Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పంచనేత్రం… అనగా ఫైవ్ ఐస్… అదొక అగ్రరాజ్యాల దుష్టకూటమి…

October 2, 2023 by M S R

పార్ధసారధి పోట్లూరి …. ఉగ్రవాదం-వెస్టర్న్ కల్చర్! ఉగ్రవాదుల పేరుతో అమాయకుల హత్యలు చేయడం పశ్చిమ దేశాల కల్చర్!

ఒక అమాయక ఆప్గన్ కుటుంబం ప్రాణం ఖరీదు ‘సారీ, రాంగ్ టార్గెట్”తో సరిపెట్టేసే సంస్కృతి! ఒక అమాయక ఇరాకీ పౌరుడి (ఉగ్రవాది కాదు) ప్రాణం ఖరీదు $60 వేల డాలర్లు అంటే డ్రోన్ నుండి ప్రయోగించే మిసైల్. రియల్ టైమ్ టార్గెట్ రూపంలో అమాయకులని తమ డ్రోన్ లేదా జెట్ ఫైటర్ లలో వాడే టార్గెట్ అక్విజిషన్ అండ్ ఫైరింగ్ సిస్టం ల సామర్ధ్యం పరీక్షించుకోవడానికి వాడుకున్న చరిత్ర పశ్చిమ దేశాలది!

అలా పరీక్షించిన ఆయుధాలని మన దేశంకి అమ్మడానికి ప్రయత్నిస్తాయి!

Ads

ప్రస్తుతం ప్రపంచంలోనే ఆయుధాలు అమ్ముకోవడానికి అవకాశం ఉన్న అతి పెద్ద మార్కెట్ భారత దేశం మాత్రమే!

రష్యా, అమెరికా, ఫ్రాన్సు దేశాలు భారత్ లో తమ ఆయుధాలని తయారుచేసి భారత్ తో పాటు మిగతా దేశాలకి అమ్ముకోవడానికి సిద్ధంగా ఉండడమే కాదు ఆదిశగా వేగంగా చర్యలు తీసుకుంటున్నాయి!

**********************

ఇదంతా నాణేనికి ఒక వైపు!

మరోవైపు భారత్ లో అస్థిరత సృష్టించి తమకి అనుకూలంగా పనులు చక్క పెట్టుకోవాలి అనేది పశ్చిమ దేశాల వ్యూహం! ఇది చాలా పాతదే!

The Five Eyes!

The five eyes పేరుతో ఇంటెలిజెన్స్ ని పరస్పరం పంచుకునే ఆలోచనతో 5 దేశాలు ఒప్పందం చేసుకున్నాయి!

అమెరికా, ఇంగ్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ దేశాల ఇంటిలిజెన్స్ సంస్థలు ఈ ఫైవ్ అయిస్ భాగస్వాములు!

గమనించారా?

ఈ అయిదు దేశాలలో భారత పౌరుల సంఖ్య గణనీయంగా ఉంది!

కేవలం ఈ అయిదు దేశాల మధ్యనే ఒప్పందం కుదరడానికి కారణం ఖాలిస్తాన్ ని సమర్ధించే సిక్కుల సంఖ్య ఉంది.

గత మార్చి నెలలో అమెరికా, ఇంగ్లాండ్, కెనడా దేశాలలో భారత కాన్సులేట్, రాయబార కార్యాలయాలముందు ఖలిస్తానీ మద్దతుదారులు ప్రదర్శనలతో పాటు ఆయా కార్యాలయాలని ధ్వంసం చేస్తున్నా చోద్యం చూస్తూ ఊరుకున్నాయి ఆయా దేశాలు.

అవును దానికి ఈ దేశాలు పెట్టె పేరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్!

అదే సద్దాం హుస్సేన్, మొహమ్మద్ గడాఫీ ల విషయానికి వచ్చేసరికి నియంతృత్వం అవుతుతుంది. నియంతృత్వం ని అంతమొందించి ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం అన్ని దేశాలు ఏకం అయిపోయి సద్దాం హుస్సేన్ ని ఉరి తీశాయి.

లిబియా అధ్యక్షుడు గడాఫీ ని నడి వీధిలో పాశవికంగా కొట్టి చంపి ప్రజాస్వామ్యం ని పునరిద్దరించాయి పశ్చిమ దేశాలు!

*******************

సద్దాం హుస్సేన్, గడాఫీ ల విషయంలో వర్క్ ఔట్ అయిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ మోదీజీ విషయంలో ఏ మాత్రం వర్క్ ఔట్ కాలేదు.!

హఠాత్తుగా ఖాలిస్తాన్ మూవ్మెంట్ తెరమీదకి రావడం యాదృచ్చికం కాదు!

రైతుల ఆందోళన పేరుతో ఖలిస్తానీ ఉగ్రవాదుల పాత్ర ముందుగా ప్లాన్ చేసిందే!

బిడెన్, రాహువు, యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ లు తరుచూ పత్రికా స్వేచ్ఛ, మత స్వేచ్చల గురుంచి మోదీజీ వైపు వేలు చూపడం యాదృచ్చికం కాదు!

అయితే ఖలిస్తానీ మూవ్మెంట్ ని వెనక ఉండి ప్రోత్సహిస్తూ పరోక్షంగా పాకిస్థాన్ ISI ని ప్రమోట్ చేస్తున్నాయి!

******************

FIVE EYES పేరుతో ఇంటెలిజెన్స్ ని షేర్ చేసుకుంటున్న అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఇంగ్లా౦డ్,న్యూజీలాండ్ దేశాలకి మోదీజీ ఇచ్చిన షాక్ గురుంచి మాట్లాడుకోవాలి!

జస్టిన్ ట్రాడూ జెలెన్స్కీ కి మొదట ఉప్పందించిన జో బిడెన్ తరువాత వెనక్కి తగ్గడానికి కారణం ఏమిటి?

ఆస్ట్రేలియా ప్రధాని కెనడాకి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడాడు?

రిషి శునక్ ట్రాడూ విమర్శని ఎందుకు వ్యతిరేకించాడు?

5 eyes దేశాలలో 4 దేశాలు కెనడా కి ఎందుకు దూరం జరిగాయి?

RAW కోవర్టులు!

భారత ప్రభుత్వం ప్రకటించిన ఖాలిస్తాన్ ఉగ్రవాదుల జాబితాలో RAW కోవర్టులు ఉన్నారు!

వీళ్ళని అమెరికా కానీ, కెనడా కానీ, UK లు కానీ అప్పగించవు!

So! కొంతమందిని RAW తన పరిధిలోకి తీసుకుంది!

ఇది గుడ్ ఓల్డ్ కోల్డ్ వార్ ఎరా స్ట్రాటజీ!

జో బిడెన్ ట్రాడూ చెవిలో నిజ్జర్ హత్య తాలూకు వివరాలు ఊదే సమయానికి నిషేధిత ఖలిస్తానీ ఉగ్రవాదుల జాబితాలో RAW కోవర్టులు ఉన్నారని,ఏదన్నా సమాచారం బయట పెడితే ఇన్నాళ్లూ తాము మద్దతు ఇచ్చిన సంగతి బయటపడుతుంది అని కెనడాని ఒంటరిని చేశాయి మిగతా దేశాలు!

అందుకే RAW ని ఇండియన్ మొస్సాద్ అని పిలవడం మొదలు పెట్టాయి!

ఎవరు మన వారు?

ఎవరు పరాయి వారు?

అంతా అజిత్ దోవల్ మాయ!

పంచతంత్రం కథలలో ఉన్నవి అన్నిటినీ అప్లై చేస్తున్నాడు అజిత్ దోవల్!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చివరకు పండుగల స్పెషల్ షోలలోనూ అవే రోత స్కిట్లా..?!
  • ఈ సీరీస్‌లో నిజం ఏదైనా ఉందీ అంటే… అది ఆ డిస్‌క్లెయిమర్ మాత్రమే…
  • కేటీయార్ వింత పొలిటికల్ ధోరణి..! రాను రాను ఓ సైద్ధాంతిక శూన్యత..!?
  • మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం… ఆహా… ఏవీ నాటి ఆర్ద్ర గీతాలు…?
  • ఎవరి పదవి ఊడబీకాలన్నా… ఏదో ఓ కేసులో అరెస్టు చేస్తే సరి ఇక..!!
  • అదే కథ, అదే పాత్ర… విజయచందర్ సూపర్ హిట్… నాగార్జున ఫ్లాప్…
  • కాళేశ్వరంపై బీఆర్ఎస్ క్యాంప్ ఆపసోపాలు… నానా విఫల సమర్థనలు…
  • కాంతారా బీజీఎం మోతల వెనుక ఈ ఆఫ్రికన్ గిరిజన వాయిద్యం..!
  • సింగరేణి మట్టి కూడా బంగారమే… అత్యంత విలువైన ‘రేర్ ఎర్త్ మినరల్స్’…
  • ఎందుకు కట్టాలి టోల్..? భలే బాగా చెప్పారు యువరానర్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions