Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వావ్… మన కోహినూర్‌ను వాపస్ తీసుకురావడానికి భలే వీజీ ప్లాన్…

October 26, 2022 by M S R

మన చుట్టూ ఆవరించిన ఉన్న అనేక సమస్యల్ని వర్తమాన వ్యవహారాలతో లింక్ చేసి జోకులు వేసి నవ్వుకోవడం ఆరోగ్యకరమైన హాస్యం… ఎవరినీ కించపరచాల్సిన అవసరం లేదు… మన క్రికెటర్ ఆశిష్ నెహ్రా, రిషి సునాక్ పోలికలతో వచ్చిన బోలెడు మీమ్స్ అలాంటివే… సరదాగా నవ్వుకోదగినవి…

నెహ్రా అంటే గుర్తొచ్చింది… సాక్షి వాడైతే ఏకంగా ప్రధాని మోడీ, నెహ్రా కలిసి ఉన్న ఓ ఫోటోను సైటులో పెట్టిపారేశాడు… (సునాక్ ఫోటోల్లో కలిపేశాడు… పబ్లిష్ చేసేముందు ఎవరు నెహ్రాయో, ఎవరు రిషియో పోల్చి చూసుకున్నారా..? కనీసం రిషి, మోడీ భేటీ జరిగిందా ఎప్పుడైనా..? వంటి వివరాలు కూడా కన్‌ఫమ్ చేసుకునే ప్రయత్నం జరగలేదు… పూర్ క్వాలిటీ, వెరీ పూర్ క్వాలిటీ సెల్)…

rishi

Ads

ఎవరో ఓ నెటిజన్ ఓ ఫన్నీ ట్వీట్ వదిలాడు… రిషి సునాక్ బ్రిటిష్ ప్రధాని అయ్యాడు కదా, ఇప్పుడు ఈజీగా మన కోహినూర్ వజ్రాన్ని మనం తెచ్చుకోవడానికి ఉన్న పద్ధతులేమిటి అనేది ట్వీట్… ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష గోయెంకా దాన్ని షేర్ చేసుకున్నాడు… అది బాగా వైరల్ అయిపోయింది…

సింపుల్… రిషి సునాక్‌ను ఇండియాకు ఇన్వయిట్ చేయాలి… బెంగుళూరు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతాడు కదా, అప్పుడు కిడ్నాప్ చేయాలి… తన స్థానంలో ఆశిష్ నెహ్రాను ఇంగ్లండ్ పంపించాలి… జస్ట్, తను అలా వెళ్తాడు, బిల్లు పెడతాడు, పాస్ చేయిస్తాడు, కోహినూర్ వచ్చేస్తుంది… నెహ్రా తిరిగి రాగానే రిషిని రిలీజ్ చేయాలి… ఇదీ ప్లాన్ అట…


My friend’s idea to get back #Kohinoor:
1. Invite #RishiSunak to India
2. Kidnap him when he is stuck in Bangalore traffic to visit his in-laws
3. Send instead Ashish Nehra as UK PM. No one will realise it.
4. Nehra will be told to pass the bill to return Kohinoor

💎 in 🇮🇳! 😀😀

— Harsh Goenka (@hvgoenka) October 25, 2022


ఇక దాని మీద బోలెడు కామెంట్లు, సవరణలు, మార్పులు… నిజమే… రిషి సునాక్ తన అత్తామామలను చూడటానికి బెంగుళూరు వస్తాడు ఎలాగూ… కానీ కిడ్నాప్ చేయడం దేనికి..? తను ట్రాఫిక్‌లో ఉన్నప్పుడే నెహ్రాను పంపించడం, పని పూర్తిచేసుకోవడం జరిగిపోతుందిగా… కిడ్నాప్ రిస్క్ దేనికి ఒక నెటిజన్ విశ్లేషణ…

అబ్బా, ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రిషి ఆగిపోతాడు… తిరిగి అది దాటేలోపు నెహ్రాను పంపించేసి, పని పూర్తిచేయిస్తే సరిపోతుందిగా, బెంగుళూరు ట్రాఫిక్ మీద నమ్మకం ఉంచుకోవాలండీ అని మరొకరు… కానీ ఒక జాగ్రత్త తప్పనిసరి, నెహ్రా పనిపూర్తయ్యేసరికి అస్సలు నోరు తెరవొద్దు… లేకపోతే తన ఢిల్లీ బాపతు స్పెషల్ లాంగ్వేజీ హింగ్లిష్ మాట్లాడి దొరికిపోతాడు అని ఇంకొకరు కామెంటారు…

బాగున్నయ్… నిజమే కూడా… అరెరె, అనవసరంగా మంచి ప్లాన్ రివీల్ చేశారు, ఇప్పుడు ఇలాంటిదే మరో ప్లాన్ వెతకాలి ఇక అంటూ జోకాడు ఇంకొకాయన… ఇలా బోలెడు… రిషి సునాక్ ఎంత పాపులరయ్యాడో హఠాత్తుగా ఆశిష్ నెహ్రా కూడా అలాగే వార్తల్లో వ్యక్తి అయిపోయాడు ఇప్పుడు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions