Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నచ్చావోయీ నాగేస్పర్రావూ… ఎస్, తక్కువేమి తమ్మీ… తగ్గేదేల్యా…

October 13, 2022 by M S R

ఫేస్‌బుక్‌లో  Siddharthi Subhas Chandrabose వాల్ మీద పోస్టు ఇది… చాలామంది షేర్ చేయడంతో మన న్యూస్‌ఫీడ్‌లో కూడా బాగానే కనిపిస్తోంది… బాగా కనెక్టయింది… అల్టిమేట్… కడుపు నింపుతున్న, చేస్తున్న పనిపట్ల గౌరవం, బతుకుతున్న బతుకు పట్ల గౌరవం, మది నిండా ఆనందం… ఈ క్షణం నాది… ఎంత మంచి ధోరణో కదా… సరే, ఆ పోస్టు యథాతథంగా మీరూ చదవండి ఓసారి…



మొన్న బిజీ సమయంలో ఉండవల్లి సెంటర్లో కళ్లకు చారడేసి కూలింగ్ గ్లాసులు పెట్టుకుని చెప్పులు కుట్టే ఇతడు నన్ను వివశుడిని చేశాడు. సంగతి తేల్చుదామని ఈ రోజు ఉదయం పొద్దున్నే కలిశాను.

మీరే కాదు మా ఎమ్మెల్యే కూడా కలుస్తారు నన్ను అన్నాడు. పేరు ఏసు అయినా, అందరూ సోగ్గాడని, శోభన్‌బాబు, నాగేశ్వర్రావు అని పిలుస్తారని చెప్పాడు.

Ads

cobbler

‘ఇదంతా ఎలా?’ అన్నాను.
‘ఏం ఎందుకు కాదు” అతడు సమాధానం.
“అదికాదు అందరూ చెప్పులు కుట్టడం తక్కువపని అంటారుకదా..”నసిగాను.
“నేను పని చేసుకుని బ్రతకడానికి గర్వపడుతున్నా” అన్నాడు.
కుశలం అడిగాను.
“అందంగా, హాయిగా బ్రతికి చచ్చిపోవాలి కదా, నేను అదే చేస్తునాను అన్నాడు. ఇల్లు కట్టిస్తున్నాను, సమస్యలేవీ లేవన్నాడు.

వెనకాల ఫోటోలు, అటుపక్కన పాటలు వినిపించే స్పీకరు, ఇటు పక్క గాలి విసిరే పంకా, వెనకాల అనుకున్న కుర్చీ, దాన్ని అనుకుని నిటారుగా నిలబడిన వెన్నుముక, మెడ చుట్టూ స్కార్ఫ్, ఇస్త్రీ దుస్తులు, చేతికి వాచీ, వేళ్లకి ఉంగరాలు, దర్జాగా కూలింగ్ కళ్లద్దాలు, పౌడరద్దిన మొహం.. అన్నింటికీ మించి మాట్లాడుతూన్నంతసేపూ నవ్వుమొహం…

మనమూ వున్నాం. ఆముదం మొహాలతో, వడలిపోయిన శరీరాలతో, బిక్కచచ్చిన ధైర్యంతో ఏడుస్తూ, చుట్టుపక్కలను ఏడిపిస్తూ,. బ్రతుకు తెలియక, బ్రతకలేక నిరంతరం చస్తూ.. సెలవు తీసుకుంటూ చెప్పాను, “ఎప్పటికీ ఇలాగే వుండాలి, తగ్గొద్దు”. తనన్నాడు “తగ్గేదేల్యా”….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions