Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వీడొక యాదవ సాంబుడు..! లాలూ చెప్పే డొల్ల కుటుంబ విలువలు..!!

June 3, 2025 by M S R

.

మనం నివసిస్తున్న మన వ్యవస్థ ఎంత దరిద్రం..? మన పాలకులు, వాళ్ల వంశాలు, వాళ్ల పిల్లలు, వాళ్ల వేషాలు… నిజంగా భారతీయ సమాజం ఆదర్శనీయంగానే ఉందా..?

వాడు… పోనీ, వాడి కుటుంబం… అనగా లాలూ ప్రసాద్ యాదవ్ అనువాడి కుటుంబం… బీహార్ అనే రాష్ట్రాన్ని తరాలు వెనక్కి తీసుకెళ్లింది..? కులం, మాఫియా, నేరం, అజ్ఞానం కలగలిపిన పాలన ఆ ప్రజలకు ఓ దరిద్రం… ఈరోజుకూ ఆ ఛాయలు చెరిగిపోవు… ఆ పార్టీలు, ఆ రాజకీయ కుటుంబాలూ మారవు… ఫాఫం బీహారీలు…

Ads

తను కుర్చీ దిగితే పెళ్లాం కుర్చీ ఎక్కాలి… పాలనలోనే కాదు, చదువూ సంధ్యల్లేని నిరక్షర కుక్షి… ఐతేనేం, మూర్ఖజనం ఆమోదించారు… ఏడెనిమిది మంది పిల్లలు… ఇద్దరు కొడుకులూ స్కూల్ డ్రాపవుట్స్… ఐతేనేం, ఓ దశలో ఇద్దరూ మంత్రులే…

చిన్నోడి పేరు తేజస్వి యాదవ్, కాస్త నయం… చదువు ఒంటపట్టకపోయినా కాస్త కామన్ సెన్స్ అబ్బింది… పెద్దోడి గురించే చెప్పుకునేది… తేజ ప్రతాప్ యాదవ్… తనకు ఎవరితో పెళ్లయిందో తెలుసా..? ఐశ్వర్య… ఆమె ఎవరు..?

ఆమె తాత దరోగ ప్రసాద రాయ్… బీపీ మండల్ తరువాత బీహార్ యాదవ ముఖ్యమంత్రి తను…  జయప్రకాష్ నారాయణ్ ఉద్యమం తర్వాత 1970ల మధ్యలో లాలూ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, అతను గౌరవించే ఇద్దరు నాయకులు దరోగ రాయ్, మాజీ కేంద్ర మంత్రి రామ్‌లఖాన్ సింగ్ యాదవ్…

లాలూ రాజకీయాల్లో ఎదుగుతున్న కొద్దీ, సదరు రాయ్ కుటుంబంతో ఆయనకు అనుబంధం మరింత పెరిగింది… ఐశ్వర్య తండ్రి చంద్రికా రాయ్… 2015- 17 మధ్య ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్బంధన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు…

అటు యూపీలో ములాయం సింగ్ యాదవ్, ఇటు బీహార్‌లో లాలూ ప్రసాద్ యాాదవ్… వాళ్ల వారసులు… రెండు రాష్ట్రాలనూ కుళ్లబొడిచారు… అలాంటి లాలూ ప్రసాదుడు రీసెంటుగా తన కొడుకు తేజ ప్రతాపుడిని ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించాడట… వాడు చేసిన పాపం ఏమిటయ్యా అంటే…

ఈ తేజ ప్రతాపుడు 13 ఏళ్ల నుంచీ అనుష్కతో తను ప్రేమబంధంలో ఉన్నానని ప్రకటించాడు… అంటే 2013 నుంచే… మరి 2018లో ఆ ఐశ్వర్యతో పెళ్లెందుకు చేశాడు వాడి తండ్రి లాలూ..? విద్యావంతురాలు ఆమె… కొన్నాళ్లకే వీడి మగంగి వేషాలు, ఆడంగి వేషాలు గమనించి… బిత్తరపోయి, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, రెండు బలమైన యాదవ కుటుంబాల నడుమ వియ్యం కోసం తన గొంతు కోశారని అర్థం చేసుకుంది…

Tez-Pratap-Yadav-(తేజ ప్రతాప్ యాదవ్)

వాడి శాడిస్టిక్, మాడా చేష్టలు, వేధింపులతో… (ఆమె తనకు అడ్జస్ట్ కావడం లేదని ఆరోపించాడు వాడు ఓ దశలో…) వాడిని విడిచిపెట్టేసింది… ఆ విడాకుల కేసు ఇంకా తేలలేదు… ఆ కుటుంబం మీద ఆమె బోలెడు ఆరోపణలు చేసింది…

ఐశ్వర్యా యాదవ్(ఐశ్వర్యా యాదవ్)

ఇప్పుడు హఠాత్తుగా తేజ ప్రతాపుడు అనుష్కతో తన 12 ఏళ్ల యవ్వారాన్ని బయటపెట్టాడు… బీహార్‌లో ఓ కలకలం… విచిత్రం ఏమిటంటే… లాలూ తన కొడుకును పార్టీ నుంచి బహిష్కరించడం… కుటుంబ విలువలను భిన్నంగా వెళ్తున్నాడట… చివరకు ఆ లాలూ కూడా కుటుంబ విలువల గురించి మాట్లాడమే మన వ్యవస్థలోని పెద్ద దౌర్భాగ్యం…

అనుష్క(అనుష్క యాదవ్)

అయ్యో, కొందరు నా తండ్రికీ నాకూ నడుమ గొడవలు పెట్టాలని చూస్తున్నారు అని సదరు పిచ్చి కొడుకు స్టేట్‌మెంట్… ఏం ఫ్యామిలీరా బాబూ… (తేజస్వి యాదవ్‌కు చదువు లేకపోయినా, తను లీడర్‌గా ఎస్టాబ్లిష్ అయ్యాడు… చిన్నప్పటి తన ప్రేమికురాలు, స్నేహితురాలిని పెళ్లిచేసుకున్నాడు… కామన్ సెన్స్ ఉన్నోడు…)

ఒకవేళ లాలూ మళ్లీ సీఎం అయిపోయి, మళ్లీ జైలుకు పోయి, ఈసారి పెళ్లాం నాకు సీఎం పదవి వద్దుపో అనేసి ఉంటే… ఈ పిచ్చి కొడుకును సీఎం కుర్చీ మీద కూర్చోబెట్టేవాడేమో… అందుకే అనేది మనదెంత దౌర్భగ్యపు రాజకీయ వ్యవస్థ అని..!! గుర్తుంచుకొండి, ఖచ్చితంగా కుటుంబ పార్టీల అవినీతిలో అక్రమాలలో… ఇదుగో గడ్డి తినే నేతల ఇలాంటి దరిద్రపు వారసత్వాల్లో… ఈ దేశానికి ఎప్పుడూ చేటు, చేటు, చేటు..!!

(ఒకడెవడో థంబ్ నెయిల్ పెట్టాడు… ఐశ్వర్యా రాయ్‌ను వదిలేశాడు, అనుష్క శర్మను పట్టాడు అని…) (రాయ్, శర్మ సఫిక్సులు కరెక్టు కాదు, కానీ ఆ రెండు పేర్లు కరెక్టే…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సారీ… నాటి నాయకన్‌కు ఆమడల దూరంలో ఆగిపోయింది ఇది..!
  • ఉక్రెయిన్ యుద్ధతంత్రం… ఇండియాకు ఓ పెద్ద మేలుకొలుపు…
  • ఐపీఎల్… ఇదొక వికృత క్రీడ… ఆటగాళ్ల వేలంవెర్రి… ఓ పిచ్చి…
  • ఈ పిచ్చిది ఏదో చెబుతుంది… గుడ్డిగా ఫాలో అయ్యారో, బుక్కయిపోతారు…
  • సారీ-గమలు… మళ్లీ అదే పోకడ… అసలు తప్పేమిటో తెలియడాయె…!!
  • కాకులూ పగబడతాయ్… గుంపుకట్టి దాడిచేస్తయ్… ప్రతీకారం తీర్చుకుంటయ్…
  • ఆరోజున ఆ ముప్పు నుంచి లక్కీగా ఎలా తప్పించుకున్నామంటే..!!
  • విషాదమే… కానీ ఉన్మాదం… కర్నాటక సర్కారు ఘోర వైఫల్యం…
  • ఒక ఫోటో… కవితకు అసలు తెలియదో లేదో… గుర్తుందో లేదో ఫాఫం…
  • 500 రూపాయల నోట్ల చెలామణీపై వార్తలేమిటి..? నిజాలేమిటి…?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions