నో డౌట్… నాగార్జున ఓ గుడ్ టీవీ హోస్ట్… టీవీ రియాలిటీ షోలకూ స్క్రిప్టులు, రిహార్సల్స్ గట్రా ఉంటయ్ కానీ ప్రధానంగా హోస్ట్‌కు స్పాంటేనిటీ ముఖ్యం… ప్రత్యేకించి బిగ్‌బాస్ వంటి రియాలిటీ షో హోస్టింగు అంత ఈజీ ఏమీ కాదు.., హౌజులోకి రకరకాల కేరక్టర్స్ వస్తారు.., రోజుల తరబడీ బయటి ప్రపంచానికి దూరంగా ఉంటారు.., గొడవలు, దోస్తీలు, లవ్వులు, వివాదాలు కామన్… పలుసార్లు కంటెస్టెంట్లలో ఫ్రస్ట్రేషన్ లెవల్స్ పెరుగుతూ షో నిర్వాహకులకు తలనొప్పిని కూడా క్రియేట్ చేస్తుంటయ్… వాళ్లను డీల్ చేయడం ఓ టాస్క్… ఈ విషయంలో నాగార్జునకు తన పెద్దరికం, తన రేంజ్, తన అనుభవం, ఫ్రెండ్లీ నేచర్ కలిసొస్తున్నయ్… ఈమధ్య వ్యక్తిగత, కుటుంబ చిక్కులతో బాగా డల్ అయిపోయినట్లు కనిపించాడు… ఆ పాత జోష్ తగ్గినట్టుగా కనిపిస్తోంది… కానీ నిన్న (శనివారం) వీకెండ్ షోలో నాగార్జున నలుగురు కంటెస్టెంట్లను డీల్ చేసిన తీరు భేషుగ్గా ఉంది…
ఆనీ మాస్టర్, సిరి, షణ్ముఖ్, మానస్… నలుగురినీ విడివిడిగా కన్ఫెషన్ రూంలోకి పిలిచి… వాళ్లను సున్నితంగా వార్న్ చేస్తూనే, మరోవైపు నేనున్నాను అనే ధీమాను ఇస్తూ, బుజ్జగిస్తూ, కౌన్సిలింగ్ ఇచ్చిన తీరు మెచ్చేలా ఉంది… ఇక్కడ బిగ్‌బాస్ టీం రాసిచ్చే స్క్రిప్టు ఏమీ ఉండదు… నాగార్జున అప్పటికప్పుడు తన ధోరణిలో వాళ్లను టాకిల్ చేయడమే ముఖ్యం… బిగ్‌బాస్ వంటి షోలకు నాగార్జున వంటి సీనియర్సే హోస్టులుగా ఎందుకు సూటవుతారో చెప్పే షో నిన్నటిది…
Ads
సిరి… ప్లజెంట్ నవ్వు, అందమైన మొహం… మంచి ఎనర్జీ లెవల్స్… మొదట్లో అందరికీ నచ్చింది… కానీ క్రమేపీ షణ్ముఖ్‌తో జతకూడి, పిచ్చిపిచ్చిగా చేయడం స్టార్ట్ చేసింది… తనపైన సదభిప్రాయం మొత్తం దూరం చేసుకుంది… ఆ హగ్గులు, ఆ కిస్సుల గురించి కాదు… షన్ను ఆమెను ఎందుకు విదిలిస్తాడో అర్థం కాదు, మళ్లీ ఎందుకు కౌగిలించుకుని ఏడుస్తారో అస్సలు అర్థం కాదు… మరీ మొన్న బాత్రూంలోకి వెళ్లి తనను తానే గాయపరుచుకుంది… అందరూ షాక్… ఇంకేమైనా చేసుకుని ఉంటే..? బిగ్‌బాస్ నిర్వాహకులు అడ్డంగా బుక్కయ్యేవాళ్లు… మరోవైపు షన్ను ఆమెను మించిన పిచ్చోడు… ఇద్దరినీ పిలిచి, కూర్చోబెట్టి, బయటికి పంపిస్తానని హెచ్చరిస్తూనే, సుతిమెత్తగా చురకలు వేస్తూనే, వాళ్ల తప్పుల్ని ప్రస్తావించి, దారిలో పెట్టడానికి నాగార్జున ప్రయత్నించాడు…
సేమ్, ఈమధ్య మరీ యారగెంటుగా మారిపోయిన ఆనీ మాస్టర్‌కు కూడా మెత్తగా వాతలు పెట్టాడు… ప్రత్యేకించి కాజల్‌ను వెక్కిరించిన తీరు బాగాలేదు… శుక్రవారం అయితే మరీ పూర్తిగా బ్యాలెన్స్ తప్పిపోయింది ఆమె… నిజానికి ఆమె మెచ్యూర్డ్ గేమర్… కానీ అకస్మాత్తుగా ఏమైందో తెలియదు… ఎదుటివాళ్లను గేమ్ అర్థం చేసుకోలేక ఫ్రస్ట్రేషన్‌కు లోనవుతున్నట్టుంది… అది ఓ ఆట… కుట్రలుంటయ్, అబద్ధాలుంటయ్, గ్రూపులుంటయ్, అన్నీ ఉంటయ్… అన్నీ భరించి, అధిగమించి గెలిస్తేనే లెక్క… ప్రియాంక విషయంలో ఈమధ్య బ్యాలెన్స్ తప్పుతున్న మానస్‌ను కూడా కాస్త మందలించాడు… తన వైఖరి కారణంగా ప్రియాంక డిప్రెషన్లోకి వెళ్తున్న తీరును వీడియోలో చూపించాడు… మరో యారగెంట్ సన్నీని కాస్త మెచ్చుకుంటూ, రవిని బకరా రవీ అంటూ ఆటపట్టిస్తూ, శ్రీరాంచంద్రను మెచ్చుకుంటూ నాగ్ నిన్నటి షోను కాస్త రక్తికట్టించాడు… ఈ బిగ్‌బాస్ సీజన్ స్టార్టయ్యాక కాస్త మెచ్చుకునే ఎపిసోడ్ ఏదయినా ఉందంటే… అది ఇది మాత్రమే..!!
Share this Article