అంతర్జాతీయంగా యుద్ధనిపుణులు, ఉగ్రవాద సంస్థలు, మిలిటరీ సర్వీసెస్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి… ఒకేసారి కొన్ని వందల పేజర్లు పేలిపోయి, లెబనాన్ కేంద్రంగా ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా పోరాడే దాదాపు 3 వేల మంది హెజ్‌బొల్లా ఉగ్రవాదులు తీవ్రంగా గాయపడిన సంఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది…
నో డౌట్… టెక్నికల్ డిఫెక్ట్స్ కారణం కాదు… పక్కా వ్యూహం అది… ఎవరు చేసింది..? ఇంకెవరు ఇజ్రాయిల్ గూఢచార సంస్థ మొసాద్… దాడులు, ప్రతిఘటన, రక్షణ, నిఘా విషయంలో టెక్నికల్‌గా ఇజ్రాయిల్ ఎంతో ముందంజలో ఉంటుంది… పైగా తమ దేశానికి నష్టం చేసే ఏ దేశాన్నీ, ఏ సంస్థనూ అది సహించదు, కసిగా కౌంటర్ చేస్తుంది…
ఏమిటీ పేజర్లు..? ఈతరంలో చాలామంది తెలియవు… అవి వన్ సైడ్ సమాచారాన్ని అందుకునే గాడ్జెట్స్… కొన్నేళ్ల క్రితం ఇండియాలో కూడా (మొబైల్స్ రాకమునుపు) రాజ్యమేలాయి… మనం ఫలానా నంబర్ పేజర్‌కు ఫలానా సమాచారం ఇవ్వాలి అని సెంట్రలాఫీసుకు ఫోన్ చేస్తే, ఆ వ్యక్తి ఎక్కడున్నా సరే, ఆ మెసేజ్ పేజర్లకు చేరుతుంది… మరి ఈ కాలంలో వేలాదిగా ఇంకా ఎందుకు వాడుతున్నారనేది కదా ప్రశ్న…
Ads
మొబైల్స్ ఆధారంగా ఉగ్రవాదుల జాడ తీయడం ఇజ్రాయిల్‌కు చాలా అలవోక… అంతెందుకు..? మొబైల్స్ వచ్చాక మావోయిస్టు పార్టీ చాలా నష్టపోయింది… అగ్రనేతల్ని కోల్పోయింది… కారణం, మొబైల్స్ కాల్స్ ఆధారంగా, సిగ్నల్స్‌ను బట్టి, పోలీసులు వాళ్ల జాడల్ని పట్టేసి మట్టుపెట్టడం వల్ల..! ఈ నష్టాలు తెలుసు కాబట్టే, హెజ్‌బొల్లా ఉగ్రవాదులు చాన్నాళ్లుగా మొబైల్స్ బదులు పేజర్లనే వాడుతున్నారు… సేఫ్…
మొసాద్‌కు తెలుసు కదా… ఉగ్రవాద సంస్థ ఒకేసారి వేల పేజర్లకు ఓ తైవాన్ కంపెనీకి ఆర్డర్ పెట్టింది… దీన్ని మొసాద్ పసిగట్టింది… ఆపరేషన్ స్టార్టయింది… సదరు తైవాన్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చారు గానీ ఆ సంస్థ ఏదో యూరప్ దేశంలోని మరో కంపెనీకి ఆర్డర్ ఇచ్చి, తయారు చేయించి, తన పేరు ముద్రించి సప్లయ్ చేసింది… సరిగ్గా ఇక్కడే మొసాద్‌కు దొరికిపోయారు…
సదరు యూరప్ కంపెనీ ఏదో గానీ మొసాద్‌కు సహకరించిందని తాజా సందేహాలు… ప్రతి పేజర్‌లోనూ స్వల్పమొత్తం పేలుడు పదార్థం పెట్టి, ప్రత్యేక కోడ్ యాక్టివేట్ చేసినప్పుడు పేలేలా తయారు చేయించారు… ఒకేసారి అదే కోడ్ మెసేజ్ అన్ని పేజర్లకూ వెళ్లేలా చేశారు… ఇంకేం..? అన్నీ ఒకేసారి పేలిపోయి సదరు ఉగ్రవాద సంస్థ నిర్ఘాంతపోయింది… అది కలలో కూడా ఊహించని ఎదురుదాడి అది…
ఇదీ ఇప్పటివరకూ అందరూ సందేహిస్తున్న వ్యూహం… ఎస్, రాబోయే రోజుల్లో ఉగ్రవాదంపై దాడికీ టెక్నాలజీ బాగా ఉపయోగపడబోతోంది… ఒసామా బిన్ లాడెన్ నివాసాన్ని పిన్‌పాయింటుగా కనిపెట్టి, నిశ్శబ్దంగా భవనంపైకి దిగిన కమెండోలు నిమిషాల్లో ఆపరేషన్ పూర్తిచేయడంలో కూడా టెక్నాలజీ ఉపయోగపడింది తెలుసు కదా… ఇవేకాదు…
రాబోయే రోజుల్లో యుద్ధాల్లో కూడా ముఖాముఖి జవాన్లు పోరాడే సీన్లుండవు… ఎయిర్ బాంబింగ్, విమానాల పేల్చివేతలు, హైరేంజ్ గన్స్… యుద్ధాలు భవిష్యత్తులో అంతరిక్షంలో జరుగుతాయి, ఉపగ్రహాలను కూల్చేసుకుంటాయి దేశాలు… సముద్రంలో జరుగుతాయి, టార్పెడోలతో జలాంతర్గాముల్ని, యుద్ధనౌకల్ని పేల్చేసుకుంటాయి… డ్యాముల్ని కూల్చేయడం, కరోనా వంటి జీవాయుధాలు, ఆర్థిక యుద్ధాలు, కరెన్సీ యుద్దాలు…
యుద్ధరీతులు గణనీయంగా మారిపోతయ్… అదేసమయంలో ఉగ్రవాదంపై పోరు కూడా మారిపోతుంది ఈ పేజర్ల పేలుళ్లలాగే… ఉగ్రవాదం రూపు కూడా మారుతుంది… వేలాదిగా ఒక్కసారిగా పారాచూట్లు వేసుకుని శతృదేశంలో దిగి కనిపించినవాళ్లనల్లా చంపేసి, బందీలుగా తీసుకునిపోవడం… ఇజ్రాయిల్ మీద ఆమధ్య జరిగిన ఉగ్రవాద దాడి అదే కదా…! మనిషి మనుగడను కూడా టెక్నాలజీయే శాసించబోతోంది..!!
Share this Article