మొన్నీమధ్య వాల్‌మార్ట్ సీనియర్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు పలువురు స్కూల్ లెవల్, కాలేజీ లెవల్ సైన్స్ టాలెంట్ కంపిటీషన్లకు జడ్జిలుగా వెళ్లారు… అక్కడ పిల్లల ఐక్యూ లెవల్స్, క్రియేటివిటీ స్టాండర్డ్స్, టెక్నికల్ నాలెడ్జి, థింకింగ్ రేంజ్ చూసి ఆశ్చర్యపోయారు… పిల్లల్ని జడ్జ్ చేస్తున్నామా, మనల్ని మనం అప్‌డేట్ చేసుకుంటున్నామా అన్న స్థాయిలో…
ఎస్, ఈతరం పిల్లల మేధస్సు ఖచ్చితంగా పెద్దది… పరిణామక్రమంలోని ఫిట్టెస్ట్ సర్వైవల్, జన్యు మార్పులు వంటి కారణాలు ఎలా ఉన్నా… గుట్టలకొద్దీ ఇన్‌ఫర్మేషన్‌కు యాక్సెస్ ఉండటం, తమ ఆలోచనల్ని ఆవిష్కరించుకునే ప్లాట్‌ఫారమ్స్ ఉండటం, కృత్రిమ మేధస్సు సాయం, చుట్టూ మేధో వాతావరణం, కొత్త టెక్నాలజీలు వంటి చాలా ఇతరత్రా కారణాలు ఉండవచ్చు గాక… కానీ పిల్లలు కొందరు వండర్స్ చేస్తున్నారు…
విండ్ మిల్స్‌లో రెక్కలు మూడు ఉండాలా… అయిదు ఉంటే బెటరా..? ఎందుకు..? భూమ్మీద వ్యవసాయ క్షేత్రాలను పెంచలేం కదా, సముద్ర ఉపరితలాన్ని ఎలా వాడుకోవచ్చు… వంటి కొత్త కొత్త సానుకూల, నిర్మాణాత్మక అంశాల దాకా ఆ పిల్లలు వెళ్లిపోయారట… ఇప్పుడు మనం చెప్పుకునేది మరింత వండర్ ఫుల్ నాలెడ్జి…
Ads
సెర్బియా, క్రొయేషియా నడుమ కిలోమీటర్ల కొద్దీ బోర్డర్ డిస్పూట్ ఉంది… అది డాన్యూబ్ నదీ ప్రాంతం… అందులో 128 ఎకరాల ఓ బిట్ ప్రత్యేకంగా కనిపిస్తోంది… ఆ రెండు దేశాలకూ దాని మీద సార్వభౌమాధికారం లేదు, అది తమదే అని క్లెయిమ్ చేసుకునే చరిత్రా లేదు… సరిగ్గా ఈ పాయింట్ డేనియల్ జాక్సన్‌ను ఆకట్టుకుంది… చదివాడు, ఇంకా చదివాడు… ఆరుగురు ఫ్రెండ్స్‌ను కలుపుకున్నాడు… బోలెడంత ఇన్‌ఫర్మేషన్‌ను వడబోశారు… తన వయస్సు ఎంతో తెలుసా…? జస్ట్, 14 ఏళ్లు…
ఈ పిల్లాడు ఆస్ట్రేలియాలో పుట్టాడు… బ్రిటన్‌లో పెరిగాడు… ఈ రెండు దేశాల నడుమ, నది నడుమ ఎవరికీ చెందని ఆ భూమిని ఓన్ చేసుకుని, అది తమ దేశం అని ప్రకటించాడు… (ఎవరికీ చెందకపోతే తనకు ఎలా సొంతమవుతుంది అనేది పెద్ద ప్రశ్న… అది వేరే సంగతి…) ఓ జెండా రూపొందించాడు… దానికి ప్రెసిడెంట్ అయ్యాడు… (మీకు నిత్యానందుడు సృష్టించిన కైలాసం గుర్తొస్తుందా..? ఎస్… కానీ నిత్యానందుడు ఓ దీవిని కొనుక్కుని… ఈ డేనియల్ ఎవరికీ ఓనర్‌షిప్ లేని ప్రాంతాన్ని ఎంచుకున్నాడు…
సరే, దాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తిస్తుందా లేదా… దానికి ఏమేం అడ్డంకులుంటాయి… ఇతర దేశాలు చూస్తూ కూర్చుంటాయా అనే ప్రశ్నలు ఎన్ని ఉన్నా సరే… అసలు ఆ ప్రదేశాన్ని గుర్తించడం, సొంత దేశం దిశలో బోలెడంత పరిశోధన చేయడం గట్రా మామూలు విషయం కాదు… ఆ ఆలోచనల రేంజ్ ఓసారి ఊహించండి…
అదేమిటో గానీ… ఈ సొంత దేశం ప్రకటించాక 400 మంది వచ్చేశారు అక్కడికి… అది నివాసయోగ్యం కూడా… అంతేనా..? 15 వేల మంది అక్కడికి వస్తామని దరఖాస్తు చేసుకున్నారు… దీన్ని ఎలా డీల్ చేయాలో క్రొయేషియాకు అర్థం కావడం లేదు… వెంటనే బలప్రయోగం చేయలేదు… కానీ తమ దేశం నుంచే అక్కడికి రాకపోకలు సాధ్యం… సో, గత అక్టోబరులో ఆ భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది…
తమ దేశంలోకి వెర్డిస్ వాసులు రాగానే అరెస్టులు చేయడం మొదలుపెట్టింది… దీంతో ఈ పిల్లలు హక్కుల ఉల్లంఘన, దౌర్జన్యం, అంతర్జాతీయ న్యాయసూత్రాలకు వయోలేషన్ పేరిట గాయిగత్తర స్టార్ట్ చేయడంతో వాళ్లను తీసుకెళ్లి వెర్డిస్‌లో తనే దింపసాగింది… వావ్… ఈ అపర చాణక్య పిల్లల ఆలోచనలు, అడుగులు పెద్ద పెద్ద పండిత బుర్రలకు కూడా అంతుపట్టడం లేదు… (ఫోటోస్ : ఐడ్రీమ్ పోస్ట్ సౌజన్యం…)
Share this Article