.
Pardha Saradhi Upadrasta …. మమతా బెనర్జీకి చెక్‌మేట్ పడిందా? బెంగాల్ రాజకీయాల్లో ‘మోటా భాయ్’ మాస్టర్ స్ట్రోక్
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఊహించని సంచలనం! మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఒంటెద్దు పోకడలపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన 20 మంది టీఎంసీ లోక్‌సభ ఎంపీలు ఇప్పుడు ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా మాస్టర్ ప్లాన్ అమలు చేశారు!
న్యూఢిల్లీలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసిన రెబల్ ఎంపీల బృందం, తాము ‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’ (NCP) లో విలీనమై, కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ (NDA) కూటమికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది.
Ads
‘మోటా భాయ్’ వ్యూహం.. చట్టపరమైన చిక్కులకు బై- బై!
ఈ విలీనం వెనుక బీజేపీ చాణక్య వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. తిరుగుబాటు ఎంపీలు నేరుగా బీజేపీలో చేరకుండా, ఈ ప్రాంతీయ పార్టీలో విలీనం కావడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి…
* ఫిరాయింపుల నిరోధక చట్టం నుండి విముక్తి…: టీఎంసీకి ఉన్న మొత్తం ఎంపీల బలంలో 2/3 వంతు కంటే ఎక్కువ మంది (20 మంది ఎంపీలు) విడిపోయి, వేరే పార్టీలో విలీనం కావడంతో వారిపై ఎలాంటి అనర్హత వేటు పడదు…
* సుదీర్ఘ చట్టపరమైన పోరాటాలుండవు…
పార్లమెంటులో ‘ప్రత్యేక గ్రూపు’గా గుర్తింపు కోసం లేదా ‘అసలైన టీఎంసీ మాదే’ అని క్లెయిమ్ చేస్తూ సుప్రీంకోర్టు చుట్టూ తిరిగే తలనొప్పులు ఈ వ్యూహంతో పూర్తిగా తప్పిపోయాయి.
* బీజేపీ మద్దతుదారుల అంగీకారం…
టీఎంసీ ఎంపీలను నేరుగా బీజేపీలోకి తీసుకుంటే స్థానిక కేడర్ నుండి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. కానీ, మిత్రపక్షంగా ఎన్‌డీఏలోకి రావడం వల్ల బీజేపీ మద్దతుదారులకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు.
అసెంబ్లీలోనూ దీదీకి షాక్!
పార్టీ చీలిక కేవలం దిల్లీకే పరిమితం కాలేదు; బెంగాల్ అసెంబ్లీలోనూ 64 మందికి పైగా టీఎంసీ ఎమ్మెల్యేలు ఇప్పటికే తిరుగుబాటు చేసి వేరు కుంపటి పెట్టుకున్నారు. అసలైన టీఎంసీ ఎవరిదనే పంచాయితీని ఎమ్మెల్యేలే చూసుకుంటారు. ప్రస్తుతానికి 64 మంది రెబల్స్/ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను స్పీకర్ విపక్ష హోదాలో గుర్తించారు.
మొత్తానికి పశ్చిమ బెంగాల్, అస్సాం, త్రిపురలలో విస్తరిస్తున్న ఈ కొత్త ‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’ ద్వారా ఎన్‌డీఏ లోక్‌సభలో తన బలాన్ని 313 దాటించుకుని మరింత పటిష్ఠం చేసుకుంది…
కొత్త NDA
భారతీయ జనతా పార్టీ (BJP): 240 సీట్లు
నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ (NCP – రెబల్ TMC వర్గం): 20 సీట్లు (కొత్తగా చేరిన ప్రాంతీయ మిత్రపక్షం)
తెలుగుదేశం పార్టీ (TDP): 16 సీట్లు
జనతాదళ్ యునైటెడ్ (JD-U): 12 సీట్లు
శివసేన (SHS – షిండే వర్గం): 7 సీట్లు
లోక్ జనశక్తి పార్టీ (LJP – రామ్‌విలాస్): 5 సీట్లు
జనసేన పార్టీ (JSP): 2 సీట్లు
జనతాదళ్ సెక్యులర్ (JD-S): 2 సీట్లు
రాష్ట్రీయ లోక్‌దళ్ (RLD): 2 సీట్లు
ఇతర చిన్న మిత్రపక్షాలు (మరో 7 పార్టీలు తలా ఒక సీటు): 7 సీట్లు (అప్నా దళ్, అసోం గణ పరిషత్, AJSU, హిల్ స్టేట్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, సిక్కిం క్రాంతికారి మోర్చా, హిందుస్తానీ అవామ్ మోర్చా, అజిత్ పవార్ NCP)
మమతా బానో , భాయ్‌పో (అభిషేక్ బెనర్జీ)లకు రాజకీయంగా ఇంతకంటే పెద్ద దెబ్బ మరొకటి ఉండదు. కోట కుప్పకూలుతోంది.. బెంగాల్‌లో ‘ఖేలా’ (రాజకీయ ఆట) రివర్స్ అయింది!
మోటా భాయ్ రాజకీయంగా, చట్టపరంగా నాలుగు అడుగులు ముందే ఉంటున్నాడు. ఎవరు ఊహించని పెద్ద అడుగు ఇది.
#WestBengalPolitics #TMCSplit #MamataBanerjee #NDA #AmitShahMasterstroke #nationalistcitizensparty
Share this Article