.
వావ్, వాట్ ఏ మ్యాచ్… ఐపీఎల్‌కు సంబంధించి ఈమధ్య రెండు మూడు మ్యాచులకు సంబంధించి ఈ మాట చెప్పుకున్నాం కదా… కానీ ఈరోజు క్లాసిక్ మ్యాచ్…
బ్యాటర్ల పిచ్ కాదు ఇది… బౌలర్ల పిచ్… పంజాబ్, బెంగుళూరు నడుమ మ్యాచ్… పాయింట్ల టేబుల్ చూస్తే పంజాబ్ ముందంజ… నిజంగానే ఈ సీజన్‌లో బాగా ఆడుతోంది… బెంగుళూరు కూడా పర్లేదు… మరీ ముంబై, చెన్నై, హైదరాబాద్ రేంజ్ దరిద్రంగా ఏమీ లేదు…
Ads
సరే, ఈ మ్యాచ్ విషయానికి వస్తే… వాతావరణ పరిస్థితుల రీత్యా 14 వోవర్లకు కుదించారు… టీ14 అన్నమాట… మొదట బ్యాటింగ్ చేసిన బెంగుళూరు చచ్చీచెడీ 9 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది… అదీ టిమ్ డేవిడ్ అజేయంగా చేసిన 50 పుణ్యమాని… లాస్ట్ ఓవర్ లో హ్యాట్రిక్ సిక్సులు… అవీ లేకపోతే ఏ 60 కో, ఏ 70 కో ఆలౌట్ అయిపోతుంది అనిపించింది… కోహ్లీ జస్ట్, వన్ రన్ ఓన్లీ…
ఒక దశలో 42 పరుగులకే ఏడు వికెట్లు… 63 పరుగులకు 9 వికెట్లు… పేక మేడలా కూలిపోయాయి వికెట్లు… బాల్‌కు బ్యాటు తాకించడానికే వణికిపోయారు బ్యాటర్లు… వావ్… బౌలర్ల సంపూర్ణ ఆధిపత్యం… ఇలాంటి మ్యాచులు కదా కావల్సింది, అవి కదా థ్రిల్లింగ్…
సరే, పంజాబ్ జట్టు కూడా తక్కువేమీ కాదు కదా… ధాటిగానే ఆరంభించింది… బెంగుళూరు బౌలర్లు కూడా బాగానే ఆడారు పాపం… కానీ అదృష్టం కలిసి రాలేదు… ఒక దశలో 53 పరుగులకే నాలుగు వికెట్లు… కానీ తరువాత జాగ్రత్తగా ఆడి 12 ఓవర్లలో గెలుపు సాధించింది… కానీ అంత అలవోకగా ఏమీ దక్కలేదు గెలుపు…
12 ఓవర్లు ఆడాల్సి వచ్చింది… 5 వికెట్లూ పడిపోయాయి… కానీ అదృష్టం పంజాబ్ వైపే ఉంది… అందుకే చివరకు విజయం దక్కించుకుంది… సాధారణ ఐపీఎల్ మ్యాచుల్లో దంచుడు బ్యాటింగుల సరళి చూస్తే ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఓ డిఫరెంట్ మ్యాచ్… క్రికెట్ ప్రేమికులను అలరించిన మ్యాచు…
Share this Article