటకి ఎంత అవుతుంది అంటే……
భారత్ రాఫెల్ – ₹11,73,000 ఒక గంటకి
భారత్ Su-30 MKI- ₹7,33,000 గంటకి
మిరేజ్ 2000 -₹ 2,00,000 గంటకి
Mig-29 ₹4,76,000 గంటకి
Tejas Mk 1A -₹ 2,93,000 గంటకి
ఇవి కాక ట్రాన్స్పోర్ట్ విమానాలకి గంటకి 47,00,000 దాకా ఖర్చు అవుతుంది.

పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్
F-16 – 16,500 డాలర్లు గంటకి
Jf-17 – 6,000 డాలర్లు గంటకి
J-10 C 7,000 డాలర్లు గంటకి

So! రోజువారీ డ్రిల్స్ కోసం పాకిస్తాన్ ఎక్కువ ఖర్చుపెట్టలేదు, ఎందుకంటే డాలర్ రిజర్వ్ అనేది అప్పు చేయడం వలన మాత్రమే, అదీ 1.5 బిలియన్లు గా ఉంటుంది ఎప్పుడూ.
ఈ గణాంకాలు అనేవి ఎవరేజ్ గా చెప్పబడుతున్నాయి కానీ ఖచ్చితమైన సమాచారం కాదు!

పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లు ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉన్నారు ఇజ్రాయేలి పైలట్స్ తరువాత అని గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ పైలట్ స్కిల్స్ అనేవి అత్యాధునిక సిమ్యూలెటర్స్ మీద మరియు ఫైటర్ జెట్స్ మీద నిర్విరామంగా డ్రిల్స్ చేస్తేనే మెరుగుపడుతాయి తప్పితే సోషల్ మీడియాలో చెప్పుకుంటే కాదు!

********************
మరి ఎక్కడ తప్పు జరిగింది?
పైన నేను చెప్పిన నాలుగు పాయింట్స్ లో పాయింట్ no 2 అంటే Strategy Error లేదా Command Error వలనే మన జెట్లు దెబ్బతిని ఉండాలి!
CDS జెనరల్ అనిల్ చౌహన్ మాటల్లో… MAY 7న పొరపాటు జరిగింది అన్నది వాస్తవమే కానీ దానిని సరిదిద్దుకొని 8 ,9, 10 తేదీలలో మేము పాకిస్తాన్ గగనతలం మీద ఆధిపత్యం సంపాదించాము అన్నారు ఇది కరెక్ట్!

ఒకవేళ చైనా, పాకిస్తాన్ లు చెప్పుకుంటున్నట్లు తమ J-10 C లు మరియు PL-15E లు అంత ప్రభావవంతమైనవి అయితే మిగతా నాలుగు రోజులూ ఎందుకని ప్రభావం చూపలేదు?
బౌలర్ గొప్పగా బాల్ వేయలేదు బాట్స్ మన్ చెత్తగా ఆడడం వలనే అవుట్ అయ్యాడు కానీ అంతిమంగా మ్యాచ్ ఏకపక్షంగా గెలిచామా లేదా అన్నదే లెక్క!

DISCLAIMER: ఈ ఆర్టికల్ లో పేర్కొన్న విషయాలు నా స్వంత విశ్లేషణ మాత్రమే! కానీ కూలంకషంగా చదివి అర్ధం చేసుకొని వ్రాసినది అని గమనించగలరు! గణాంకాలు 100% ఖచ్చితమైనవి కావు కానీ 80% అసలుకి దగ్గరగా ఉన్నాయని చెప్పగలను!…….. పార్థసారథి పొట్లూరి

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ పదేళ్ల స్వరాష్ట్ర పరిపాలనకు మరో వికృతకోణం ఇది…
  • GenZ … నెట్ వీథుల్లో విప్లవరచన… అసలు ఏమిటీ తరం..? చదవండి..!
  • Air Bag to Air Bus …. ప్రయోగాలు ఫలిస్తే విమానప్రాణాలకు శ్రీరామరక్ష…
  • భద్రం బీకేర్‌ఫుల్ బ్రదరూ… బీమా భరోసాలే కాదు, ఈ జాగ్రత్తలూ ముఖ్యమే…
  • వంశీ మార్క్ జమజచ్చ సినిమా.., అప్పట్లో జహిజట్… నవ్వుల్ డబ్బుల్…
  • ‘‘నేనెందుకు బాధపడాలి… బాధపడితే శోభన్‌బాబు పడాలి గానీ…’’
  • గుడిమల్లం..! ఉల్కశిల నుంచి చెక్కిన తొలి శివలింగ మూర్తి..?!
  • తాజా ఏబీసీ ఫిగర్స్… ఈనాడు- సాక్షి- ఆంధ్రజ్యోతి… ఏది ఎక్కడ..!!
  • ఒక మీడియా హౌజ్… ఆఫీస్ క్లోజ్… అందరూ కలం పోరాటయోధులే మరి..!!
  • Mirai..! భిన్నమైన ఓ కథకు రక్తికట్టించే ప్రజెంటేషన్… గుడ్ ఔట్‌పుట్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions