.
వాట్ ఎ మ్యాచ్… ఐపీఎల్ అంటే దురభిప్రాయంతో ఉన్నవాళ్లు కూడా చప్పట్లు కొట్టిన మ్యాచ్… రాత్రి పంజాబ్, కోల్‌కత్తా టీమ్స్ నడుమ జరిగిన మ్యాచ్… ఆద్యంతం రక్తికట్టింది… చివరి బంతి దాకా వేచిచూడటం కాదు ఇది… చివరి వికెట్టు పడేదాకా ఎదురుచూడటం ఉత్కంఠతో…
నిజానికి ఐపీఎల్ అంటేనే బ్యాటర్ల ఆట అయిపోయింది కదా… మరీ ప్రత్యేకించి ఈ సీజన్‌లో బౌలర్లను చితకబాదుతున్నారు కదా… 200, 250 రన్స్ టార్గెట్లను కూడా ఉఫ్ అని ఊదేస్తున్న రోజులివి… దంచుడే దంచుడు కదా…
Ads
కానీ ఈ మ్యాచ్ వేరు… అచ్చంగా బౌలర్ల మ్యాచ్ ఇది… మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ టపటపా వికెట్లు కోల్పోయి, 15.3 ఓవర్లలో కేవలం 111 పరుగులకే చతికిలపడింది… హర్షిత్ రాణా మెరుపులు, మూడు వికెట్లు, అవన్నీ రమణదీప్ సింగ్ క్యాచులే… ఎవరూ పెద్దగా క్రీజులో నిలబడటానికి ప్రయత్నించలేదు…
ఆఫ్టరాల్ 111 పరుగుల టార్గెట్ కదా… కోల్‌కత్తా నైట్ రైడర్స్ పదీపన్నెండు ఓవర్లోల కొట్టిపారేస్తారు, టాప్ ఆర్డర్ బలంగా ఉన్న టీమ్ అనుకున్నారు అందరూ… పంజాబ్ టీమ్ ఓనర్ ప్రీతి జింతా మొహం వేలాడేసుకుని కూర్చుంది… విన్ ప్రాబబులిటీ ఒక దశలో పంజాబ్ జీరో… కానీ పంజాబ్ టీమ్ ఎక్కడా నిరుత్సాహపడలేదు… ఫైట్ చేసింది… భలే ఆడింది, గెలిచింది,..
వరుసగా కోల్‌కత్తా వికెట్లు కూల్చడం స్టార్ట్ చేశారు… ప్రత్యేకించి యజువేంద్ర చాహల్ తీసిన 4 వికెట్లు మొత్తం మ్యాచును పంజాబ్ వైపు తిప్పేశాయి… కాకపోతే ఓ దశలో ఇదే చాహల్ బౌలింగులో ఆండ్రూ రసెల్ ‘అడ్డీమార్ గుడ్డిదెబ్బ’ అన్నట్టుగా ఒకే ఓవర్‌లో రెండు సిక్సులు, ఓ ఫోర్ కొట్టి… కాసేపు ఉత్కంఠిను క్రియేట్ చేశాడు…
చివరి వికెట్టు పడిపోయేవరకు కూడా పంజాబ్ ఎక్కడా తమ పట్టు సడలించలేదు… 15.1 ఓవర్లలో 95 పరుగులకే ఆల్ ఔట్ చేసింది… ప్రతీ జింతా మొహంలో మళ్లీ మెరుపులు… ఈ విజయంతో పంజాబ్ పాయింట్ల పట్టికలో టాప్4 లో ఉండిపోగా… కోల్‌కత్తా ఆరో ప్లేసుకు చేరింది…
నిన్న చచ్చీచెడి ఓ మ్యాచ్ గెలిచినా సరే చెన్నై టీమ్ ఈరోజుకూ అట్టడుగున ఉంది… పాపం హైదరాబాద్ కింది నుంచి సెకండ్ ప్లేస్… ముంబై టీమ్ సెవెన్త్ ప్లేస్…
Lowest Totals defended in the IPL history:
111 – PBKS vs KKR, 2025
116 – CSK vs KXIP, 2009
118 – SRH vs MI, 2018
119 – KXIP vs MI, 2009
119 – SRH vs PWI, 2013
Share this Article